Ashu Reddy – Vijay Devarakonda: అశు రెడ్డి పరిచయం అవసరం లేని పేరు టిక్ టాక్ వీడియోలతో ఎంతో ఫేమస్ అయిన ఈ ముద్దుగుమ్మ అనంతరం ఇంస్టాగ్రామ్ రీల్స్, యూట్యూబ్ వీడియోస్ అంటూ పెద్ద ఎత్తున పాపులర్ అయ్యారు ముఖ్యంగా సెలబ్రిటీలను ఇంటర్వ్యూ చేస్తూ అశు రెడ్డి(Ashu Reddy) బాగా గుర్తింపు పొందారు. ముఖ్యంగా రామ్ గోపాల్ వర్మతో ఈమె చేసిన ఒక బోల్డ్ వీడియో వైరల్ అయింది. ఈ ఇంటర్వ్యూ ద్వారా ఎంతో మంచి క్రేజ్ సొంతం చేసుకున్న ఈ ముద్దుగుమ్మ ఏకంగా బిగ్ బాస్(Bigg Boss) అవకాశాన్ని అందుకొని ఇండస్ట్రీలో సెలబ్రిటీగా మారిపోయారు.
ఇక ప్రస్తుతం పలు బుల్లితెర కార్యక్రమాలతో ఎంతో బిజీగా గడుపుతున్న అశు రెడ్డి తాజాగా సురేఖ వాణి కుమార్తె సుప్రీత యాంకర్ గా వ్యవహరిస్తున్న విజువల్స్ టాక్స్ విత్ సుప్రీత అనే కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో భాగంగా ఈమె తనకు సంబంధించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను అభిమానులతో పంచుకున్నారు. ముఖ్యంగా ఈమె కార్ల గురించి, తనకు జరిగిన సర్జరీ గురించి, అలాగే సోషల్ మీడియాలో వచ్చే విమర్శల గురించి కూడా ఈ సందర్భంగా స్పందిస్తూ తన అభిప్రాయాలను తెలిపారు.
ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సెలబ్రిటీల గురించి వచ్చే తప్పుడు వార్తలు అలాగే విభిన్నమైన థంబ్ నెయిల్స్ గురించి కూడా ప్రస్తావనకు వచ్చింది. కొందరు ఏది పడితే అది రాసేస్తున్నారని అసహనం వ్యక్తం చేసింది. అలాంటి వాళ్లు రాసే వార్తల్లో కూడా కొంత కామెడీ కూడా ఉంటే బాగుంటుందని ఆశు రెడ్డి తెలిపారు.ఈ క్రమంలోనే విజయ్ దేవరకొండ(Vijay Devarakonda) పేరును ప్రస్తావిస్తూ..విజయ్ దేవరకొండతో రెండో పెళ్లైన అషురెడ్డి అని ఎవరైనా వార్తలు రాయచ్చు కదా చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది అంటూ ఈమె చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. ఇలా ఆశు రెడ్డి చేసిన ఈ కామెంట్స్ ద్వారా విజయ్ దేవరకొండ అంటే ఎంత క్రష్ ఉందో స్పష్టం అవుతుంది.
ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో విజయ్ దేవరకొండ రష్మిక (Rashmika) అభిమానులు క్రేజీగా స్పందిస్తున్నారు.. నువ్వు విజయ్ దేవరకొండను రెండో పెళ్లి చేసుకుంటే రష్మిక ఏమైపోవాలి? ఆశు అంటూ కామెంట్లు చేస్తున్నారు మరి కొందరు రష్మికకు అన్యాయం చేస్తావా? అంటూ కూడా ఈ సందర్భంగా కామెంట్లు చేస్తున్నారు. విజయ్ దేవరకొండ టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా కొనసాగుతూ ఎంతోమంది అమ్మాయిలకు క్రష్ అయ్యారు. అయితే ఈయన మాత్రం సినీ నటి రష్మిక మందన్న ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. ఇలా రష్మిక విజయ్ తమ వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్న సమయంలో ఆశు రెడ్డి విజయ్ దేవరకొండతో రెండో పెళ్ళి అంటూ చేసిన కామెంట్స్ మాత్రం హైలైట్ అయ్యాయి.
Also Read: అలా బ్రతకడం కంటే విడాకులే బెటర్…డైరెక్టర్ సంచలన వ్యాక్యాలు!