E-Paper
Advertisement

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!

బీఆర్ఎస్, బీజేపీ కలిసి వచ్చినా లెక్క తేలుస్తా: సీఎం రేవంత్ సవాల్!
Advertisement

Revanth Reddy: ‘చంద్రబాబు మోచేతి నీళ్లు తాగింది కేసీఆర్ అయితే,వైఎస్ఆర్ మోచేతి నీళ్లు తాగింది హరీష్ రావు’ అంటూ సీఎం రేవంత్ రెడ్డి మండిపడ్డారు. వార్డు మెంబర్ కూడా కాని హరీష్‌ను మంత్రిని చేసింది వైఎస్ఆర్ అని,అందుకే జగన్ గురించి హరీష్ ఒక్క మాట కూడా మాట్లాడటం లేదని సీఎం విమర్​శించారు. ధనిక రాష్ట్రంగా ఉన్న తెలంగాణను కేసీఆర్ అండ్ టీమ్ రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పుల ఊబిలోకి నెట్టి దివాళా తీయించారన్నారు. పదేళ్లలో పాలమూరు ప్రాజెక్టులకు రూ.10 వేల కోట్లు కూడా ఖర్చు చేయకుండా పడావు పెట్టారన్నారు. కృష్ణా జలాల్లో 811 టీఎంసీలు ఉంటే తెలంగాణకు 299 టీఎంసీలు చాలని, ఆంధ్రా 66 శాతం నీళ్లు తీసుకోవచ్చని సంతకం పెట్టింది మామ అల్లుళ్లు కాదా? ఒక్కపూట రోజమ్మ రొయ్యల పులుసు తిని రాయలసీమను రత్నాల సీమ చేస్తానని కేసీఆర్ పాలమూరు నీళ్లను జగన్ రెడ్డికి తాకట్టు పెట్టారని సీఎం మండిపడ్డారు.

నీళ్లు వచ్చేవి కాదా?

అటు ఆంధ్రా వాళ్లు పోతిరెడ్డిపాడు,రాయలసీమ లిఫ్ట్,హంద్రీనీవా,ముచ్చుమర్రి ద్వారా నీళ్లు తరలించుకుపోతుంటే కేసీఆర్ ఏం చేశారు? పాలమూరు, అచ్చంపేట లిఫ్ట్,డిండి పూర్తయి ఉంటే లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి కాదా?” అని సీఎం నిలదీశారు.అధికారం ఉంటే రాష్ట్రాన్ని దోచుకుని కొడుకు, బిడ్డ, అల్లుడికి దోచిపెట్టిన కేసీఆర్, అధికారం పోగానే ఫామ్‌హౌస్‌లో పడుకున్నారని సీఎం ఎద్దేవా చేశారు.ప్రజల డబ్బు జీతంగా తీసుకుంటూ అసెంబ్లీకి రాని కేసీఆర్‌ను ఎలా శిక్షించాలో ప్రజలే తేల్చాలన్నారు.సొంత చెల్లికి ద్రోహం చేసిన ఆ ద్రోహికి, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలన్న తమ ప్రభుత్వానికి పులికి నక్కకు ఉన్నంత తేడా ఉందని సీఎం వ్యాఖ్యానించారు.

2034 వరకు కాంగ్రెస్ దే అధికారం..

Advertisement

తమ ప్రభుత్వం మూడేళ్లలో రైతుల కోసం రూ.1 లక్షా 78 వేల కోట్లు ఖర్చు చేసిందని,త్వరలోనే మరో 25 వేల ఉద్యోగాలను భర్తీ చేసి లక్ష ఉద్యోగాల హామీని పూర్తి చేస్తామని సీఎం ప్రకటించారు.ఎస్సీ వర్గీకరణ అమలు, కులగణన నిర్వహణ ద్వారా దేశానికే ఆదర్శంగా నిలిచి ప్రధాని మోదీకి సవాల్ విసిరామన్నారు. అధికారంలో ఉంది కాబట్టే బీజేపీ బతికి ఉన్నదన్నారు. అధికారం కోల్పోతే అది చచ్చిన పాముతో సమానం అన్నారు. బండి సంజయ్, రాంచందర్ రావు, కిషన్ రెడ్డి ఎంత లేపినా బీజేపీ లేవదన్నారు.తమ సభల్లో పల్లి బటానీలు అమ్ముకోవడం తప్ప వాళ్లు చేసేదేం లేదన్నారు.ఇక గడ్డం పెంచుకున్న ప్రతీ అడ్డగాడిద రేవంత్ రెడ్డి కాలేరన్నారు.బీఆర్ఎస్, బీజేపీలకు సవాల్ విసురుతున్నానని, ఆ రెండు పార్టీలు విడివిడిగా కాకుండా కలిసి రావాలన్నారు. అసెంబ్లీలో ఆ రెండు పార్టీల లెక్క తేలుస్తానని సీఎం నొక్కి చెప్పారు. పేదలను గుండెల్లో పెట్టుకుని చూసుకోవడమే తమకు తెలిసిందన్నారు. 2034 వరకు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీదే అధికారమని సీఎం రేవంత్ రెడ్డి మరోసారి చెప్పారు.

Also Read: తెలంగాణలో కొత్త అస్త్రం.. ‘రుద్రమ సేన’ రంగప్రవేశం.. ఆడసింహాల్లా గర్జిద్దామన్న కవిత!

అచ్చంపేట్ ను అభివృద్ధి చేస్తా..

Advertisement

నల్లమల అటవీ ప్రాంతం,అచ్చంపేట గడ్డ తన పుట్టినిల్లు అని,ఈ మట్టి బిడ్డగా తన రక్తాన్ని చెమటగా మార్చి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేసి యావత్ రాష్ట్రానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలో ముఖ్యమంత్రి సుడిగాలి పర్యటన చేశారు. మద్దిమడుగులో పర్యటించిన అనంతరం అచ్చంపేటలో నిర్వహించిన భారీ బహిరంగ సభలో సీఎం ప్రసంగిస్తూ రూ.450 కోట్ల విలువైన అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. ఇదే వేదికపై నుంచి రాష్ట్రవ్యాప్తంగా ఆడబిడ్డలకు ‘చిలకపచ్చ’రంగు ఇందిరమ్మ చీరల పంపిణీతో పాటు కొత్తగా మంజూరైన చేయూత పింఛన్ల పంపిణీని లాంఛనంగా ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, దామోదర రాజనర్సింహ, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరి, స్థానిక ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

చారిత్రక వైభవం.. ఇందిరమ్మ పాలన స్ఫూర్తి..

అచ్చంపేటను దత్తత తీసుకోవాలని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ కోరుతున్నారని సీఎం ప్రస్తావించారు.”నేనే ఈ గడ్డపై పుట్టిన బిడ్డను.. మీ బిడ్డగా ఈ ప్రాంతానికి చేయాల్సినంత అభివృద్ధి చేస్తా. ఎన్నికల ప్రచారంలో వంశీకృష్ణను గెలిపిస్తే అచ్చంపేటకు ఒకరు కాదు ఇద్దరు ఎమ్మెల్యేలు ఉంటారని చెప్పా. ఆ మాట ప్రకారమే రూ.450 కోట్ల నిధులను తీసుకొచ్చా” అని సీఎం ప్రకటించారు.అచ్చంపేట పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యాన్ని సీఎం గుర్తుచేసుకున్నారు. ఒకవైపు ద్వాదశ జ్యోతిర్లింగ క్షేత్రమైన శ్రీశైలానికి ఉత్తర ద్వారమైన ఉమామహేశ్వరం, మరోవైపు మద్దిమడుగు ఆంజనేయుడు, ఇంకోవైపు తెలంగాణ అమరనాథ్ సలేశ్వరం కొలువై ఉన్నాయన్నారు.

స్వచ్ఛమైన జీవనం..

శాతవాహనులు, విష్ణుకుండినులు, చాళుక్యులు, కందూరు చోళులు, కాకతీయులు, రేచర్ల నాయకులు, కుతుబ్‌షాహీలు పరిపాలించిన ఈ నేలపై చెంచు గిరిజనుల స్వచ్ఛమైన జీవనం ఉందన్నారు. 14వ శతాబ్దంలో అల్లావుద్దీన్ ఖిల్జీ సేనాధిపతి మాలిక్ కాఫర్‌ను ఎదిరించి నిలిచి గెలిచిన దక్షిణ భారతదేశ ఝాన్సీ లక్ష్మీరాణి, తెలంగాణ వీరవనిత రాణి అచ్చమాంబ పేరుతో రూపుదిద్దుకున్న అచ్చంపేట అదే వారసత్వాన్ని కొనసాగిస్తోందని కొనియాడారు. ఆనాటి రాణి అచ్చమాంబ, ఇందిరాగాంధీ స్ఫూర్తితో తమ ప్రజా ప్రభుత్వం గడచిన మూడేళ్లుగా పరిపాలన కొనసాగిస్తోందని తెలిపారు.

కోటి మంది ఆడబిడ్డలకు చిలకపచ్చ చీరలు.. అభివృద్ధి పనుల జాతర.

మహిళా సాధికారతే లక్ష్యంగా ఇందిరాగాంధీ స్ఫూర్తితో ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ చీరలు, ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకాలను అమలు చేస్తున్నామని సీఎం చెప్పారు. గతేడాది పాలపిట్ట రంగు చీరలు అందించామని, ఇప్పుడు అచ్చంపేట వేదికగా గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది, పట్టణాల్లో 35 లక్షల మంది చొప్పున మొత్తం కోటి మంది ఆడబిడ్డలకు రెండు రకాల చిలకపచ్చ రంగు ఇందిరమ్మ చీరలను అందిస్తున్నామని వెల్లడించారు.

Also read: ముదిరిన సోషల్ మీడియా వార్.. మెటాకు కాంగ్రెస్ షాక్.. ఢిల్లీ హైకోర్టులో పిటిషన్..!

Tags

Related News

వాతావరణ సవాళ్లపై.. తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం!

సాగర్ జలాలపై కాక రేపుతున్న రాజకీయం.. ఇక అదొక్కటే మార్గమా..?

ఆ రెండు బిల్లులతో.. బీజేపీ వేస్తున్న బిగ్ స్కెచ్ ఇదే..?

ఈ రెండు రంగాల్లో దూసుకుపోతున్న తెలంగాణ: మంత్రి ఉత్తం!

తెలంగాణ ఐఏఎస్ హత్య కేసు.. మళ్లీ జైలుకు బిహార్ మాజీ ఎంపీ.. అసలేం జరిగిందంటే?

హైదరాబాద్ ప్రజలకు బిగ్ అలర్ట్.. ఈ రూట్లో వన్ వే..?

తెలంగాణలో కొత్త అస్త్రం.. ‘రుద్రమ సేన’ రంగప్రవేశం.. ఆడసింహాల్లా గర్జిద్దామన్న కవిత!

Big Stories

Advertisement
×