Akkineni Nagarjuna: అక్కినేని నాగార్జున ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా మారిన విషయం తెల్సిందే. కూలీ సినిమాతో నాగ్.. మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. ఎక్కడకు వెళ్లినా నాగ్ ను సైమన్ అంటూ గుర్తుపడుతున్నారు. అసలు మార్కెట్ లో నాగ్ క్రేజ్ చూస్తుంటే మెటలెక్కిపోతుంది. ఇక ఆయన అందం గురించి ఎంత చెప్పినా తక్కువే. 66 ఏళ్ళ వయస్సులో కూడా కింగ్.. నవ మన్మథుడిగా వెలుగుతూనే ఉన్నాడు. ఇప్పటికీ కుర్ర హీరోలకు పోటీగా ఆ అందాన్ని మెయింటైన్ చేస్తూనే వస్తున్నాడు.
తాజాగా అక్కినేని నాగార్జున మలయాళ హీరోయిన్స్ తో సందడి చేశాడు. ఒక ఈవెంట్ లో మలయాళ కుర్ర హీరోయిన్లు మమితా బైజు, అనస్వర రాజన్, ప్రియా ప్రకాష్ వారియర్, దీప్తి సతిలతో నాగ్ ఫోటోలకు పోజులిచ్చాడు. ఫ్లోరల్ కుర్తా,గుబురు జుట్టు, తీరైన మీసకట్టుతో నాగ్.. కింగ్ లానే దర్శనమిచ్చాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. ఇంకా నాగ్ లో మన్మథుడు పోలికలు పోలేదు అని, ఏదేమైనా లక్ అంటే నాగార్జునదే అని నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.
ఇక నాగార్జున ఇంత యంగ్ గా ఉండడానికి కారణం.. ఆయన ఆహారపు అలవాట్లు, వర్క్ అవుట్స్ అని ఎప్పుడు చెప్తూనే వస్తున్నాడు. డైట్ లాంటివి ఏమి చేయను అని.. పుష్టిగా తినడం.. హాయిగా వర్క్ అవుట్ చేసుకుంటానని, 6 గంటల కల్లా డిన్నర్ ఫినిష్ చేస్తానని, ఎక్కువగా నిద్రపోతాను అని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా ఎలాంటి టెన్షన్స్ పెట్టుకొను అని, ఎక్కడకు వెళ్లినా వర్క్ అవుట్ తప్పకుండా చేస్తాను అని చెప్పుకొచ్చాడు.
ఇకపోతే ప్రస్తుతం నాగార్జున డిఫరెంట్ కథలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. కుబేరలో సపోర్టింగ్ రోల్ తో అదరగొట్టిన నాగ్.. కూలీలో సైమన్ గా విశ్వరూపం చూపించాడు. తెలుగువారు ఏమో కానీ, సైమన్ కు తమిళ్ తంబీలు మాత్రం ఫిదా అయ్యారు. ఇక ప్రస్తుతం నాగార్జున తన 100 వ సినిమాతో బిజీగా ఉన్నాడు. ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు. తమిళ్ డైరెక్టర్ రా కార్తీక్ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోందని సమాచారం. ప్రస్తుతం స్క్రిప్ట్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమా త్వరలోనేఅధికారికంగా మేకర్స్ ప్రకటించనున్నారు. మరి ఈ సినిమాతో నాగ్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడో చూడాలి.