E-Paper
Advertisement

దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!

దాసరి నారాయణరావుతో ఆ సంఘటన.. డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్!
Advertisement

Siva Nageswara Rao:శివ నాగేశ్వరరావు..సిసింద్రీ ,పట్టుకోండి చూద్దాం వంటి ఎంటర్ టైనర్స్ తో పాటు హ్యాండ్స్ అప్ , ఫోటో వంటి థ్రిల్లింగ్ మూవీస్ ని తీసిన ఈ క్రేజీ వెటరన్ ఫిలిమ్ మేకర్ ఒక ఇంటర్వ్యూలో పాల్గొని పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధం గురించి ఇలా వివరించాడు.

దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ అవ్వాలనుకుని 

Advertisement

తనకి మొదటి నుంచి దర్శకుడు కావాలనే కోరిక ఉండేదని అయితే సినిమా రంగంలోకి అడుగుపెట్టిన సమయంలో దాసరి నారాయణరావు దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేయాలని అనుకున్నానని తెలిపారు . ఇదే ఆశతో మద్రాస్ వెళ్లినా.. ఆ అవకాశం మాత్రం వెంటనే దక్కలేదట. ఆ తర్వాత వేర్వేరు దర్శకుల దగ్గర పనిచేస్తూ తన ప్రయాణాన్ని కొనసాగించానని చెప్పుకొచ్చారు.

ఇక కాలక్రమంలో దర్శకుడిగా మారి, తన సినిమాలతో గుర్తింపు తెచ్చుకోగా ఒక సందర్భంలో వైజాగ్‌లో జరిగిన కార్యక్రమంలో దాసరి నారాయణరావును కలిసే అవకాశం వచ్చిందట. అప్పుడు తనకు మొదటి నుంచి ఆయన దగ్గర పనిచేయాలనే కోరిక ఉందని శివ నాగేశ్వరరావు చెప్పారట. ఆ మాట వినగానే దాసరి ఎంతో సంతోషంగా తనను ఆప్యాయంగా దగ్గరకు తీసుకుని గట్టిగా కౌగిలించుకున్నారని చెప్పారు. ఆ సంఘటన తనకు ఎంతో సంతోషాన్ని ఇచ్చిందని తెలిపారు. అప్పటి నుంచి దాసరి పుట్టినరోజు వేడుకలకు, డిసెంబర్ 31 రాత్రి జరిగే కార్యక్రమాలకు కూడా వెళ్లేవాడినని చెప్పారు.

Advertisement

దాసరి పిలిచి మరీ సినిమా అవకాశం 

ఇక దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధం గురించి ఇలా చెప్పుకొచ్చారు. ఒకరోజు దాసరి కార్యాలయం నుంచి ఫోన్ వచ్చిందట. గురువుగారు పిలుస్తున్నారని చెప్పడంతో ఆయన దగ్గరకు వెళ్లి కూర్చున్నారట.అప్పుడు దాసరి ఓ సినిమా గురించి మాట్లాడుతూ ‘పెళ్లిలో చూసిన ఆ అమ్మాయే కావాలి’ అనే మాటతో మొదలుపెట్టి, ఆ తర్వాత ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ గురించి మాట్లాడారట. ఆ టైటిల్ తనకు చాలా బాగా నచ్చిందని, ఆ సినిమాను శివ నాగేశ్వరరావుతో చేయించాలని అనుకుంటున్నానని చెప్పారట.

దీంతో ఒక్కసారిగా ఆశ్చర్యపోయానని, చాలా ఎగ్జైట్ అయ్యానని చెప్పారు. అయితే ఆ కథను నివాస్ అనే వ్యక్తి చెప్పాడని, తనకు కథ బాగా నచ్చిందని దాసరి వివరించారట. వెంటనే ఆ రచయితతో మాట్లాడాలని ప్రయత్నించినా, ఆయన ఊరికి వెళ్లడంతో అందుబాటులోకి రాలేదట. ఆ తర్వాత కూడా చాలా సార్లు దాసరిని కలిసినా.. ఆ ప్రాజెక్ట్ మాత్రం పట్టాలేక్కలేదని వాపోయారు శివ నాగేశ్వరరావు .

దాసరి దగ్గర పనిచేయకపోయినా 

అయితే దాసరి దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేసే అవకాశం రాకపోయినా.. ఆయన తనపై ఎంతో ప్రేమ చూపించేవారని శివ నాగేశ్వరరావు చెప్పారు. సాధారణంగా తన దగ్గర పనిచేసే అసిస్టెంట్లను దాసరి ఎలా చూసుకునేవారో, తనను అంతకంటే ఎక్కువ ఆప్యాయంగా చూసేవారని గుర్తుచేసుకున్నారు.

దాసరి వ్యక్తిత్వంలో తనకు బాగా నచ్చిన లక్షణం గురించి చెబుతూ ఆయన ప్రతి ఒక్కరితో మాట్లాడే తీరు ప్రత్యేకంగా ఉండేదని, తనను మాత్రమే ఆయన ఎక్కువగా ప్రేమిస్తున్నారనే అనుకునేలా చేయగలిగే గొప్ప లక్షణం ఆయనలో ఉండేదని చెప్పారు. అలాంటి లక్షణమే ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంలో కూడా చూశానని ఆనాటి జ్ఞాపకాలని నెమరు వెసుకున్నారు శివ నాగేశ్వరరావు !

ALSO READ :తల్లి చనిపోయినా షూటింగ్‌లోనే అలీ.. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను!

Tags

Related News

తల్లి చనిపోయినా షూటింగ్‌లోనే అలీ.. ఆ బాధ ఇప్పటికీ మర్చిపోలేను!

మనీష్ మల్హోత్రా పార్టీలో సారా గ్లామర్ షో.. చూపు తిప్పుకోలేం!

రామాయణం సినిమాకు అసలు పరీక్ష ఇప్పుడే.. రూ.1600 కోట్ల టార్గెట్!

శ్రీశ్రీకి సిగరెట్ కొనిచ్చిన దర్శకుడు.. అసలు కథ ఇదే!

తేజ సజ్జ నిశ్చితార్థం.. సీఎం రేవంత్ రెడ్డికి ప్రత్యేక ఆహ్వానం!

రక్తం మరకలతో కమల్ హాసన్ పవర్‌ఫుల్ లుక్.. సండియర్‌గా మరో సంచలనం!

పింక్ డ్రెస్‌లో సెగలు రేపుతున్న అమీర్ ఖాన్ మేనకోడలు.. ఫోటోలు వైరల్!

Big Stories

Advertisement
×