BigTV English

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Tim David – Brevis: ఇద్దరు విషయంలో అంబానీ తప్పుడు నిర్ణయం.. అతలాకుతలంలో ముంబై ఇండియన్స్

Tim David – Brevis: సౌత్ ఆఫ్రికా – ఆస్ట్రేలియా క్రికెట్ జట్ల మధ్య జరుగుతున్న టి-20 సిరీస్ నేపథ్యంలో డేంజర్ ఆటగాళ్లుగా మారారు ఇద్దరు ప్లేయర్స్. వారు ఎవరో కాదు.. ఒకరు సౌత్ ఆఫ్రికా యువ క్రికెటర్ డేవాల్డ్ బ్రేవిస్, మరొకరు ఆస్ట్రేలియా స్టార్ క్రికెటర్ టిమ్ డేవిడ్. టి-20 స్పెషలిస్ట్ గా పేరుగాంచిన ఈ ఇద్దరు ఆటగాళ్లు.. ఈ టోర్నమెంట్ లో అద్భుతంగా రాణిస్తున్నారు. ముఖ్యంగా డేవాల్డ్ బ్రేవీస్.. సౌత్ ఆఫ్రికా – ఆస్ట్రేలియా మధ్య జరుగుతున్న సిరీస్ లో ఆస్ట్రేలియా బౌలర్లకు చుక్కలు చూపిస్తున్నాడు. తాజాగా జరిగిన రెండవ టి-20 మ్యాచ్ లో ఏకంగా 125 పరుగులు చేసి దుమ్ము లేపాడు.


Also Read: Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

ఈ క్రమంలో సౌత్ ఆఫ్రికా తరపున అత్యధిక టి-20 వ్యక్తిగత స్కోర్ నమోదు చేసుకున్నాడు. అంతేకాకుండా సౌత్ ఆఫ్రికా జట్టు తరుపున సెంచరీ కొట్టిన అత్యంత పిన్న వయస్కుడిగా కూడా బ్రేవిస్ రికార్డుల్లోకి ఎక్కాడు. మరోవైపు టీమ్ డేవిడ్ కూడా ఈ రెండో టి-20లో ఓ భారీ షాట్ ఆడాడు. దీంతో ఆ బంతి స్టేడియం రూఫ్ పైకి వెళ్ళింది. సౌత్ ఆఫ్రికా స్పిన్నర్ పీటర్ వేసిన బంతిని టిమ్ డేవిడ్ భారీ షాట్ ఆడాడు. ఈ మ్యాచ్ లో 24 బంతులు ఎదుర్కొన్న టిమ్.. నాలుగు ఫోర్లు, నాలుగు సిక్సర్లతో సరిగ్గా 50 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు.


అయితే ఐపీఎల్ 2024 టోర్నమెంట్ లో ముంబై ఇండియన్స్ జట్టుకు ప్రతినిత్యం వహించిన ఈ ఇద్దరిని.. ఆ ఫ్రాంచైజీ 2025 మెగా వేళానికి ముందు రిలీజ్ చేసింది. దీంతో టిమ్ డేవిడ్ ని 2025 ఐపీఎల్ మెగా వేలంలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్టు దక్కించుకోగా.. బ్రేవిస్ ని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు దక్కించుకుంది. బ్రేవీస్ తన కెరీర్ లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాడు. ఐపీఎల్ ప్రారంభంలో ముంబై ఇండియన్స్ జట్టు తరుపున బరిలోకి దిగిన ఈ బేబీ ఏబి కి.. ఐపీఎల్ లో ముంబై ఇండియన్స్ తరఫున పెద్దగా అవకాశాలు దక్కలేదు. ఆ తర్వాత ఐపీఎల్ వేలంలో అన్ సోల్డ్ ప్లేయర్ గా మిగిలిపోయాడు. ఇక 2025 ఐపీఎల్ వేలంలో రీప్లేస్మెంట్ కింద చెన్నై జట్టులోకి వచ్చేసాడు.

Also Read: Sachin Tendulkar: సారా స్నేహితురాలినే గోకిన అర్జున్… సచిన్ కొడుకు ఇంత కామాంధుడా?

అనంతరం చెన్నై సూపర్ కింగ్స్ జట్టులో అద్భుతంగా రాణించాడు. ఇప్పుడు టి-20 లీగ్ లో దుమ్ము రేపుతున్నాడు. మరోవైపు టీమ్ డేవిడ్ కూడా అద్భుతంగా రాణిస్తున్నాడు. అయితే అంబానీ ఫ్యామిలీ ఈ ఇద్దరు ప్లేయర్ల టాలెంట్ ని గుర్తించి జట్టులో ఉంచుకుంటే సరిపోయేది. కానీ వాళ్లు చేసిన తప్పిదం కారణంగా ఈ ఇద్దరు ఇతర ఫ్రాంచైజీల్లోకి వెళ్లిపోయారు. ఈ ఇద్దరూ ఆటగాళ్లు ఇదే ఆట తీరును ప్రదర్శిస్తే వచ్చే సీజన్ లో ముంబై ఇండియన్స్ పైన కూడా సెంచరీలు చేసే ప్రమాదం పొంచి ఉంది. ప్రస్తుతం ఈ ఇద్దరు డేంజర్ ప్లేయర్స్ ఆటను చూస్తున్న క్రీడాభిమానులు.. ఈ ఇద్దరినీ ముంబై వదులుకోకుండా ఉండాల్సింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

Related News

Dhoni Fan Died: ఐపీఎల్ 2026 కంటే ముందే CSK జట్టులో పెను విషాదం!

Ramiz Raja: బాల్ లో చిప్ పెట్టారు.. వెస్టిండీస్ పై పాకిస్తాన్ సంచలన ఆరోపణలు.. అంతా తొండాట అంటూ !

Sachin Tendulkar: సారా స్నేహితురాలినే గోకిన అర్జున్… సచిన్ కొడుకు ఇంత కామాంధుడా?

Cristiano Ronaldo :పెళ్లికి ముందే 4 గురు పిల్లలు ఉన్నారా.. బయటపడ్డ రోనాల్డో భాగోతం!

Arjun Tendulkar: రహస్యంగా సచిన్ కొడుకు అర్జున్ టెండూల్కర్ ఎంగేజ్‌మెంట్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఇదే!

Big Stories

×