Faridabad News: హర్యానా రాష్ట్రంలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఫరీదాబాద్‌లోని ఒక అపార్ట్‌మెంట్‌లో జరిగిన దుర్ఘటనలో ఒక కుటుంబానికి చెందిన ముగ్గురు సభ్యులు దురదృష్టవశాత్తూ మృతిచెందారు. ఈ ఘటన ఇంట్లో ఎయిర్ కండీషనర్ (ఏసీ) పేలుడు కారణంగా భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో కుటుంబానికి చెందిన ఒక యువకుడు బాల్కనీ నుంచి దూకి ప్రాణాలతో బయటపడ్డాడు. యువకుడికి తీవ్ర గాయాల అయ్యాయి. ప్రస్తుతం యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
ఈ ఘటన హర్యానా రాష్ట్రం ఫరీదాబాద్ లోని ఓ అపార్ట్ మెంట్ భవనంలో అర్ధరాత్రి సంభవించింది. ఏసీ కంప్రెసర్‌లో షార్ట్ సర్క్యూట్ లేదా సాంకేతిక లోపం కారణంగా భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడు అగ్నిప్రమాదానికి దారితీసింది. ప్రమాదంలో పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. భారీ మంటలు, దట్టమైన పొగలు వ్యాపించండంతో.. కుటుంబ సభ్యులు బయటకు రావడానికి అవకాశం లేకుండా పోయింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులు, కూతరు మరణించారు. అయితే కుటుంబంలోని యువకుడు, తన ప్రాణాలను కాపాడుకోవడానికి బాల్కనీ నుండి దూకాడు. దీంతో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. యువకుడిని ఆస్ప్రతికి తరించారు.
ALSO READ: CM Revanth: మూసీ పునరుజ్జీవ పథకంలో కీలక ఘట్టం.. హైదరాబాద్‌కు 20 టీఎంసీల నీరు తరలించాలని నిర్ణయం!
స్తానికులు సమాచారం ఇవ్వడంతో.. అగ్నిమాపక సిబ్బంది, పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పడానికి ప్రయత్నించారు. దర్యాప్తు ప్రకారం, ఏసీ యూనిట్‌లోని సాంకేతిక లోపం లేదా నిర్వహణ లోపం ఈ పేలుడుకు కారణమై ఉండవచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది.
ALSO READ: Nuzvid IIIT: దారుణం.. ఎగ్జామ్ రాయనివ్వలేదని ప్రొఫెసర్‌పై కత్తితో దాడి.. చివరకు?
ఈ దుర్ఘటన ఎలక్ట్రానిక్ పరికరాల సరైన నిర్వహణ, భద్రతా ప్రమాణాల ప్రాముఖ్యత గురించి తెలియజేస్తుంది. అధికారులు ఈ ఘటనపై విచారణను కొనసాగిస్తున్నారు. బాధిత కుటుంబానికి పలువురు సానుభూతి వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇటువంటి ఘటనలు జరగకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.