Actress Prerana: ప్రేరణ(Prerana) బుల్లితెర ప్రేక్షకులకు పరిచయం అవసరం లేని పేరు. బుల్లితెర నటిగా కృష్ణా ముకుందా మురారి సీరియల్ తో ఎంతో ఫేమస్ అయిన ఈమె అనంతరం బిగ్ బాస్ 8 (Bigg Boss 8)కార్యక్రమంలో కంటెస్టెంట్ గా సందడి చేశారు. ఇక ఈ కార్యక్రమంలో ఫినాలే వరకు హౌస్ లో కొనసాగిన ప్రేరణ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్నారు. ఇక బిగ్ బాస్ తర్వాత ప్రేరణ దంపతులు ఇస్మార్ట్ జోడి(Ismart Jodi) కార్యక్రమానికి వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చి ఈ కార్యక్రమంలో విజేతలుగా నిలిచిన సంగతి తెలిసిందే. ఇలా ఈ జంట వరుస బుల్లితెర కార్యక్రమాలలో పాల్గొంటూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు.
క్యాస్టింగ్ కౌచ్ ఇబ్బందులు తప్పలేదు…
ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రేరణ ఇండస్ట్రీలో తనకు ఎదురైన చేదు అనుభవాల గురించి అభిమానులతో పంచుకున్నారు. ఈమె గతంలో పలు కన్నడ సినిమాలలో కూడా నటించినట్టు ఈ సందర్భంగా తెలియజేశారు. అయితే అప్పటికే తాను ఇండస్ట్రీలోకి వచ్చినప్పటికీ తనకు క్యాస్టింగ్ కౌచ్(Casting Couch) ఇబ్బందులు తప్పలేదు అంటూ సంచలన విషయాలను బయటపెట్టారు. బుల్లితెర సీరియల్స్ లో నటించిన తనకు కన్నడ ఇండస్ట్రీలో ఒక పెద్ద సినిమాలో అవకాశం లభించింది. అయితే తాను ఆడిషన్ కి వెళ్ళినప్పుడు అక్కడ నేరుగా నన్ను క్యాస్టింగ్ కౌచ్ గురించి అడిగారని ప్రేరణ ఈ సందర్భంగా తెలియజేశారు.
ఛాన్స్ ఇస్తే మాకేంటి లాభం?
ఈ సినిమాలో మీకు ఛాన్స్ ఇస్తే మాకేంటి లాభం అంటూ తనని అడిగారని తెలిపారు. ఇలా కాస్టింగ్ కౌచ్ గురించి అడగడంతో తాను ఆ సినిమా నుంచి తప్పుకున్నాను .అయితే ఆడిషన్ చేయకుండా వెనక్కి వచ్చినప్పటికీ కూడా తనకు రెండు మూడు సార్లు ఫోన్ చేసి మరి అడిగారని ప్రేరణ తెలిపారు. ఇక ఈ సినిమా తర్వాత మరో రెండు మూడు సినిమాలలో అవకాశాలు వచ్చిన అక్కడ కూడా తనకు అదే పరిస్థితి ఎదురైందని క్యాస్టింగ్ కౌచ్ కారణంగా తాను సినిమా ఇండస్ట్రీలో కొనసాగకూడదంటూ బ్రేక్ ఇచ్చానని తెలిపారు. ఇలాంటి ఇబ్బందులు ఎదురవుతున్న తరుణంలోనే తాను తిరిగి తన మాస్టర్ డిగ్రీపై ఫోకస్ చేశానని ప్రేరణ వెల్లడించారు.
ప్రేమ వివాహం చేసుకున్న ప్రేరణ..
ఇలా సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందన్నమాట వాస్తవమే అయితే ఎంతో మంది సెలబ్రిటీలు వారికి ఎదురైనా చేదు అనుభవాలను ఇలా పలు సందర్భాలలో బయటపెడుతున్నారు. ఇక తనకు కూడా ఇలాంటి చేదు అనుభవాలు ఎదురయ్యాయని ప్రేరణ చెప్పడంతో అందరూ షాక్ అవుతున్నారు. అయితే ఈమెను ఏ సినిమా కోసం ఇలా ఇబ్బందులకు గురి చేసారనే విషయాలను మాత్రం వెల్లడించలేదు. ఇలా ఇండస్ట్రీకి కొంత బ్రేక్ ఇచ్చిన ప్రేరణ తిరిగి పలు సీరియల్స్ లో నటిస్తూ తెలుగు కన్నడ భాషలలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇక ఈమె గత రెండు సంవత్సరాల క్రితం తాను ప్రేమించిన అబ్బాయి శ్రీ పాద్(Shripad) ను పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ జంట పలు కార్యక్రమాలలో సందడి చేస్తూ మరింత ప్రేక్షకాదరణ సొంతం చేసుకుంటున్నారు.
Also Read: Bigg Boss Agnipariksha: బిగ్ బాస్ అగ్నిపరీక్ష పై ఆడియన్స్ రియాక్షన్..ఇదొక బొ** పరీక్ష అంటూ!