Akhil Akkineni: అఖిల్ అక్కినేని(Akhil Akkineni) ఇటీవల జైనాబ్ (Zainab)అనే అమ్మాయి మెడలో మూడు ముళ్ళ వేసి ఓ ఇంటి వాడు అయ్యాడు. అఖిల్ జైనాబ్ వివాహం జూన్ 6వ తేదీ అక్కినేని నాగార్జున(Nagarjuna) ఇంట్లోనే ఎంతో సింపుల్గా జరిగింది. ఈ పెళ్లి వేడుకకు ఇరువురు కుటుంబ సభ్యులతో పాటు కొంతమంది సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. జూన్ 6న పెళ్లి చేసుకోగా, 8వ తేదీ ఎంతో ఘనంగా రిసెప్షన్ నిర్వహించారు. ఈ రిసెప్షన్ వేడుకకు ఎంతో మంది సినీ రాజకీయ ప్రముఖులు కూడా హాజరయ్యారు.
జీవితంలో ముఖ్యమైన రోజు…
ఈ విధంగా అఖిల్, జైనాబ్ వివాహపు వేడుకలు ఎంతో ఘనంగా జరిగాయి. ఇక వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో కూడా పెద్ద ఎత్తున చక్కర్లు కొట్టాయి. తాజాగా అఖిల్ ఇప్పుడు తన పెళ్లి ఫోటోలను(Wedding Photos) సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో మరోసారి మీరు పెళ్లి ఫోటోలు వైరల్ అవుతున్నాయి. పెళ్లి జరిగిన ఇన్ని రోజులకు అఖిల్ తన పెళ్లికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ..“నా జీవితంలో అత్యుత్తమమైన రోజును మీతో పంచుకుంటున్నాను” అంటూ భావోద్వేగంగా కామెంట్ చేశాడు. ఇంత ఆలస్యంగా ఫోటోలు షేర్ చేయడం వల్ల “ఇప్పుడు పెళ్లయిందన్న విషయం చెబుతున్నారా?” అంటూ కొంతమంది సెటైర్లు కూడా వేస్తున్నారు. అయితే అఖిల్ షేర్ చేసిన ఫొటోలలో నాగార్జున, అమల ఉన్న ఫోటోలను షేర్ చేశారే తప్పా, నాగ చైతన్య, (Nagachaitanya)శోభితల(Sobhita) పిక్ మాత్రం ఒక్కటి కూడా షేర్ చేయకపోవడం గమనార్హం.
చైతూ శోభితను పక్కన పెట్టారా?
ఈ విధంగా నాగచైతన్య శోభిత ఫోటోలను షేర్ చేయకపోవడంతో నేటిజన్స్ విభిన్న రకాలుగా స్పందిస్తున్నారు. పెళ్లయిన కొద్ది రోజులకే అఖిల్ తన అన్నయ్య నాగచైతన్య శోభితను పక్కన పెట్టేశారా? అంటూ సందేహాలను కూడా వ్యక్తం చేస్తున్నారు. ఇలా తన భార్య తన తల్లిదండ్రులతో ఉన్న ఫోటోలను షేర్ చేసిన అఖిల్ ఎందుకని నాగచైతన్య, శోభిత ఫోటోలను షేర్ చేయలేదు అంటూ కామెంట్లు చేస్తున్నారు. అఖిల్ పెళ్లి తర్వాత చైతూ శోభిత ఇద్దరూ కూడా కొత్త కోడలికి అక్కినేని కుటుంబంలోకి ఆహ్వానం పలుకుతూ పోస్టులు పెట్టిన విషయం తెలిసిందే.
ఇక అఖిల్ సినీ కెరియర్ విషయానికి వస్తే.. అఖిల్ అనే సినిమా ద్వారా హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయిన ఈయన మొదటి సినిమాతో పరవాలేదు అనిపించుకున్న తదుపరి సినిమాల ద్వారా ఏ మాత్రం హిట్ అందుకోలేకపోయారు. ఇప్పటివరకు ఐదు సినిమాలలో నటించిన అఖిల్ ఏ ఒక్క సినిమాతో కూడా హిట్ కొట్టకపోవడంతో అభిమానులు కూడా నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఇటీవల అఖిల్ పుట్టినరోజు సందర్భంగా లెనిన్(Lenin) అనే సినిమాని ప్రకటించిన విషయం తెలిసిందే. మరి ఈ సినిమాతో అయినా అయ్యగారు హిట్టు కొట్టి అక్కినేని పరువు కాపాడుకుంటారా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పనులు జరుగుతున్నాయి.
Also Read: Tamannaah Bhatia: ఫాతిమా విజయవర్మ డేటింగ్ రూమర్స్.. విశ్వాసం అంటూ తమన్న పోస్ట్!