E-Paper
Advertisement

ఒక్క హిట్ పడితే ఏకంగా 60 కోట్లా? నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న రవితేజ!

ఒక్క హిట్ పడితే ఏకంగా 60 కోట్లా? నిర్మాతలకు చెమటలు పట్టిస్తున్న రవితేజ!
Advertisement

Ravi Teja Remuneration:హిట్ కావాలంటూ ఎన్నాళ్లగానో ఎదురు చూస్తున్న మాస్ మహారాజ రవి తేజకి ఎట్టకేలకి సాలిడ్ బ్లాక్ బస్టర్ అందించాడు డైరెక్టర్ శివ నిర్వాణ .మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 230 కోట్ల వసూళ్ళని కొల్లగొట్టడంతో రవితేజ పేరు ఇండస్ట్రీలో మారుమ్రోగిపోతుంది .

దాదాపుగా 60 కోట్ల పైచిలుకు

Advertisement

అయితే ఈ సినిమా హిట్ కావడంతో రవితేజ ఇప్పుడు తన పారితోషికాన్ని ఊహించని రేంజ్ లో పెంచేశాడు అన్న టాక్ ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.అసలు విషయానికి వస్తే రవితేజ ఇరుముడి సినిమా కోసం ఎలాంటి పారితోషికాన్ని తీసుకోకుండా కేవలం నైజాం రైట్స్ తో పాటు లాభాల్లో వాటా తీసుకునే విధంగా ఒప్పందం కుదుర్చుకున్నాడట.

ఇక సినిమా ఊహించని విధంగా వసూళ్ల వర్షం కురవడంతో రవితేజకి దాదాపుగా 60 కోట్ల పైచిలుకు డబ్బులు పారితోషికంగా ముడుతున్నాయని తెలుస్తుంది .దీంతో ఇప్పుడు మిగతా సినిమాలకు కూడా దాదాపు ఇదే రేంజ్ లో పారితోషికం కావాలని డిమాండ్ చేస్తున్నారట రవితేజ .

Advertisement

ఆకాశంలో పెట్టడం ఏం బాగోలేదు

అయితే గత సినిమా లాగా వచ్చే సినిమాలకి లాభాలలో వాటాలు రైట్స్ కాకుండా ,ఏకంగా 60 కోట్లు పైచిలుకు ముట్ట చెబితేనే సినిమాకి సైన్ చేస్తాడన్న వార్తలు ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్నాయి. దీంతో వరుసగా 6 ప్లాపులు చూసిన రవితేజ కి ఒక ఇరుముడి సినిమా దక్కడంతో ఇలా ఒక్కసారిగా పారితోషికాన్ని ఆకాశంలో పెట్టడం ఏం బాగోలేదు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి.

ఇక రవితేజ ఇలానే ఊహించని విధంగా భారీ పారితోషికాన్ని డిమాండ్ చేయడం వల్లే హసిత్ గోలి తో దిల్ రాజు చేయాల్సిన సినిమా ఇప్పుడు పక్కకు వెళ్ళిపోయింది అన్న టాక్ వినిపిస్తుంది .మరి ఇది ఎంతవరకు నిజమో మేకర్సే బయట పెట్టాలి.

రవితేజ ఎలా రియాక్ట్ అవుతాడో

ఏది ఏమైనా ఒక సినిమా సూపర్ హిట్ అవడంతో ఇలా ఉహించని విధంగా పారితోషికాన్ని పెంచడం సరికాదంటున్నారు ట్రేడ్ పండితులు .అయితే ఇరుముడి సినిమాలాగే మిగతా సినిమాలకి కూడా ఏరియాలో హక్కులతో పాటు లాభాల్లో వాటా తీసుకుంటే సముచితంగా ఉంటుందని టాక్ వినిపిస్తుంది. మరి ఫిలిం సర్కిల్స్ లో చక్కర్లు కొడుతున్న ఈ వార్తలపై రవితేజ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.

బాక్సాఫీస్ కి ఇరుముడి సినిమా ఊపిరి

ఇక సినిమా విషయానికి వస్తే విడుదలై నాలుగో వారంలోకి అడుగుపెట్టినా ఇంకా సినిమా బాక్సాఫీస్ వద్ద దుమ్ము దులుపుతుండడం విశేషం.ఇక ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న టాలీవుడ్ బాక్సాఫీస్ కి ఇరుముడి సినిమా ఊపిరి పోసిందనే చెప్పాలి.చూడాలి మరి ఇదే బాటలో ముందు ముందు వచ్చే సినిమాలు నడుస్తాయా లేక ఇప్పట్లాగే బాక్సాఫీస్ కి హ్యాండ్ ఇస్తాయా!

Tags

Related News

త్రివిక్రమ్‌ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడా? ‘ఆదర్శ కుటుంబం’పై మొదలైన డౌట్స్‌!

తెలుగు సినీ పరిశ్రమ.. మద్రాస్ నుంచి హైదరాబాద్‌కు వచ్చింది 80ల్లోనే, అప్పట్లో ఏం జరిగిందంటే?

80ల్లో మూవీ షూటింగ్ అంటే.. పెద్ద సాహసమే, CGI.. VFX లేకుండానే..

ఇద్దరు స్టార్ హీరోలు వస్తే.. థియేటర్లు దద్దరిల్లాల్సిందే!

అబ్బబ్బా…చీర కట్టులో బాలయ్య భామ .. చూపు తిప్పుకోలేరంతే!

అనుపమ ‘క్రేజీ కళ్యాణం’ నుండి “కాకా ధూమ్ ధమాకా” లిరికల్ సాంగ్ రిలీజ్!

దసరాకు వారణాసి బ్లాస్టేనా.. లేక మరో బిస్కెట్టా?

Big Stories

Advertisement
×