E-Paper
Advertisement

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్ పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!

ఎంగిలి గ్లాస్ లు కడిగిన నాగార్జున… రోహిత్  పై ఫుల్ ఫైర్.. త్రిగుణ్ కు గుణమే లేదంటూ!
Advertisement

Bigg Boss 10 Telugu: బిగ్ బాస్ 10 తెలుగు ప్రారంభమై వారం రోజులు అవుతుంది. సెప్టెంబర్ ఆరవ తేదీ ఎంతో ఘనంగా ప్రారంభమైన ఈ కార్యక్రమం మొదటివారం పూర్తి చేసుకుంది. 16 మంది కంటెస్టెంట్లతో ప్రారంభమైన ఈ షో మొదటి వారంలోని ఊహించని విధంగా డబుల్ ఎలిమినేషన్ చేస్తూ ఊహించని షాక్ ఇచ్చారు. ఇకపోతే నేడు వీకెండ్ కావడంతో నాగార్జున(Nagarjuna) బిగ్ బాస్ కంటెస్టెంట్లతో ముచ్చటిస్తూ వారు చేసిన తప్పులను ఎత్తిచూపుతూ తనదైన శైలిలోనే క్లాస్ పీకాడు. ఇలా మొదటి వారమే నాగార్జున కంటెస్టెంట్ లపై ఫైర్ అవడంతో ఈ సీజన్ పట్ల అభిమానులలో కూడా ఆసక్తి నెలకొంది.

ఎంగిలి గ్లాసులు కడగను…

ఇకపోతే తాజాగా నేటి ఎపిసోడ్ కు చెందిన ఒక ప్రోమో వీడియో విడుదల చేశారు. ఇందులో భాగంగా రోహిత్ నాయుడు(Rohit Naidu), ఆటో రాంప్రసాద్, టెంపర్ వంశీ ఈ ముగ్గురిని గార్డెన్ ఏరియాకు పిలిపించి వారితో మాట్లాడారు మీరు టాస్కులలో చాలా అద్భుతంగా ఆడారు అందుకే మీకోసం బిగ్ బాస్ మిల్క్ షేక్ పంపించారు వెంటనే తాగేయండి అని చెప్పారు. అలా చెప్పడంతో కంటెస్టెంట్లు కూడా చక చక మిల్క్ షేక్ తాగి లివింగ్ రూమ్ కి వెళ్ళారు. అయితే నాగార్జున ఆ మిల్క్ షేక్ తాగిన గ్లాసులను స్వయంగా కడిగి కంటెస్టెంట్లకు తనదైన శైలిలోనే క్లాస్ పీకాడు. ఈవారం ఇచ్చిన టాస్కులలో భాగంగా రోహిత్ నాయుడు గ్లాసులు కడగమని చెప్పగా అందరి ఎంగిలి గ్లాసులను నేను కడుగను అంటూ ఆయన మాట్లాడటంతో రోహిత్ కు గట్టిగా క్లాస్ పీకారు.

త్రిగుణ్ కు నాగ్ పనిష్మెంట్..

Advertisement

హౌస్ లో ఉన్నప్పుడు ఇచ్చిన టాస్క్ పూర్తి చేయాలని అదేవిధంగా ఏ పనిని కూడా చిన్న చూపు చూడకూడదని నాగార్జున హెచ్చరించారు. ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని ఆటపట్ల అలసత్వం చూపిస్తే అలాంటి వారు హౌస్ లో ఉండటానికి వీల్లేదని నాగార్జున తెలియజేశారు.. ఇలా రోహిత్ నాయుడు ఎంగిలి గ్లాసులు నేను కడగడం ఏంటి అనే వ్యాఖ్యలపై ఫుల్ ఫైర్ అయ్యారు. అదేవిధంగా మరొక కంటెస్టెంట్ త్రిగుణ్ పట్ల కూడా నాగార్జున మండిపడ్డారు. ఈ సీజన్ లో రియాక్షన్ తో పాటు ఇమ్మిడియట్ పనిష్మెంట్ కూడా ఉంటుందని తెలిపారు.

Advertisement

ఇక నాగార్జున త్రిగుణ్ అన్న మాటలను ఉద్దేశిస్తూ పిల్ల బచ్చా, స్టెరాయిడ్ రాజా, స్టెరాయిడ్ డొల్ల అన్న మాటలు త్రిగుణ్ అనే వ్యక్తికి గుణం లేవని చెబుతుంది. అందుకే గార్డెన్ ఏరియాలోకి వెళ్లి ఒక పెద్ద టైర్ పైకి పట్టుకొని తిరుగుతూ ఉండాలి అంటూ నాగార్జున త్రిగుణ్ కు పెద్ద పనిష్మెంట్ ఇచ్చారు. సాధారణంగా మొదటి వారం నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్లతో సరదాగా మాట్లాడుతూ ఉంటారు కానీ ఈ సీజన్ లో మాత్రం మొదటి వారమే ఇద్దరు కంటెస్టెంలను బయటకు పంపించడం అలాగే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పనిష్మెంట్లు ఇవ్వడంతో ఈ సీజన్ పట్ల భారీగా అంచనాలు ఏర్పడుతున్నాయి.

Also Read: సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరిక పాటికి అన్వేష్ ఫైర్!

Related News

సనాతన ధర్మ పరిరక్షకులంటూ..పవన్ గరికపాటి పై అన్వేష్ ఫైర్!

వార్తా ప్రపంచం మారిపోయిందండోయ్.. 80ల్లో అలా, ఇప్పుడేమో ఇలా!

సెలబ్రిటీలకు మద్దతు తెలిపిన మాజీ కంటెస్టెంట్.. కామనర్స్ అంటే అంత చులకనా?

బిగ్ బాస్ హౌస్ లోకి వైల్డ్ కార్డు ద్వారా సుప్రీత.. ఏమన్నారంటే?

సీక్రెట్ రూమ్ లో చరణ్, చైత్ర? కంటెస్టెంట్లకు నాగార్జున స్ట్రాంగ్ వార్నింగ్!

ఢీ10 షో విన్నర్ రాజు అరెస్ట్?

నా జీవితంలో మర్చిపోలేని రోజు అదే – నటరాజ్ మాస్టర్!

Big Stories

Advertisement
×