E-Paper
Advertisement

చలి చంపేస్తోంది బాబోయ్.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు, కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత

చలి చంపేస్తోంది బాబోయ్.. తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు,  కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత
Advertisement

Cold winds In Telangana: తెలుగు రాష్ట్రాల్లో విచిత్రమైన వాతావరణం నెలకొంది. తుఫాన్ నేపథ్యంలో ఏపీలో వాతావరణ ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలో మాత్రం చలి చంపేస్తోంది. అంతేకాదు రాత్రి వేళ ఉష్ణోగ్రతలు కనిష్ట స్థాయికి పడిపోతున్నాయి. ఫలితంగా ప్రజలు వణికిపోతున్నారు. తాజాగా కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు అయ్యింది.

తెలంగాణలో పడిపోతున్న ఉష్ణోగ్రతలు

దేశంలోకి శీతాకాలం సీజన్ మొదలుకావడంతో వాతావరణ మారిపోయింది. ఎటు చూసినా పొగమంచు కమ్మేస్తోంది. ఉదయం 8 లేదా 9 అయినా సూర్యోదయం కనిపించలేదు. మరోవైపు ఉత్తరాధి నుంచి వీస్తున్న చల్లటి గాలుల ప్రభావం తెలంగాణపై పడింది. ఫలితంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతల్లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి.  కొన్ని చోట్ల అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదు కావడంతో ప్రజలు వణికిపోతున్నారు.

కోహీర్‌లో అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు

Advertisement

ముఖ్యంగా ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, ఖమ్మం, హనుమకొండ వంటి జిల్లాల్లో పగలు కాస్త ఎండ ప్రభావం ఉన్నప్పటికీ.. సాయంత్రం ఐదు గంటలు దాటగానే చలి తీవ్రత మొదలవుతోంది. శనివారం హైదరాబాద్‌లో కనిష్ఠ ఉష్ణోగ్రత 18.2 డిగ్రీల సెల్సియస్‌గా నమోదు అయ్యింది. గరిష్ఠంగా 30 డిగ్రీల నమోదు అయ్యింది. ఒక విధంగా చెప్పాలంటే ఉష్ణోగ్రతలు క్రమంగా పడిపోతున్నాయి. సాయంత్రం నుంచి చలి తీవ్రత క్రమంగా పెరగడం మొదలైంది. ఇక ఉమ్మడి మెదక్‌ జిల్లాలో చలి తీవ్రత పెరిగింది.

ALSO READ: యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!

Advertisement

వారం రోజులుగా అక్కడ కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. సంగారెడ్డి జిల్లా కోహీర్‌లో తెలంగాణలోని అత్యల్ప ఉష్ణోగ్రత నమోదు అవుతున్నాయి. ఈ సీజన్‌లో కోహీర్‌లో 11 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత రికార్డు అయ్యింది. జహీరాబాద్‌, మొగుడంపల్లి, న్యాల్‌కల్‌, కంగ్టి ప్రాంతాల్లో చలి క్రమంగా తీవ్రమవుతోంది. కోహీర్‌- 11 డిగ్రీలు, సత్వార్‌-11.7, అల్గోల్‌-11.9, మల్చెల్మ-12.4, కంగ్టి-12.6, మొగుడంపల్లి- 12.7, న్యాల్‌కల్‌ -13 డిగ్రీల సెలియస్ , జహీరాబాద్‌ 14.1, ఝరాసంగం 14.7, నారాయణఖేడ్‌ 15.1, సంగారెడ్డి 16.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

Related News

యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీలోకి.. పాలిటెక్నిక్ కళాశాలలు!

దేశ పోలీసు వ్యవస్థకే గ్రేహౌండ్స్‌ రోల్ మోడల్: డీజీపీ సీవీ ఆనంద్

భారత్ సమ్మిట్ పేరుతో దేశానికి అవమానం.. కాంగ్రెస్‌పై బండి సంజయ్ ధ్వజం

రియల్టర్​ హత్యకు 10లక్షల సుపారీ.. ఏడుగురు అరెస్ట్!

ఇంటిపై రెండు నిమిషాల పాటు డ్రోన్ కలకలం.. ప్రభుత్వానికి కవిత సూటి ప్రశ్నలు!

తలవంచి తిరిగి వస్తారా.. లేక ప్రధానిని నిలదీస్తారా.. సీఎం రేవంత్ పై హరీష్ రావు ఫైర్!

హైదరాబాద్‌కు మరో అంతర్జాతీయ గుర్తింపు.. PHFI క్యాంపస్‌కు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన

Big Stories

Advertisement
×