E-Paper
Advertisement

మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!

మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!
Advertisement

Sara Ali Khan:సారా అలీ ఖాన్..సైఫ్ మొదటి భార్య కూతురైన ఈ బాలీవుడ్ బ్యూటీ ఇపుడు మరోసారి తన అందంతో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తాజాగా ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ మనీష్ మల్హోత్రా ఇంట్లో జరిగిన దీపావళి పార్టీలో ఈ అమ్మడు అదిరిపోయే లుక్‌లో కనిపించి అభిమానులని ఫిదా చేసింది.ముఖ్యంగా ఎరుపు రంగు లెహంగాలో సారా ఇచ్చిన ఫోజులు ఇప్పుడు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ పార్టీ కోసం సారా వేసుకున్న డ్రెస్ చూస్తే ఎవరైనా ఫిదా అవ్వాల్సిందే. ఎరుపు రంగు క్రాప్ టాప్, దానికి మ్యాచ్ అయ్యే లెహంగా ధరించింది. లెహంగా మొత్తం వెండి రంగు ఎంబ్రాయిడరీ వర్క్‌తో అందంగా ఉందనడంలో సందేహం లేదు . దీనికి తోడు భుజాల మీదుగా వేసుకున్న రెడ్ దుపట్టా ఆమె లుక్‌ను స్పెషల్‌గా మార్చేసింది కూడా.

Advertisement

ఇక ఫోటోలకు సారా ఇచ్చిన పోజులు కూడా అదిరిపోయాయననే చెప్పాలి. ఎక్కడా ఓవర్ గ్లామర్ షో చేయకుండా ట్రెడిషనల్ లుక్‌లోనే తన అందాన్ని ఒలకబోసింది ఈ అమ్మడు.దీంతో సారా ది వన్ అండ్ ఓన్లీ అంటూ కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు ఫాలోవర్స్.

మాములుగా మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీ అంటేనే బాలీవుడ్ సెలబ్రిటీల సందడి ఎలా ఉంటుందో చెప్పక్కర్లేదు. ఈ వేడుకకు స్టార్ హీరోలు, హీరోయిన్లు హాజరై తమ ఫ్యాషన్ లుక్స్‌తో ఆకట్టుకోవడం చాలా కామన్. అయితే సారా అలీ ఖాన్ మాత్రం తన రెడ్ లెహంగా లుక్‌తో ప్రత్యేకంగా నిలిచిందనే చెప్పాలి.

Advertisement

ఇక సినిమాల విషయానికి వస్తే సారా అలీ ఖాన్‌ 2018లో వచ్చిన కేదార్‌నాథ్ సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది కూడా . ఆ తర్వాత రణ్‌వీర్ సింగ్‌తో కలిసి సింబా సినిమాలో నటించి మరో సక్సెస్ ని మూట గట్టుకుంది . అనంతరం లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ 1, అత్రంగి రే సినిమాల్లో కనిపించి మెప్పించింది. ముఖ్యంగా ధనుష్, అక్షయ్ కుమార్‌లతో కలిసి నటించిన అత్రంగి రే సినిమాలో సారా నటన టాప్ నాచ్ అని చెప్పాలి.

ఆ తర్వాత విక్కీ కౌశల్‌తో కలిసి జరా హట్కే జరా బచ్కే సినిమాలో అలాగే గ్యాస్‌లైట్, మర్డర్ ముబారక్, ఏ వతన్ మేరే వతన్ వంటి సినిమాలతో సరికొత్త పాత్రలు చేసి అలరించింది ఈ స్టార్ కిడ్ .మొత్తానికి సినిమాలతోనే కాకుండా తన ఫ్యాషన్ స్టైల్‌తోనూ ఎప్పటికప్పుడు వార్తల్లో నిలుస్తున్న ఈ అమ్మడు తాజాగా మనీష్ మల్హోత్రా దీపావళి పార్టీలో దిగిన ఫొటోలతో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.

Tags

Related News

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

అలీ షూటింగ్‌లతో బిజీ.. నేను ఆసుపత్రిలో ఒంటరిగా.. జుబేదా ఆవేదన!

రూమర్లకు చెక్.. పండగకే రాబోతున్న ‘కాకా’ .. డైరెక్టర్ క్లారిటీ!

Big Stories

Advertisement
×