E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

ట్రాక్ ఎక్కిన అయ్యగారు.. లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!

ట్రాక్ ఎక్కిన అయ్యగారు.. లెనిన్ ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్!
Advertisement

Lenin:దివంగత నటులు అక్కినేని నాగేశ్వరరావు వారసుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అఖిల్ (Akhil Akkineni) గత కొంతకాలంగా సరైన సక్సెస్ లేక బాక్సాఫీస్ వద్ద బోల్తా కొడుతున్నారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలోనైనా ఆయన తన సత్తా చాటతారని అభిమానులు అనుకున్నారు. పైగా మంచి సక్సెస్ అందుకోవాలని విభిన్నమైన జానర్లను ఎంచుకుంటూ సక్సెస్ దిశగా అడుగులు వేసే ప్రయత్నం చేస్తున్నారు. కానీ ఆ ప్రయత్నాలు ఏమాత్రం సఫలం కావడం లేదు. అయితే ఈసారి ఎలాగైనా సరే బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకొని స్టార్ హీరోగా హోదాను దక్కించుకోవడానికి లెనిన్ అనే చిత్రంతో ట్రాక్ ఎక్కి ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు.

లెనిన్ మూవీ నుండి ఫ్యాన్స్ కు సర్ప్రైజ్..

భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా, అఖిల్ అక్కినేని హీరోగా రాబోతున్న చిత్రం లెనిన్. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగ వంశీ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ప్రముఖ లెజెండ్రీ సంగీత దర్శకుడు థమన్ అందిస్తున్న సంగీతం సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనంది. ఇకపోతే ఈ సినిమాను జూలై 10వ తేదీన ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఇటీవల మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. అయితే ఇప్పుడు విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ పెద్దగా ప్రారంభం కాకపోయినా.. ఇటు ట్రైలర్ రిలీజ్ డేట్ ను లాక్ చేసి అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చారు.

నాగ వంశీ మాస్టర్ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందా?

Advertisement

అయితే ప్రమోషన్స్ లేకుండానే సడన్ గా ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటించడం వెనుక నిర్మాత నాగ వంశీ మాస్టర్ ప్లాన్ ఉందనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. ఇప్పటివరకు ఈ సినిమా కోసం ఏ ఒక్కరు కూడా ప్రమోషన్స్ చేపట్టలేదు. ముఖ్యంగా అటు దర్శకుడు ఇటు హీరో, హీరోయిన్ ఎవరు కూడా మీడియా కంట పడడం లేదు.పైగా ప్రమోషన్స్ లేకుండా సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడం అత్యంత కష్టం. అలాంటిది ముందస్తు ప్రమోషన్స్ లేకుండా నేరుగా సినిమాను విడుదల చేస్తే థియేటర్ కి ఆడియన్స్ వస్తారా లేదా అనే అనుమానంలో.. ముందుగా ట్రైలర్ రిలీజ్ చేసి ఈ ట్రైలర్ తో సినిమాపై ఒక్కసారిగా హైట్ పెంచేలా నాగవంశీ భారీగా ప్లాన్ చేసినట్లు సమాచారం.

ట్రైలర్ రిలీజ్ డేట్ లాక్..

ఈ మేరకు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఈ సినిమా ట్రైలర్ ను జూన్ 30వ తేదీన గ్రాండ్ ఈవెంట్ నిర్వహించి విడుదల చేయాలని చిత్ర బృందం భావిస్తున్నట్లు తెలుస్తోంది. మొత్తానికైతే ఈ ట్రైలర్ తో సినిమాపై అంచనాలు పెంచేయాలని నాగవంశీ ప్లాన్ చేస్తున్నారు. మరి ఆయన ప్రణాళిక విజయవంతం అయితే మాత్రం లెనిన్ పై భారీ బజ్ ఏర్పడే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు కూడా అభిప్రాయపడుతున్నారు. మరి చూద్దాం తమ సినిమాను ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నాగవంశీ ఇంకెన్ని ప్రయత్నాలు చేస్తారో చూడాలి.

Advertisement

 

also read: Bigg Boss: విడాకులు ప్రకటించిన బిగ్ బాస్ విన్నర్ భార్య!

Related News

Bhagya Raj: మరణంలో కూడా ఆగని సాయం.. భాగ్యరాజ్ గొప్ప మనసుకు సినీలోకం ఫిదా!

కన్నీళ్లు పెట్టుకున్న రాజమౌళి.. బాహుబలి పార్ట్ 2 చూస్తానో లేనో అంటూ!

Ram Charan : లండన్ లో ‘పెద్ది’ సక్సెస్ సెలబ్రేషన్స్.. రామ్ చరణ్ కు గ్రాండ్ వెల్కమ్..

OG యూనివర్స్ ఎక్స్‌పాండ్.. మేకర్స్ నుండీ మరో సర్‌ప్రైజ్!

ఆంధ్రా వర్సెస్ తెలంగాణ… కాంట్రవర్సీకి తెరలేపిన ప్రియదర్శి ‘ఇడుపు కాయితం’ !

పెళ్లి, విడాకులపై త్రిష కామెంట్స్!

వెంకీ మామ ఆదర్శ కుటుంబం రిలీజ్ డేట్ లాక్.. మిస్ అవుతారేమో?

Big Stories

×