E-Paper
Advertisement

Dhurandhar2 Movie: ఎల్లలు దాటుతున్న ‘ధురంధర్ 2’ ఫీవర్.. ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ..

Dhurandhar2 Movie: ఎల్లలు దాటుతున్న ‘ధురంధర్ 2’ ఫీవర్.. ఇద్దరు ప్రపంచ నాయకుల మధ్య ఆసక్తికర చర్చ..
Advertisement

Dhurandhar2 Movie: భారతీయ సినిమా ఖ్యాతి ఇప్పుడు సరిహద్దులు దాటి ప్రపంచ అగ్రనేతల మధ్య చర్చాంశంగా మారింది. తాజాగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్ కెనడా ప్రధాన మంత్రి మార్క్ కార్నీ మధ్య జరిగిన సంభాషణ దీనికి నిదర్శనం. లండన్‌లోని హైడ్ పార్క్‌లో ఉదయం వేళ జాగింగ్ చేస్తూ, ఈ ఇద్దరు నాయకులు ఆదిత్య ధర్ దర్శకత్వంలో వచ్చిన బ్లాక్‌బస్టర్ చిత్రం ‘దురంధర్’ గురించి చర్చించుకోవడం ఇప్పుడు నెట్టింట వైరల్‌గా మారింది.

Read also-Ustaad Bhagat Singh: రిలీజ్‌కు ముందే రికార్డ్ క్రియేట్ చేస్తున్న ‘ఉస్తాద్ భగత్ సింగ్’.. ప్రీ రిలీజ్ వసూళ్లు ఎంతంటే?

జాగింగ్‌లో సినిమా ముచ్చట్లు

Advertisement

కెనడా ప్రధాని మార్క్ కార్నీ, ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్‌ను ఉద్దేశించి.. “భారతదేశంలో మీ ఇన్‌స్టాగ్రామ్ క్రేజ్ ఎలా ఉంది?” అని సరదాగా అడిగారు. దీనికి సమాధానంగా స్టబ్ స్పందిస్తూ, తాను ‘దురంధర్’ సినిమా చూసినట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన తర్వాత ఇండియాలో తన ఫాలోయింగ్ విపరీతంగా పెరిగిందని చెప్పారు. తన కుమారుడు ఈ సినిమా తప్పకుండా చూడమని సలహా ఇచ్చాడని, అందుకే తాను చూశానని ఆయన పేర్కొన్నారు.

హజారీ పాత్రపై ప్రశంసలు

ఈ సినిమాలో రణవీర్ సింగ్ పోషించిన ‘హంజా అలీ మజారీ’ అనే అండర్ కవర్ ఆఫీసర్ పాత్ర గురించి వారు సుదీర్ఘంగా చర్చించారు. సినిమాలోని గూఢచారి విభాగానికి సంబంధించిన సన్నివేశాలు, తీవ్రవాదంపై పోరాటం కేవలం వినోదం కోసం మాత్రమే కాకుండా, క్షేత్రస్థాయిలో ఉన్న వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించాయని స్టబ్ అభిప్రాయపడ్డారు. “ఇది కేవలం ఆట కాదు” అని ఆయన వ్యాఖ్యానించడం ద్వారా సినిమా ఎంత సీరియస్ అంశాన్ని చర్చించిందో అర్థం చేసుకోవచ్చు.

Advertisement

Read also-Dhurandhar 2: ధురంధర్ 2కి భారీ షాక్.. ఆ సీన్లు తొలగించిన సెన్సార్!

గ్లోబల్ సెన్సేషన్‌గా దురంధర్2

2025 చివరలో విడుదలైన ‘దురంధర్’, ఆపరేషన్ లియారీ వంటి వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కింది. ఆదిత్య ధర్ దర్శకత్వ ప్రతిభ, రణవీర్ సింగ్ నటన అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందాయి. ముఖ్యంగా కెనడా, ఫిన్లాండ్ వంటి దేశాల్లో కూడా ఈ సినిమాకు విశేష ఆదరణ లభించడం విశేషం. ఈ సంభాషణ ముగింపులో, సినిమా రెండో భాగం గురించి కూడా వారు ప్రస్తావించారు. ‘దురంధర్: ది రివెంజ్’ అనే పేరుతో రాబోతున్న ఈ సీక్వెల్ మార్చి 19, 2026న విడుదల కానుంది. దీని కోసం తాను ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ఫిన్లాండ్ అధ్యక్షుడు స్టబ్ తెలిపారు.

భారతీయ సినిమా కథాబలం మేకింగ్ స్టాండర్డ్స్ ఎలా మారుతున్నాయో ఈ సంఘటన నిరూపిస్తోంది. ఒక భారతీయ సినిమాలోని పాత్రల గురించి, అంతర్జాతీయ గూఢచారి వ్యవస్థల గురించి ఇద్దరు ప్రపంచ నాయకులు బహిరంగంగా చర్చించుకోవడం భారతీయ చిత్ర పరిశ్రమకు దక్కిన గౌరవంగా భావించవచ్చు. ‘దురంధర్’ కేవలం బాక్సాఫీస్ వద్ద విజయం సాధించడమే కాకుండా, ప్రపంచ దౌత్య వర్గాల్లో కూడా ఒక హాట్ టాపిక్‌గా మారింది.

Related News

ఏడేళ్ల వయసులోనే సాఫ్ట్వేర్ సంస్థకు యజమాని.. ‘జైలర్’ బుడ్డోడు చిన్నోడు కాదండోయ్!

‘గరివిడి లక్ష్మి’లో ఆర్పీ పట్నాయక్ పాత్ర వెనుక అసలు కథ ఇదేనా?

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

యూత్‌ను టార్గెట్ చేస్తూ వస్తున్న ‘హైకూ’.. అక్టోబర్ 23న థియేటర్లలోకి!

మాల్దీవుల్లో ఖుషీ కపూర్ అందాల సందడి.. ఫ్యాన్స్‌కు ఫుల్ ట్రీట్!

రామాయణంపై రాజమౌళి పోస్ట్.. ఏమన్నారంటే!

విజయ్ దేవరకొండ, రష్మికతో మధ్యప్రదేశ్ సీఎం.. అసలు విషయం ఇదే!

మహిళా కథ అనగానే నో చెప్పారు.. చివరికి అదే సినిమాతో సక్సెస్!

Big Stories

Advertisement
×