Viral video: దేశ రాజధాని నగరం ఢిల్లీలో భారీ వర్షం బీభత్సం సృష్టిస్తోంది. ఈ రోజు ఉదయం నుంచి కుండపోత వర్షం పడుతూనే ఉంది. భారీ వర్షం పడడంతో నగరమంతా స్తంభించిపోయింది. రహదారలపైకి భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఇప్పటికే లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. ఇళ్ల భారీగా వరద నీరు చేరడంతో ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. ఇక వాహనదారులు అయితే నరకయాతన గురవుతున్నారు. నగరంలో పలు చోట్ల భారీ చెట్లు, కరెంట్ పోల్స్ కూలిపోయాయి.
In Kalkaji very sad incident @Shehzad_Ind @BJP4Delhi @gupta_rekha @dtptraffic pic.twitter.com/2yV8fJ04ab
— Aditya khemka 🇮🇳 (@Adityakhemka16) August 14, 2025
అయితే.. భారీ వర్షం పడడంతో నగరంలోని కల్కాజీ ప్రాంతంలోని ఓ బైక్ పై రోడ్డు పక్కన ఉన్న భారీ చెట్టు కూలిపోయింది. చెట్టు వేర్లతో సహా వాహనాలపై పడిపోయింది. ఈ ప్రమాదంలో ఒకరు స్పాట్ లోనే మృతిచెందగా.. మరో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. అక్కడ కొన్ని వాహనాలు కూడా తీవ్రంగా దెబ్బతిన్నాయి. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో మహిళా చెట్టు కొమ్మల కింద చిక్కుకున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది. మహిళా ప్రాణాల కాపాడుకునేందుకు ప్రయత్నిస్తున్న దృశ్యాలు మనకు సోషల్ మీడియాలో కనిపిస్తున్నాయి. మరొక వీడియోలో బైక్ పైనున్న వ్యక్తి అక్కడిక్కడే మరణించినట్టు తెలుస్తోంది.
#WATCH | Delhi | A tree was uprooted at Paras Chowk in the Kalkaji area earlier today, following heavy rainfall in the area. A crane and excavator have been deployed to clear the area. pic.twitter.com/sw3ks5g3ZR
— ANI (@ANI) August 14, 2025
ALSO READ: AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?
గాయపడిన వారిలో 50 సంవత్సరాల వ్యక్తి.. అతని కుమార్తెకు తీవ్ర గాయాలు అయినట్టు స్థానికులు చెబుతున్నారు. వారిని వెంటనే సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. రోడ్డు పలు వాహనాలు కూడా ఎక్కడిక్కడ ధ్వంసమయ్యాయి. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైడ్రాలిక్ క్రేన్ ను ఉపయోగించి చెట్టును తొలగించారు. అక్కడ రోడ్డును క్లియర్ చేశారు. మున్సిపల్ అధికారులు మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చెట్లను కట్ చేసే పనిలో పడ్డారు.
ALSO READ: Anemia: నిత్యం ఈ సమస్యలు వేధిస్తున్నాయా ? అయితే రక్త హీనత ఉన్నట్లే !
కాగా.. ఢిల్లీ నగరంలో ఈ రోజు ఉదయం నుంచి కురుస్తున్న భారీ వర్షానికి ప్రజలు నానా ఇబ్బందులు పడుతున్నారు. రేపు ఇండిపెండెన్స్ డే వేడుకులకు ముందు రాజధాని నగరంలో చాలా ప్రాంతాలు జలమయం కావడంతో అనేక అండర్ పాస్ లు వరదనీరుతో మునిగిపోయాయి. ఇప్పటికే వాతావరణ శాఖ ఢిల్లీ నగరానికి రెడ్ అలర్ట్ జారీ చేసింది. గడిచిన 24 గంటల్లో ఢిల్లీలోని సప్దర్ జంగ్ లోని ప్రాథమిక వాతావరణ కేంద్రంలో 13.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. ఆయా నగర్‌లో 57.4 మి.మీ, పాలెంలో 49.4 మి.మీ, లోధి రోడ్డులో 12 మి.మీ, ప్రగతి మైదాన్‌లో 9 మి.మీ, పూసాలో 5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు వివరించారు. నగరంలో కనిష్ట ఉష్ణోగ్రతలు 23.6 డిగ్రీల సెల్సియస్‌కు తగ్గినట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. ఇది సాధారణం కంటే 3.2 డిగ్రీలు తక్కువ అని చెప్పారు అదే సమయంలో గరిష్ట ఉష్ణోగ్రతలు 32 డిగ్రీల సెల్సియస్‌కు చేరుకునే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.