Vi Rs 398 Plan: వోడాఫోన్ ఐడియా (Vi) తమ యూజర్ల కోసం తీసుకొచ్చిన రూ.398 ప్లాన్ అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. కాల్స్, డేటాతో పాటు ఉచిత ఓటీటీ సబ్ స్క్రిప్షన్లను ఈ ప్లాన్ అందిస్తుండటంతో పెద్ద ఎత్తున వీఐ యూజర్లు ఈ ప్లాన్ రీఛార్జ్ చేసుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో రూ.398 ప్లాన్ కు సంబంధించిన వివరాలేంటో ఇప్పుడు చూద్దాం.
వీఐ ఈ ఆల్ రౌండర్ ప్లాన్ ను 28 రోజుల వ్యాలిడిటీతో తీసుకొచ్చింది. దీనిని రీఛార్జ్ చేసుకోవడం ద్వారా యూజర్లకు అపరిమిత 4G, 5G డేటా లభించనుంది. అలాగే దేశవ్యాప్తంగా ఫ్రీ కాల్స్, రోజుకు 100 ఎస్ఎంఎస్ లు చేసుకోవచ్చు.
ఈ ప్లాన్ లో ఎంటర్ టైన్ మెంట్ కు వీఐ పెద్ద పీట వేసింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో లభించే ‘Vi Movies & TV Super’ సబ్‌స్క్రిప్షన్ ద్వారా 19 రకాల ఓటీటీ ప్లాట్‌ఫారమ్‌ల కంటెంట్‌ను ఫ్రీగా చూడొచ్చు. వీఐ ఆఫర్ చేస్తున్న వాటిలో సోనీలైవ్, జీ 5, లయన్స్ గేట్, ఫ్యాన్ కోడ్ వంటి ప్రముఖ ఓటీటీలు ఉండటం విశేషం. ఇవే కాకుండా వీఐ యాప్ ద్వారా లైవ్ ఛానెల్స్, టీవీ షోలు వీక్షించవచ్చు.
Also Read: నలుగురికి ఒక్కటే రీఛార్జ్.. Airtel రూ. 1,449 ఫ్యామిలీ ప్లాన్ గురించి తెలుసా?
వీఐ ఎంటర్ టైన్ మెంట్ యాప్ కంటెంట్ ను మెుబైల్ తో పాటు టీవీలోనూ వీక్షించవచ్చు. స్మార్ట్ టీవీల్లో ‘వీఐ మూవీస్ అండ్ టీవీ సూపర్’ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని హ్యాపీగా సినిమాలు, సిరీస్ లు చూడొచ్చని వీఐ వర్గాలు చెబుతున్నాయి. ఇంట్లో లేని సందర్భాల్లో మాత్రం మెుబైల్ లోని యాప్ ద్వారా ఎంటర్ టైన్ మెంట్ పొందవచ్చని సూచిస్తున్నాయి.
Also Read: అమెరికాలో తెలంగాణ విద్యార్థిని అదృశ్యం.. బాధిత కుటుంబానికి అండగా బిగ్ టీవీ చైర్మన్!