Rayapati Sambasiva: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఉమ్మడి రాష్ట్రంగా ఆంద్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో తనకంటూ ఓ పేరు సాంపాదించుకున్న మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు కన్నుమూశారు. తీవ్ర అనారోగ్యంతో గత కొన్ని రోజులుగా గుంటూరు జిల్లాలోని రమేశ్ ఆసుపత్రిలో సాంబశివారావు చికిత్స పొందుతున్నారు. దీంతో ఆయన నేడు తుదిశ్వాస విడిచారు.
రాయపాటి సాంబశివరావు 1943 జూన్ 7న గుంటూరు జిల్లాలోని ఉంగుటూరు అనే గ్రామంలో జన్మించారు. అనంతరం ఐదుసార్లు లోక్‌సభకు గతంలో ఎన్నికయ్యారు. ఒకసారి రాజ్యసభకు సైతం ప్రాతానిధ్యం వహించారు. మొదట ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉన్న ఆయన.. 2014లో తెలుగు దేశం పార్టీలో చేరారు. తెలగు దేశం పార్టీనుండి గతంలో నరసరావుపేట నుంచి లోక్‌సభకు ఎన్నికయ్యారు. ఈయన మరణ వార్త విన్న అతని కుటుంభికులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. పార్టీలోను తీవ్ర విషాద చాయలు అలుముకున్నాయి. అటు ఆయన వర్గీయులైన కార్యకర్తలు సైతం ఆవేదనకు గురయ్యారు.