E-Paper
Advertisement

ఇద్దరు స్టార్ హీరోలు వస్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

ఇద్దరు స్టార్ హీరోలు వస్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!
Advertisement

Multi Starrer:ఒకప్పుడు ఇద్దరు స్టార్ హీరోలు ఒకే స్క్రీన్‌పై కనిపిస్తే…అది సర్ప్రైజ్.కానీ ఇప్పుడు ..అది సినిమా కాదు..ఒక ఈవెంట్. టోటల్ గా ఇవాళ అదొక బిజినెస్ ప్లాన్.

ఇప్పటి పెద్ద సినిమా అంటే వందల కోట్ల బడ్జెట్…గ్లోబల్ రిలీజ్…పాన్ఇండియా ఎక్స్‌పెక్టేషన్స్.. ఒకవేళ తేడా కొడితే ఆ దెబ్బకి ప్రొడ్యూసర్లు రోడ్డు మీద పడే పరిస్థితి. అందుకే ఇక్కడ ఒక తెలివైన స్ట్రాటజీ మేకర్స్ లో కనిపిస్తుంది.ఒక్క హీరో అయితే ఫుల్ రిస్క్ . అదే మల్టీ స్టారర్ అయితే రిస్క్ తగ్గుతుంది ..మార్కెట్ డబుల్ అవుతుంది.

Advertisement

ఈ స్ట్రాటజీ వెనుకున్న అసలు సీక్రెట్

ఒకసారి ఆలోచిస్తే ..’కల్కి 2898 AD’లో ప్రభాస్  ఉన్నాడు, కానీ అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ని కూడా ఆన్ బోర్డు చేశాడు డైరెక్టర్ నాగ్ అశ్విన్ .ఎందుకంటే ..మిగతా భాషల్ని కూడా కవర్ చేయాలి కాబట్టి.అలాగే ‘సలార్’లో ప్రభాస్‌కి తోడుగా పృథ్వీరాజ్ సుకుమారన్ కూడా ఉన్నాడు .అంటే ఒక సినిమాతో అన్ని భాషల ప్రేక్షకులను బుట్టలో వేసుకోవడమే ఈ స్ట్రాటజీ వెనుకున్న అసలు సీక్రెట్ అన్న మాట

Advertisement

ప్రభాస్ కల్కి సినిమాలో దుల్కర్ సల్మాన్, విజయ్ దేవరకొండ లాంటి వాళ్లు జస్ట్ అలా మెరిసినా.. అది సోషల్ మీడియాలో పెద్ద టాపిక్ అయిపోయింది. ఇక ‘విక్రమ్’ క్లైమాక్స్‌లో సూర్య ‘రోలెక్స్’గా ఎంట్రీ ఇస్తే థియేటర్లు దద్దరిల్లిపోయాయి.

అలాగే ‘జైలర్’లో మోహన్ లాల్, శివరాజ్ కుమార్ క్యామియోలు..అవి సినిమా రేంజ్‌ను ఎక్కడికో తీసుకెళ్లాయి.అంటే, మల్టీస్టారర్ అంటే ఇప్పుడు ఫుల్ లెంగ్త్ రోల్స్ ఉండక్కర్లేదు, ఒక పవర్‌ఫుల్ క్యామియో ఉన్నా చాలు.కలెక్షన్ల వర్షమే

కథలో దమ్ము లేకపోతే

కానీ..కేవలం బిజినెస్ కోసమే స్టార్లను కలిపితే.. కథ కాస్తా ‘ కిచిడీ’ అయిపోయే ప్రమాదం ఉంది. కథలో దమ్ము లేకపోతే.. ఇద్దరు స్టార్ల ఇమేజ్ కూడా సినిమాని కాపాడలేదు మరి.

‘ఆచార్య’ సినిమానే తీసుకోండి. చిరంజీవి, రామ్ చరణ్ లాంటి తండ్రీకొడుకులు కలిసినా.. కథలో దమ్ము లేకపోతే ఫ్యాన్స్ కూడా సినిమాని కాపాడలేకపోయారు.రజనీకాంత్ పెద్దన్న సినిమాలో నయనతార, కీర్తి సురేష్ లాంటి స్టార్లని పెట్టినా.. కథలో కొత్తదనం లేకపోవడంతో అది సోలో రజనీ సినిమాగానే మిగిలిపోయింది.

ఇక ఫ్యాన్స్ ఒకప్పుడు సోషల్ మీడియాలో యుద్ధాలు చేసుకునే వీళ్లు..కాని ఇప్పుడు ..మల్టీస్టారర్ వస్తుందంటే చాలు రూట్ మారుస్తున్నారు.RRR లో ఎన్టీఆర్, చరణ్‌లను చూసినప్పుడు మనందరికీ అర్థమైంది అదే..ఇక మన శంకర వరప్రసాద్ గారు లో చిరు తో వెంకీ మామ చేసిన రచ్చ అంతా ఇంతా కాదు.

మనకి కావాల్సింది పండుగ

సో.. ఫైనల్ గా చూస్తే, మల్టీస్టారర్   సరిగ్గా వాడితే రికార్డులు బద్దలవుతాయి.. లేదంటే బడ్జెట్లు తలకిందులవుతాయి. అందుకే డైరెక్టర్లు కూడా ఇప్పుడు స్టార్ ఇమేజ్ కంటే.. ఆ స్టార్లని కథలో ఎలా బ్యాలెన్స్ చేయాలనే దానిపైనే ఎక్కువ కుస్తీ పడుతున్నారు.

Also read :అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

మొత్తానికి.. మనకి కావాల్సింది పండుగ. అది ఇద్దరు హీరోలు ఉన్నప్పుడు ఇంకాస్త గ్రాండ్‌గా ఉంటుంది. అదే ఇప్పుడు జరుగుతోంది!

Tags

Related News

ఒక్క హిట్ పడితే ఏకంగా 60 కోట్లా? నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న రవితేజ!

తెలుగు సినీ పరిశ్రమ.. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది 80ల్లోనే, అప్పట్లో ఏం జరిగిందంటే?

80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..

అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?

సిచ్యుయేషన్ డిమాండ్ చేస్తే యాక్షనే..ఆదర్శ కుటుంబం టీజర్ రిలీజ్!

Big Stories

Advertisement
×