BigTV English

Kannappa Movie : వేస్ట్ సినిమా.. రూ.5 లక్షలు ఇస్తే దీని కంటే బెటర్ తీస్తా!

Kannappa Movie : వేస్ట్ సినిమా.. రూ.5 లక్షలు ఇస్తే దీని కంటే బెటర్ తీస్తా!

Kannappa Movie :అత్యంత భారీ బడ్జెట్ తో మంచు మోహన్ బాబు (Manchu Mohan Babu) వారసుడు మంచు విష్ణు (Manchu Vishnu) చేసిన చిత్రం కన్నప్ప(Kannappa). మోహన్ లాల్ (Mohan Lal), అక్షయ్ కుమార్(Akshay Kumar),, కాజల్ అగర్వాల్(Kajal Agarwal), బ్రహ్మానందం(Brahmanandam) , మధుబాల(Madhubala), ప్రభాస్ (Prabhas) వంటి భారీ తారాగణంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.


వారసులు అన్న అర్హత మాత్రమేనా?

అంతేకాదు ఈ సినిమా ద్వారా మంచు విష్ణు వారసులు అరియానా, వివియానా లతో పాటూ అవ్రామ్ కూడా నటించారు. ఇకపోతే వీరి ముగ్గురు చేసింది కొన్ని నిమిషాలే అయినా ఆ పాత్రలతో పెద్దగా ఆకట్టుకోలేదని చూసిన ఆడియన్స్ చెబుతున్నారు. ఒక్క మంచు విష్ణు వారసులు అన్న మాట తప్ప వారి వల్ల సినిమాకి ఉపయోగమేమీ లేదు అని కూడా కామెంట్లు చేస్తూ ఉండడం గమనార్హం.


వందల కోట్లు నాశనం చేశారంటున్న ఆడియన్స్..

ఇకపోతే ఒకవైపు ఈ సినిమా కొంతమేర పాజిటివ్ టాక్ తెచ్చుకుంది అంటే.. అది రెబల్ స్టార్ ప్రభాస్ వల్లే అని, ప్రభాస్ నటించిన ఆ 30 నిమిషాల సన్నివేశం సినిమాని ముందుకు తీసుకెళ్లిందని చాలామంది ఆడియన్స్ కామెంట్లు చేస్తున్నారు. ఇకపోతే మరి కొంతమంది ఈ సినిమాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విషయం తెలిసిందే. ఇదొక చెత్త సినిమా అని, దీనికోసం మనం టైం వేస్ట్ చేసుకొని వచ్చాము అంటూ ఒక ప్రేక్షకుడు థియేటర్లలో రెచ్చిపోయిన తీరు అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది.

5 లక్షలు ఇస్తే ఇంతకంటే గొప్ప సినిమా తీస్తా..

తాజాగా ఒక సినిమా థియేటర్ కి కన్నప్ప సినిమా చూడడానికి వచ్చిన ఆడియన్.. ఫస్ట్ ఆఫ్ పూర్తవగానే ఫ్రస్టేషన్ తో ఊగిపోయారు. ఇదొక చెత్త సినిమా, దీని కోసం వందల కోట్లు ఖర్చు చేశారు. రూ.5లక్షలు ఇచ్చినా చాలు ఈ సినిమాను అద్భుతంగా తీసి చూపిస్తానంటూ కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తోంది.

ఈ చెత్త స్టోరీ కోసం న్యూజిలాండ్ లో 7000 ఎకరాలు కొన్నారట..

ఇకపోతే సదరు ఆడియన్ చేసిన కామెంట్ల విషయానికి వస్తే.. ఫస్ట్ హాఫ్ పూర్తవగానే కోపంతో ఊగిపోయిన ఆ ఆడియన్ మాట్లాడుతూ.. “అసలు దీనిని సినిమా అంటారా? అదేమైనా స్టోరీ నా..? అసలు ఏమైనా ప్రజలకు అర్థం అవుతుందా..? టైంపాస్ కోసం థియేటర్లకు వచ్చిన మనము బేకారుగా కూర్చోవలసి వస్తోంది. ఆ స్టోరీలో ఒక్క పాయింట్ మీకేమైనా అర్థమయిందా.? కాకపోతే ఒక్క ఐదు నిమిషాలు ప్రభాస్ కోసం మాత్రమే చూద్దామని వచ్చాం అంతే. విష్ణుని చూద్దామని ఎవరు ఇక్కడికి రాలేదు. నటన, పద్మ నటన నాకు ఒక రూ.5లక్షలు ఇచ్చి చూడండి. ఇంతకంటే గొప్పగా ఈ కథను తీసి చూపిస్తాను.. ఈ సినిమా చూపించడానికి న్యూజిలాండ్ వెళ్లి 7000ఎకరాలు కొన్నాడంట.. ” అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆడియన్స్ ఆగ్రహం.. ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్ రిలీజ్

ప్రస్తుతం సదరు ఆడియన్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ముఖ్యంగా ఈ వీడియో తీస్తున్నంత సేపూ.. సినిమా చూడడానికి వచ్చిన మిగతా ఆడియన్స్ కూడా పగలబడి నవ్వారు. ఇకపోతే సినిమాపై ఆడియన్స్ ఇంత ఆగ్రహం వ్యక్తం చేస్తుంటే అటు సినిమా యూనిట్ మాత్రం ఇండస్ట్రీ హిట్ అంటూ పోస్టర్లు రిలీజ్ చేయడం నిజంగా ఆశ్చర్యకరమనే చెప్పాలి.

also read:Kannappa Movie: ప్రభాస్ మాత్రమే కాదు.. కన్నప్పలో పైసా ఆశించకుండా నటించిన స్టార్స్ వీరే!

Related News

Keerthy Suresh: Ai తెచ్చిన తంటా, ఏకంగా మహానటికే బట్టలు లేకుండా చేశారు

Mega Blast Glimpse : విశ్వంభర గ్లిమ్స్ అవుట్, ఇక ట్రోలింగ్ కు ఆస్కారమే లేదు

Tvk Mahanadu : TVK మహానాడు లో తొక్కిస‌లాట… స్పాట్ లోనే 400 మంది?

Thalapathy Vijay : విఎఫ్ఎక్స్ లేదు, సిజి లేదు. విచ్చలవిడిగా జనం

Cine Workers Strike : సినీ కార్మికుల సమ్మెలో బిగ్ ట్విస్ట్… నోటీసులు జారీ చేసిన లేబర్ కమిషన్

Heroine: ఆ ఎమ్మెల్యే హోటల్‌కి రమ్మంటున్నాడు.. హీరోయిన్‌ సంచలన ఆరోపణలు

Big Stories

×