Aishwarya Rai: ఐశ్వర్యారాయ్ (Aishwarya Rai) .. మాజీ విశ్వసుందరిగా పేరు సొంతం చేసుకున్న ఐశ్వర్యరాయ్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో ప్రపంచస్థాయి అభిమానులనే కట్టిపడేసింది. సినిమా రంగంలో మంచి పేరు ఉన్న నటీమణిగా చలామణి అవుతోంది. ఆకట్టుకునే అందం, అద్భుతమైన నటనతో ఊహించని క్రేజ్ సంపాదించుకోవడమే కాకుండా చేతినిండా బ్రాండ్ ఎండార్స్మెంట్ లతో అటు బిజినెస్ లో కూడా రాణిస్తూ మరింత ఇమేజ్ సొంతం చేసుకుంది. అంతేకాదు రీ ఎంట్రీ లో కూడా సినిమాలు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు భారీగా ఆస్తులు పెంచేసుకున్నట్లు సమాచారం.
భారతదేశంలో రెండవ ధనవంతురాలిగా ఐశ్వర్యకి గుర్తింపు..
2025 నాటికి ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఆస్తుల విలువ రూ.900 కోట్లని తెలిసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఆస్తులతో భారతదేశంలో రెండవ ధనవంతురాలిగా పేరు సొంతం చేసుకుంది. ఒకవైపు ప్రపంచ సుందరిగా కిరీటాన్ని అందుకోవడమే కాకుండా తన అద్భుతమైన పెర్ఫార్మన్స్ తో భారీ పాపులారిటీ అందుకుంది. అంతేకాదు బాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అత్యధిక పారితోషకం తీసుకుంటున్న హీరోయిన్ గా కూడా గుర్తింపు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఒక్కో సినిమాకు రూ.10 నుండి రూ.12 కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటూ ఆశ్చర్యపరుస్తుంది. అటు పలు యాడ్స్ ద్వారా ఏడాదికి రూ.10 కోట్ల వరకు సంపాదిస్తున్నట్లు సమాచారం.
ఐశ్వర్యరాయ్ ఆస్తులు..
ఒకవైపు నటిగా చలామణి అవుతూనే.. మరొకవైపు యాడ్స్ ద్వారా పాపులారిటీ అందుకున్న ఈమె.. ఇటు వ్యాపార రంగంలోకి కూడా అడుగుపెట్టింది. స్మార్ట్ పెట్టుబడుల కారణంగా బాలీవుడ్లో అత్యంత విజయవంతమైన వ్యాపారవేత్తలలో ఒకరిగా పేరు సొంతం చేసుకుంది. పాజిబుల్ , యాంబీ వంటి స్టార్టప్ కంపెనీలలో ఈమె పెట్టుబడులు పెట్టగా.. ఇవి భారీ లాభాలను అందిస్తున్నట్లు సమాచారం. రియల్ ఎస్టేట్ రంగంలో కూడా ఈమె పెట్టుబడిలో పెట్టింది. ముంబైలోని బాంద్రా ఏరియాలో సుమారుగా రూ.50 కోట్ల విలువచేసే ఒక బంగ్లా ఈమె సొంతం. ఇక అంతే కాదు దుబాయిలో కూడా వీరికి ఆస్తులు ఉన్నట్లు తెలుస్తోంది. అలా ఆస్తులతో కూడా అందర్నీ ఆశ్చర్యపరుస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తోంది ఐశ్వర్యరాయ్.
విడాకుల రూమర్స్ పై చెక్ పెడుతున్న జంట..
ఇక ఐశ్వర్యారాయ్ వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే.. అమితాబ్ బచ్చన్ వారసుడు అభిషేక్ బచ్చన్ ను వివాహం చేసుకుంది. వీరికి ఆరాధ్య అనే కూతురు కూడా జన్మించింది. ఇన్నేళ్ల వైవాహిక జీవితంలో సంతోషంగా ఉన్న వీరి మధ్యలోకి విడాకుల రూమర్స్ రావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయి అని చెప్పవచ్చు. ఇద్దరు విడాకులు తీసుకోబోతున్నారని ఎన్నో రకాల వార్తలు వార్తలు వినిపిస్తున్నా.. ఎప్పటికప్పుడు ఈ వార్తలకు చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు ఈ జంట. దీనికి తోడు ఇటు ఐశ్వర్యారాయ్ అటు అభిషేక్ బచ్చన్ ఎవరికి వారు రూమర్స్ కి చెక్ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. కానీ విడాకుల రూమర్స్ మాత్రం ఆగడం లేదు. అందుకే ఇప్పుడు వీరు వీటిని పట్టించుకోవడమే మానేశారని చెప్పవచ్చు.
ALSO READ:Coolie First Review: కూలీ మూవీ ఫస్ట్ రివ్యూ.. హైప్ ని మ్యాచ్ చేస్తుందా?