E-Paper
Advertisement

విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కోడలు?

విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ సభ.. ప్రత్యేక ఆకర్షణగా నందమూరి కోడలు?
Advertisement

Nandamuri Alekhya Reddy: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో అలాగే ఏపీ రాష్ట్ర రాజకీయాలలో నందమూరి ఫ్యామిలీకి ప్రత్యేకమైన క్రేజ్ ఉందని చెప్పాలి. ఇలా సినీ రాజకీయ రంగాలలో నందమూరి కుటుంబ సభ్యులు దూసుకుపోతున్నారు. అయితే రాజకీయాలలోకి మరో నందమూరి వారసురాలు రాబోతున్నారు అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి. మరి ఏపీ రాష్ట్ర రాజకీయాలలోకి రాబోతున్న నందమూరి వారసులు ఎవరు ఏంటి అనే విషయానికి వస్తే.. ఇప్పటికే ఆంధ్రప్రదేశ్లో మూడు ప్రాంతీయ పార్టీలు ఉన్న సంగతి తెలిసిందే. తాజాగా మరో కొత్త పార్టీ ఆవిర్భావం కూడా రాజకీయాల పరంగా పెద్ద ఎత్తున చర్చలకు కారణం అవుతుంది.

పరివర్తన రాజనీతి పార్టీ..

వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (Vijaya Sai Reddy)పార్టీ నుంచి బయటకు వచ్చి కొత్త పార్టీని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నేడు ఈ పార్టీ ఆవిర్భావంతో పాటు పార్టీ జెండాను కూడా ఈయన ఆవిష్కరించారు. ఇక తన పార్టీకి పరివర్తన రాజనీతి పార్టీ (PRP) అని ప్రకటించారు. ఇక ఈ పార్టీ ఆవిర్భావ వేడుక ఎంతో ఘనంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా పెద్ద ఎత్తున రాజకీయ నాయకులు పాల్గొన్నారు. అయితే ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమాలలో నందమూరి తారకరత్న (Nandamuri Tarakaratna) సతీమణి అలేఖ్య రెడ్డి(Alekhya Reddy) పాల్గొన్నారు.

పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో అలేఖ్య..

Advertisement

ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో భాగంగా అలేఖ్య రెడ్డి పాల్గొనడంతో ఈమె కొత్తగా ఏర్పాటు చేసిన పరివర్తన రాజ నీతి పార్టీలోకి రాబోతోందా? ఈమె కూడా రాజకీయాలలోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా అంటూ ఎంతోమంది ఎన్నో విధాలుగా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో నందమూరి అలేఖ్య పాల్గొనడంలో పెద్దగా విశేషమేమీ లేదని చెప్పాలి. ఈమెకు విజయసాయిరెడ్డి స్వయంగా పెదనాన్న అవుతారు కాబట్టి ఈ వేడుకలో పాల్గొన్నారని మరి కొంతమంది భావిస్తున్నారు.

రాజకీయాలలోకి అలేఖ్య రెడ్డి..

ఇక తారకరత్న తెలుగుదేశం పార్టీలో కొనసాగిన సంగతి తెలిసిందే. అయితే ఉన్నఫలంగా ఈయన గుండెపోటుతో మరణించారు. ఇలా తారకరత్న మరణించడంతో అలేఖ్య రెడ్డి తెలుగుదేశం పార్టీలోకి వస్తారని ఈమె కూడా 2024 లో జరిగిన ఎన్నికలలో పోటీ చేస్తారంటూ అప్పట్లో వార్తలు వచ్చాయి కానీ తాను మాత్రం రాజకీయాలకు దూరంగా ఉంటానని అలేఖ్య తెలిపారు. ఇలా రాజకీయాలకు దూరంగా ఉన్న ఈమె ఉన్నఫలంగా విజయసాయిరెడ్డి పార్టీ ఆవిర్భావ కార్యక్రమంలో కనిపించడంతో మరోసారి ఈమె రాజకీయ రంగప్రవేశంపై చర్చలు జరుగుతున్నాయి. మరి నిజంగానే పెదనాన్న చెంత చేరి ఈమె రాజకీయాలలో అడుగుపెట్టబోతున్నారా? లేదా అనేది తెలియాల్సి ఉంది.

Advertisement

Also Read: లంగా ఓణిలో ట్రెడిషనల్ లుక్ తో మెరిసిపోతున్న నిహారిక..ఏకి పారేస్తున్న ఫ్యాన్స్!

Related News

లంగా ఓణిలో ట్రెడిషనల్ లుక్ తో మెరిసిపోతున్న నిహారిక..ఏకి పారేస్తున్న ఫ్యాన్స్!

మూడు ఇండస్ట్రీలు.. ముగ్గురు డైరెక్టర్లు.. సూర్య రేంజే వేరు!

విజయ్ దేవరకొండను రెండో పెళ్లి చేసుకుంటా.. బాంబ్ పేల్చిన నటి?

పారడైజ్‌లో బాబుమోహన్‌కు అవమానం? గెటప్ టెస్ట్ చేసి పక్కన పెట్టేశారా?

అలా బ్రతకడం కంటే విడాకులే బెటర్…డైరెక్టర్ సంచలన వ్యాక్యాలు!

కోట్లు విలువ చేసే ఇల్లు..అన్నా పిల్లలకు రాసిచ్చిన పవన్…ఎవరికి ఎంతంటే!

20 ఏళ్ల క్రితమే శ్రీరాముడిగా సల్మాన్ ఖాన్ మూవీ ప్రకటన.. మరెందుకు పట్టాలెక్కలేదు?

Big Stories

Advertisement
×