Niharika Konidela: నిహారిక కొణిదెల మెగా వారసురాలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి హీరోయిన్ గా పలు సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ సినిమాలు పెద్దగా కలిసి రాకపోవడంతో నిర్మాతగా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు. నిహారిక(Niharika) పింక్ ఎలిఫెంట్ పిక్చర్ బ్యానర్ స్థాపించి నిర్మాతగా వరుస సినిమాలు వెబ్ సిరీస్ లతో ఎంతో బిజీగా గడుపుతున్నారు. ఇక త్వరలోనే ఈమె నిర్మాణంలో తెరకెక్కిన పాకెట్ రాకెట్స్ అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావునున్నారు. ఇలా కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్న నిహారిక సోషల్ మీడియాలో కూడా చాలా యాక్టివ్ గా ఉంటారు.
ఈ నేపథ్యంలోనే తనకు సంబంధించిన అన్ని విషయాలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటారు. ఇకపోతే తాజాగా ఈమె తన ఇంస్టాగ్రామ్ వేదికగా సూపర్ క్యూట్ లుక్ లో ఉన్న ఫోటోలను షేర్ చేశారు. సాంప్రదాయబద్ధంగా లంగా వోని ధరించి నిహారిక ఫోటోలకు ఫోజులిచ్చారు. ఈ ఫోటోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఒక్కసారిగా వైరల్ అయ్యాయి. అయితే నిహారిక ఇటీవల సాయి ధరమ్ తేజ్ నిశ్చితార్థం(Sai Dharam Tej Engagment)లో భాగంగా ఈ ఫోటోషూట్ నిర్వహించారని తెలుస్తోంది.
ఇలా ఈ ట్రెడిషనల్ లుక్ కు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది అభిమానులు ఈమె ఫోటోలపై సూపర్ క్యూట్ అంటూ కామెంట్లు చేస్తున్నారు. అయితే మరి కొంతమంది ఫ్యాన్స్ మాత్రం నిహారిక పై తీవ్రస్థాయిలో విమర్శలు కురిపిస్తూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం మెగా ఫ్యామిలీలో విడాకులు జరగడంతో అభిమానులు ఎంతో నిరాశలో ఉన్నారు. ఇలాంటి సమయంలో నిహారిక ఏకంగా సోషల్ మీడియాలో ఈ విధమైనటువంటి ఫోటోలను షేర్ చేయడంతో పలువురు అభిమానులు ఈ ఫోటోలపై స్పందిస్తూ విభిన్న రీతిలో కామెంట్లు చేస్తున్నారు.
నిహారిక నీ గురించే మీ బాబాయి పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ను తిడుతున్నారు అంటూ కొంతమంది కామెంట్లు చేయగా మరి కొంతమంది మాత్రం అక్కడ బాబాయ్ బాధలో ఉంటే నీకు మాత్రం సోకులు ఎక్కువయ్యాయి అంటూ విమర్శిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇలా నిహారిక ట్రెడిషనల్ లుక్స్ గురించి ఈ విధమైనటువంటి కామెంట్లు చేయడంతో మరి కొంత మంది ఈ విమర్శలపై స్పందిస్తూ పవన్ కళ్యాణ్ విడాకులు(Pawan Kalyan Divorce) తీసుకుంటే నిహారికకు సంబంధం ఏంటి అది పూర్తిగా ఆయన వ్యక్తిగత విషయం అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా పవన్ కళ్యాణ్ విడాకులు ఇండస్ట్రీలో అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాయని చెప్పాలి. ఇలా పవన్ విడాకులు ప్రకటన సమయంలో నిహారిక ఇలాంటి ఫోటోలను షేర్ చేయడంతో విమర్శిస్తున్నారని తెలుస్తుంది.
Also Read: నాది ఐరన్ లెగ్ కాదు.. ట్రోల్స్ కు శృతిహాసన్ స్ట్రాంగ్ కౌంటర్..