E-Paper
Advertisement

అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?

అజిత్ ఒక్కో యాడ్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా?
Advertisement

AJITH: సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు ఆదరణ ఎక్కువ ఉందంటే చాలు.. ఎన్నో వాణిజ్య సంస్థలు కళ్ళు చెదిరే ఆఫర్ ఇస్తూ తమ ఉత్పత్తులను ప్రమోట్ చేయిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ఒక్కొక్క హీరో సుమారుగా రూ.10 నుండి రూ.12 కోట్ల వరకు ఒక్కో యాడ్ కి రెమ్యూనరేషన్ తీసుకుంటూ అందరిని ఆశ్చర్యపరుస్తుంటే.. ఇక్కడ కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ తీసుకునే ఈ యాడ్ రెమ్యూనరేషన్ తెలిసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా ఈ రేంజ్ రెమ్యూనరేషన్ ఏంటి స్వామి అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు.

ఆశ్చర్యపరుస్తున్న అజిత్ యాడ్ రెమ్యూనరేషన్..

అసలు విషయంలోకి వెళ్తే.. కోలీవుడ్ స్టార్ హీరోగా తమిళ సినిమా ఇండస్ట్రీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్న హీరోలలో అజిత్ కూడా ఒకరు. రజినీకాంత్, దళపతి విజయ్ తర్వాత తమిళంలో ఎక్కువ ఫాలోయింగ్ దక్కించుకున్నారు. అలాంటి ఈయన ఒకానొక దశలో వరుస హిట్లతో రజినీకాంత్ , విజయ్ లను కూడా వెనక్కి నెట్టాడు. అయితే ఈ మధ్యకాలంలో అజిత్ కొంచెం జోరు తగ్గించారనే చెప్పాలి. తరచుగా సినిమాలు చేయకపోవడం.. తనకు ఇష్టమైన రేసింగ్ పై దృష్టి పెట్టడమే దీనికి కారణం అని చెప్పవచ్చు. అసలు విషయంలోకి వెళ్తే.. ఒక కంపెనీ కోసం అందులోనూ ఒక నిమిషం నిడివి ఉండే ప్రకటనలో నటించడానికి ఏకంగా 40 కోట్ల పారితోషకం తీసుకున్నాడు అన్న వార్త సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారింది.

ఒక్క నిమిషానికి 40 కోట్లా?

Advertisement

అయితే అజిత్ కి ఎంత డిమాండ్ ఉన్నా సరే.. ఒక్క నిమిషం యాడ్ కోసం 40 కోట్లా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. సాధారణంగా యాడ్స్ కి దూరంగా ఉండే అజిత్ ఇలా ఒక రియల్ ఎస్టేట్ కంపెనీకి ప్రచారం చేయడం పెద్ద విషయం , తన ద్వారా చేకూరే ప్రయోజనంతో పోలిస్తే ఇది ఎక్కువేం కాదు అంటూ ట్రేడ్ పండితులు కూడా చెబుతున్నారు. పైగా ఈ యాడ్ ప్రకటనను తమిళ దర్శకుడు ఏ ఎల్ విజయ్ రూపొందించారని, ఆయన కూడా 3 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఏది ఏమైనా ఈ నంబర్లు మాత్రం నమ్మశక్యంగా లేవు అని , మరికొంతమంది నిపుణులు కామెంట్లు చేస్తున్నారు. మరి ఇందులో నిజానిజాలు తెలియాల్సి ఉంది.

ALSO READ:నా మొదటి లక్ష్యం అదే.. నిజాలు బయటకొస్తాయ్ – యూట్యూబర్ నందన!

అజిత్ సినిమాలు..

Advertisement

అజిత్ సినిమాల విషయానికి వస్తే.. గత ఏడాది గుడ్ బ్యాడ్ అగ్లీతో మంచి విజయాన్ని అందుకున్న ఈయన.. ఇప్పుడు అదే చిత్ర దర్శకుడు అధిక్ రవిచంద్రన్ తో స్వీయ నిర్మాణంలో ఒక కొత్త సినిమా చేస్తున్నారు. యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి రెడ్ డెవిల్ అనే టైటిల్ కూడా ఖరారు చేశారు.. ఇకపోతే అజిత్ ఒకవైపు సినిమాలలో నటిస్తూనే.. మరొకవైపు తన ఫ్యాషన్ రేసింగ్ లో పాల్గొంటూ ఎప్పటికప్పుడు అభిమానులను ఆకట్టుకుంటున్నారు. అంతేకాదు పలుమార్లు ఈ రేసింగ్లో యాక్సిడెంట్లకు గురైనా.. తనను తాను మళ్ళీ పునరుద్ధరించుకుంటూ దూసుకుపోతున్నారు. ప్రస్తుతం అజిత్ కి సంబంధించిన ఈ యాడ్ రెమ్యూనరేషన్ మరొకసారి ఆయనను వార్తల్లో నిలిచేలా చేసింది.

Related News

వారణాసి కోసం పోటీ పడుతున్న బడా నిర్మాతలు?

జీవితంలో అప్పు చెయ్యని హీరో ఎవరో తెలుసా..?

అంజలికి పెళ్లి ఎప్పుడు? క్లారిటీ ఇచ్చేసిన హీరోయిన్

నాగ్ అశ్విన్‌కు ఆ సినిమా అంటే అంత ఇష్టమా?

ఆ క్షణం ఒంటరిని అనిపించింది..ఎమోషనల్ అయిన తారక్!

అవార్డు వేడుకకు పింక్ చీరలో వచ్చిన నిహారిక.. వెనుక అసలు కథ ఇదే!

అదే నడక.. అదే స్వాగ్.. యమదొంగను గుర్తు చేసిన తారక్!

Big Stories

Advertisement
×