Suriya Box Office:కోలీవుడ్ హీరో అయినప్పటికీ సూర్య కి నేషనల్ వైడ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ ఉందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా గజినీ సినిమాతో టాలీవుడ్ లో సాలిడ్ ఫ్యాన్స్ బేస్ సంపాదించుకున్నాడు,ఇక ఆ తర్వాత వచ్చిన ‘సింగం’, ‘యముడు’, ‘సూర్య సన్నాఫ్ కృష్ణన్’, ‘7th సెన్స్’, ‘బ్రదర్స్’ వంటి సినిమాలు ఇక్కడ మంచి ఓపెనింగ్స్ ని దక్కించుకున్నాయి.
అయితే గతేడాది వరకు సూర్య సినిమలు అంచనాలు అందుకోలేక బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడుతూనే ఉన్నాయి. ముఖ్యంగా భారీ అంచనాలతో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా వచ్చిన ‘కంగువా’ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై సోదిలో లేకుండా పోయింది.ఇక ఈ సినిమా ఈవెంట్ లో నిర్మాత జ్ఞానవేల్ రాజా ఏకంగా మా లెక్క 2000 కోట్ల నుండే అంటూ కాలర్ ఎగరేయడం అప్పట్లో సెన్సేషన్ అయింది.కానీ కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రాబట్టలేని పరిస్థితి.
ఇక ఆ తర్వాత వచ్చిన ‘రెట్రో’ కూడా టాక్ బాగున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద అనుకున్న స్థాయిలో కలెక్షన్స్ ని రాబట్టలేకపోయింది.అయితే మధ్యలో ఆకాశం నీ హద్దురా, ‘జై భీమ్’ వంటి మంచి సినిమాలు చేసినప్పటికీ అవి డైరెక్ట్ గా ottలో రిలీజ్ అవ్వడంతో బాక్సాఫీస్ వద్ద ఈ కోలీవుడ్ స్టార్ కి సాలిడ్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి.
ఇదిగో సరిగ్గా ఈ సమయంలోనే 2026 లోకి ఎంట్రీ ఇచ్చిన సూర్య ముచ్చటగా మూడు సాలిడ్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకోవడం విశేషం.వీటిలో మొదటగా చెప్పుకోవాల్సిన సినిమా ఆర్ జే బాలాజీ దర్శకత్వంలో వచ్చిన కరుప్పు.తెలుగులో వీరభద్రగా వచ్చిన ఈ సినిమాలో సూర్యకి జోడీగా త్రిష నటించిన సంగతి తెల్సిందే .ఇక ఈ ఏడాది 15 మే న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద 350 కోట్లకి పైగా కొల్లగొట్టి సూర్య ఈ ఏడు మొదటి సాలిడ్ బ్లాక్ బస్టర్ ని అందించింది.
ఇక ఆ తర్వాత వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సాలిడ్ వసూల్లని రాబట్టి సూర్య సత్తా ఏంటో మరోసారి ప్రూవ్ చేసింది.మమితా బైజు హీరోయిన్ గా నాగ వంశీ నిర్మాణంలో ఆగస్ట్ 14న రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఏకంగా 200 కోట్లకి పైగా కొల్లగొట్టి సూర్యకి ఈ ఏడాదిలో రెండో హిట్ అందించింది.
ఇక తాజాగా ఈ నవంబర్ 6న రిలీజ్ అయిన సీన్ సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద 200 కోట్లని కొల్లగొట్టి ముచ్చటగా సూర్య కెరీర్ లో మెమరబుల్ హిట్ గా నిలిచింది. జీతు మాదవన్ దర్శకత్వంలో నజ్రియా నజీమ్ హీరోయిన్ గా ,నస్లెన్ కీ రోల్ పోషించిన ఈ సినిమా రిలీజ్ అయిన ఐదు రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ కావడంతో మురిసిపోతున్నారు సూర్య ఫ్యాన్స్.
ఇక ఇలా వరుసగా మూడు రెండు వందల కోట్ల సినిమాలని ఖాతాలో వేసుకోవడంతో అక్షయ్ కుమార్ ,షారుక్ సరసన చేరిపోయాడు సూర్య.మొత్తానికి 2026 ఇయర్ లో మూడు వివిధ బాషా దర్శకులతో సినిమాలు చేసి సాలిడ్ హిట్స్ అందుకున్న సూర్య వచ్చే ఏడు ఎలాంటి ఫలితాలని రాబడతాడో చూడాలి !
ALSO READ :పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?