BigTV English

Viral Video: తినే కంచాలపై మూత్రం పోసిన పని మనిషి.. వీడియో చూశారా?

Viral Video: తినే కంచాలపై మూత్రం పోసిన పని మనిషి.. వీడియో చూశారా?

ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో, ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఇంట్లో పని మనిషిని, కాపలా ఉండే సెక్యూరిటీ గార్డును కూడా అనుమానించాల్సి వస్తోంది. ఈ విషయం ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే, తాజాగా ఉత్తర ప్రదేశ్ లో ఓ వంట మనిషి చేసిన పని చూసి ఒళ్లు జలదరించడం ఖాయం. మనుషులు ఇంత దారుణంగా ఎలా తయారవుతున్నారు? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.


ఇంతకీ అసలు ఏం జరిగిందంటే?

బిజ్నోర్ లోని నాగినాలో వ్యాపారవేత్త సత్యం మిట్టల్ నివాసం ఉంటున్నారు. ఆయన ఇంట్లో 55 ఏళ్ల పని మనిషి గత 10 ఏళ్లుగా పని చేస్తుంది. ఆమెను సత్యం కుటుంబ సభ్యులు ఇంట్లో మనిషిగా చూసుకుంటున్నారు. అయితే, తాజాగా ఆమె చేసిన పని  చూసి ఇంట్లో వాళ్లంతా షాకయ్యారు. కుటుంబ సభ్యులను గమనించని ఆమె గ్లాస్ లో యూరిన్ పోసి దానిని సింక్ లోని పాత్రలపై పోసింది. ఈ విషయాన్నికుటుంబ సభ్యులు చూశారు. ఇంట్లోని సీసీ కెమెరా విజువల్స్ చూసి మతిపోయింది. ఆమె ఎందుకు అలా చేస్తుందో అర్థం కాలేదు. ఈ వీడియోను తీసుకెళ్లి పోలీసులకు అప్పగించారు. చేసిన ఘనకార్యం గురించి ఆమెపై ఫిర్యాదు చేశారు. యజమాని కంప్లైంట్ తో సదరు పని మనిషిని పోలీసులు అరెస్టు చేశారు. ఆమెను అదుపులోకి తీసుకున్నట్లు నాగినా పోలీస్ స్టేషన్ ఆఫీసర్ సంజయ్ కుమార్ తెలిపారు. “గురువారం నాడు ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. ఇంటి యజమాని వెంటనే ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకుని సదరు పని మనిషిని అరెస్టు చేశాం. ప్రస్తుతం ఈఘటనపై విచారణ జరుగుతోంది” అని సంజయ్ వివరించారు. పని మనిషి ఇప్పుడే అలా చేసిందా? ప్రతి రోజూ ఇలాగే చేస్తుందా? అనే విషయంపై పోలీసులు ఆరా తీస్తున్నారు. సదరు పని మనిషి నుంచి కూడా ప్రశ్నిస్తున్నారు.


Read Also: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, సూపర్ ఉమెన్‌ లా దూకుతూ..

పని మనిషిపై నిప్పులు చెరుగుతున్న నెటిజన్లు

అటు పని మనిషి చేసి చెత్త పనికి సంబంధించిన సీసీటీవీ విజువల్స్ ను సత్యం మిట్టల్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ ఘటనపై నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది కావాలనే ఆమె అలా చేసిందంటుంటే, టాయిలెట్ కు వెళ్లే ఓపికలేక అలా చేసి ఉండవచ్చని మరికొంత మంది కామెంట్స్ చేస్తున్నారు. సదరు మహిళపై కఠిన చర్యలు తీసుకోవాలని నెటిజన్లు కోరుతున్నారు. అలాంటి వారిపై చర్యలు తీసుకుంటేనే. ఇతరులు కూడా చెత్త పనులు చేయకుండా ఉంటుందంటున్నారు.

Read Also: కారు రన్నింగ్‌లో ఉండగా.. స్టీరింగ్ వదిలేసి.. డోరు తెరిచి బొన్నెట్‌పై కూర్చొని రిస్కీ స్టంట్!

Related News

Heavy rains: వర్షం బీభత్సం.. 2 కిమీల మేర ఏర్పడిన భారీ గుంత.. వీడియో వైరల్

Viral Video: కారు రన్నింగ్‌లో ఉండగా.. స్టీరింగ్ వదిలేసి.. డోరు తెరిచి బొన్నెట్‌పై కూర్చొని రిస్కీ స్టంట్!

Viral Video: పిల్లలకు టీకాలు వేసేందుకు ఆరోగ్య కార్యకర్త సాహసం, సూపర్ ఉమెన్‌ లా దూకుతూ..

Viral Video: డేంజర్ యాక్సిడెంట్.. సీసీటీవీ ఫుటేజ్‌లో షాకింగ్ నిజాలు, వైరల్ వీడియో

Shrekking: అందంగా లేకపోయినా ఐ లవ్యూ చెప్పేసెయ్.. డేటింగ్ లో ఇదో కొత్త ట్రెండ్

Big Stories

×