Arabian Sea Drug Bust: భారత తీరప్రాంత భద్రతా దళం సముద్రంలో భారీ స్మగ్లింగ్ ముఠా ఆట కట్టించింది. ఇరాన్ పడవ వేదికగా సాగుతున్న వేల కోట్ల రూపాయల డ్రగ్స్ వ్యవహారాన్ని మన బలగాలు సమర్థవంతంగా చేధించాయి.
రంగంలోకి కోస్ట్ గార్డ్.. ఏటీఎస్
ఇరాన్ నుంచి వస్తున్న ఒక పడవలో భారీగా మత్తు పదార్థాలు అక్రమ రవాణా అవుతున్నట్లు గుజరాత్ ఉగ్రవాద నిరోధక దళానికి ముందస్తు సమాచారం అందింది. దీనితో వెంటనే అప్రమత్తమైన భారత కోస్ట్ గార్డ్ అధికారులు, ఏటీఎస్ బృందంతో కలిసి అరేబియా సముద్రంలో సంయుక్త ఆపరేషన్ చేపట్టారు. సెప్టెంబర్ 25న లక్షద్వీప్ సమీపంలో అనుమానాస్పదంగా కనిపిస్తున్న పడవను గుర్తించారు.
సినిమా తరహా ఛేజింగ్.. ఐదుగురి అరెస్ట్
కోస్ట్ గార్డ్ నౌకలను చూడగానే పడవలోని సిబ్బంది తప్పించుకోవడానికి ప్రయత్నించారు. అయితే మన అధికారులు సినిమాను తలపించేలా ఛేజ్ చేసి, ధైర్యంగా ఆ పడవలోకి ప్రవేశించారు. పడవను స్వాధీనం చేసుకుని తనిఖీ చేయగా.. అందులో ప్రయాణిస్తున్న ఐదుగురు సిబ్బంది పాకిస్థాన్‌కు చెందిన నావికులుగా తేలింది. అధికారులు వారిని తక్షణమే అదుపులోకి తీసుకున్నారు.
రూ. 3,000 కోట్ల విలువైన డ్రగ్స్ స్వాధీనం
పడవలో దాచిన సరుకును పరిశీలించిన అధికారులకు దిమ్మతిరిగే నిజాలు వెలుగులోకి వచ్చాయి. లభించిన దాంట్లో సుమారు 526 కిలోల మెథాంఫెటమైన్, హెరాయిన్ వంటి అత్యంత తీవ్రమైన మత్తు పదార్థాలు ఉన్నట్లు నిర్ధారించారు. అంతర్జాతీయ మార్కెట్లో వీటి విలువ రూ.3,000 కోట్లకు పైగానే ఉంటుందని అంచనా వేస్తున్నారు.
ముంబయికి పడవ తరలింపు..
స్వాధీనం చేసుకున్న డ్రగ్స్ సహా ఆ పడవను, అదుపులోకి తీసుకున్న పాకిస్థానీ నావికులను తదుపరి చట్టపరమైన చర్యల కోసం ముంబయి తీరానికి తరలించారు. ఈ అక్రమ రవాణా వెనుక అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాల హస్తం ఉందనే కోణంలో దర్యాప్తు వేగవంతం చేశారు. మన బలగాలు సమయస్ఫూర్తితో వ్యవహరించడంతో అంతర్జాతీయ స్థాయిలో నడుస్తున్న ఒక పెద్ద డ్రగ్ నెట్‌వర్క్ గుట్టు రట్టయింది.
Also Read: తెలంగాణ పాఠశాల విద్యలో సంచలన మార్పులు.. ఇకపై వారి చేతుల్లోనే మార్కులు!
In an intelligence-led joint operation with ATS Gujarat, and Central Intelligence Agency, @IndiaCoastGuard units interdicted a suspicious Iranian dhow in the Arabian Sea, west of #Lakshadweep. Positive detection, sustained tracking and a hot pursuit culminated in tactical… pic.twitter.com/p2BthJvndS
— Indian Coast Guard (@IndiaCoastGuard) September 30, 2026