Pawan Kalyan: పవన్ కళ్యాణ్ సినీ నటుడిగా మాత్రమే కాకుండా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్న ఈయన గత రెండు రోజులుగా మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వార్తలలో హాట్ టాపిక్ గా మారారు. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)ఉన్నఫలంగా తన భార్య అన్నా లెజినోవా(Anna Lezhneva)తో విడాకులు (Divorce)తీసుకుని విడిపోతున్నారని ప్రకటించడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. ఎంతో అన్యోన్యంగా ఉన్నటువంటి ఈ జంట 13 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలికారు. ఈ నేపథ్యంలోనే వీరి విడాకులకు సంబంధించి ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేస్తున్నాయి.
ఈ విధంగా పవన్ కళ్యాణ్ తన మూడో భార్యకు కూడా విడాకులు ఇచ్చి విడిపోవడంతో వీరి ఆస్తులకు సంబంధించిన వార్తలు కూడా బయటకు వచ్చాయి. ముఖ్యంగా 2024 ఎన్నికల అఫిడవిట్ లో పవన్ కళ్యాణ్ పొందుపరిచిన ఆస్తుల వివరాలకు సంబంధించి వార్తలు వైరల్ అవుతున్నాయి. అయితే హైదరాబాదులో పవన్ కళ్యాణ్ కు కోట్లు విలువ చేసే ఖరీదైన ఇల్లు ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఆ ఇంటిని ఈయన తన మాజీ భార్య అన్నా లెజినోవా పిల్లలు మార్క్ శంకర్(Mark Shankar), పోలినా అంజనా(Polina Anjana)కు రాసిచ్చారని తెలుస్తోంది. పవన్ కళ్యాణ్ కు హైదరాబాదులో పెద్దగా ఆస్తులు ఏవేమి లేవు తనకు ఒక ఫామ్ హౌస్ తో పాటు ఇల్లు మాత్రమే ఉందని పలు సందర్భాలలో తెలిపారు. అయితే ఉన్న ఆ ఇంటిని కూడా తన పిల్లల పేరిట రాసారని తెలియడంతో ఇది కాస్త సంచలనంగా మారింది.
హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని 13,122 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ ఇంటిని తన కుమారుడు మార్క్ శంకర్ గిఫ్టుగా ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇంటి విలువ సుమారు 11 కోట్ల విలువ చేస్తుందని సమాచారం. ఇదే ఇంటిలో మరో సగం వాటా తన కుమార్తె పోలినా అంజనా పేరుమీద రిజిస్ట్రేషన్ చేయించారు. ఈ ఇంటిలో రెండు వాటాలను పవన్ కళ్యాణ్ తన ఇద్దరు పిల్లల పేరు మీద రాసి వారికి కానుకగా ఇచ్చారని తెలుస్తుంది. ఇక అంజనా వాటలో భాగంగా వచ్చిన ఈ ఇంటి ఖరీదు రూ.11 కోట్ల విలువ చేస్తుందని తెలుస్తుంది.
The Hyderabad house owned by #PawanKalyan is reportedly registered in the names of his ex-wife Anna Lezhneva’s children. pic.twitter.com/Py2rZbz5jv
— Filmyscoops (@Filmyscoopss) November 11, 2026
ఈ విధంగా పవన్ కళ్యాణ్ హైదరాబాదులో ఉన్నటువంటి తన 22 కోట్ల రూపాయలు విలువ చేసే ఇంటిని తన ఇద్దరి పిల్లలకు కానుకగా రాసి ఇచ్చినట్లు ఎన్నికల అఫిడవిట్ లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఇలా హైదరాబాదులో ఉన్న ఈ ఖరీదైన ఇంటిని కూడా తన పిల్లల పేరు మీద రాసిచ్చారనే విషయం తెలియడంతో అభిమానులు షాక్ అవుతున్నారు. ఇక పవన్ కళ్యాణ్ తన మూడవ భార్యకు విడాకులు ఇవ్వడానికి గల కారణం ఏంటనే విషయం పై ఎంతో మంది సందేహాలు వ్యక్తం చేస్తున్నప్పటికీ సరైన కారణం మాత్రం వెల్లడించలేదు. ఇక వీరిద్దరూ విడాకులు తీసుకున్నప్పటికీ మంచి స్నేహితులుగా కొనసాగుతామని, ఎల్లప్పుడు తమ పిల్లలకు అండగా ఉంటామని తెలియజేశారు.
Also Read: మెగా ఫ్యామిలీ కాదు..డివోర్స్ ఫ్యామిలీ పవన్ పై రెచ్చిపోయిన తమన్నా సింహాద్రి!