E-Paper
Advertisement

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ రిలీజ్ డేట్ లాక్… ప్రేక్షకులకు కిక్ ఇచ్చేనా?

అల్లరి నరేష్ ‘ఆల్కహాల్’ రిలీజ్ డేట్ లాక్… ప్రేక్షకులకు కిక్ ఇచ్చేనా?
Advertisement

Alcohol Movie Release Date: అల్లరి నరేష్ ఇటీవల కాలంలో వరుస సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వస్తూ పెద్ద ఎత్తున సందడి చేస్తున్నారు. ఇలా బ్యాక్ టు బ్యాక్ సినిమాల ద్వారా ప్రేక్షకులను ఎంటర్టైన్ చేస్తున్న ఈయన ఇటీవల రంభ ఊర్వశి మేనక సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 4వ తేదీ ఈ సినిమా విడుదల అయినప్పటికీ అనుకున్న స్థాయిలో పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా విడుదలైన రెండు నెలల వ్యవధిలోనే మరో సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమవుతున్నారు.

ఆకట్టుకున్న ఆల్కహాల్ టీజర్..

ఇప్పటికే అల్లరి నరేష్(Allari Naresh) ఆల్కహాల్ సినిమా(Alcohol Movie)కు సంబంధించి వివరాలను చిత్ర బృందం వెల్లడించారు. ఇటీవల ఈ సినిమా నుంచి విడుదల చేసిన టీజర్ వీడియో కూడా సినిమా పట్ల పెద్ద ఎత్తున అంచనాలను పెంచేసింది. ఇకపోతే తాజాగా ఈ సినిమా విడుదలకు సంబంధించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇండస్ట్రీ సమాచారం ప్రకారం ఈ సినిమా డిసెంబర్ 18వ తేదీ విడుదల చేయాలనే ఆలోచనలో దర్శక నిర్మాతలు ఉన్నట్టు సమాచారం. అతి త్వరలోనే ఈ సినిమా విడుదలకు సంబంధించి ఈ విషయాన్ని అధికారకంగా ప్రకటించబోతున్నారు.

మనిషి జీవితంపై ఆల్కహాల్ ప్రభావం..

Advertisement

ఇలా అల్లరి నరేష్ ఆల్కహాల్ అంటూ విభిన్నమైన టైటిల్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇక ఈ సినిమాకు ఆల్కహాల్ అని టైటిల్ పెట్టడంతో సినిమా మొత్తం మందు బాబుల చుట్టే తిరుగుతుందని స్పష్టమవుతుంది.అల్లరి నరేష్, రుహాని శర్మ (Ruhani Sharma), నిహారిక ఎన్ఎం, సత్య, గిరీష్ కులకర్ణి, హర్షవర్ధన్, చైతన్య కృష్ణ, రవీంద్ర విజయ్ వంటి తదితరులు కీలక పాత్రలలో నటిస్తున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీ డ్రామా’ ఫేమ్ మెహర్ తేజ్ (Meher Tej)దర్శకత్వం వహిస్తున్నారు.

డిసెంబర్ లో భారీ సినిమాలు విడుదల..

ఇక ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, శ్రీకర స్టూడియోస్ సంయుక్తంగా నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఆల్కహాల్ ఒక మనిషి జీవితాన్ని, అతడి ప్రవర్తనను ఎలా మారుస్తుంది, మందు తాగడానికి ముందు, తాగిన తర్వాత జరిగే పరిణామాల నేపథ్యంలో ఈ సినిమా ఉండబోతుందని తెలుస్తోంది. ఇక ఈ సినిమా అల్లరి నరేష్ సినీ కెరియర్ లో 63వ సినిమాగా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇటీవల విడుదల చేసిన టీజర్ సినిమా పట్ల మంచి అంచనాలను పెంచేసింది.. మరి త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం ప్రేక్షకులకు ఎలాంటి కిక్ ఇవ్వబోతుందో తెలియాల్సి ఉంది. ఇకపోతే డిసెంబర్ నెలలో పెద్ద ఎత్తున సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే.ఇలా ఈ సినిమాలన్నింటితో పోటీగా అల్లరి నరేష్ ఆల్కహాల్ కూడా విడుదలకు సిద్ధమవుతుందని చెప్పాలి.

Advertisement

Also Read: విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక అట్రాక్షన్ గా నందమూరి కోడలు?

Related News

విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కోడలు?

లంగా ఓణిలో ట్రెడిషనల్ లుక్ తో మెరిసిపోతున్న నిహారిక..ఏకి పారేస్తున్న ఫ్యాన్స్!

మూడు ఇండస్ట్రీలు.. ముగ్గురు డైరెక్టర్లు.. సూర్య రేంజే వేరు!

విజయ్ దేవరకొండను రెండో పెళ్లి చేసుకుంటా.. బాంబ్ పేల్చిన నటి?

పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?

అలా బ్రతకడం కంటే విడాకులే బెటర్…డైరెక్టర్ సంచలన వ్యాక్యాలు!

కోట్లు విలువ చేసే ఇల్లు..అన్నా పిల్లలకు రాసిచ్చిన పవన్…ఎవరికి ఎంతంటే!

Big Stories

Advertisement
×