Bigg Boss 10:బిగ్ బాస్ సీజన్ 10 మరో 4 వారాలు మాత్రమే మిగిలి ఉంది. అటు కంటెస్టెంట్స్ కూడా ఎవరికివారు ఆడియన్స్ లో మంచి గుర్తింపు సొంతం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఇదిలా ఉండగా దాదాపు నేటితో 12 వారాలు పూర్తి కాబోతున్నాయి. ముఖ్యంగా ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అని ముందుగానే ప్రకటించారు హోస్ట్ నాగార్జున (Nagarjuna). అలా మొదటి ఎలిమినేషన్ లో భాగంగా టెంపర్ వంశీ బయటకు వెళ్ళిపోయారు. ముఖ్యంగా కప్పు కొట్టి తన చేతిలో పెట్టాలి అంటూ త్రిగుణ్ కి చెప్పి మరి బయటకు వెళ్లిపోవడంతో అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా బిగ్ బాస్ సీజన్ 10 నుండీ రోహిత్ వెళ్లిపోయిన తర్వాత త్రిగుణ్ vs ముఖేష్ మధ్య వార్ గట్టిగానే సాగుతోంది. ఇద్దరి మధ్య కప్పు కోసం జరుగుతున్న పోటీ అభిమానులలో ఆసక్తిని కలిగిస్తోంది.
అయితే ఇలాంటి సమయంలో ముఖేష్.. త్రిగుణ్ తో నాకు పోటీ ఏంటి? అంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. 84వ రోజుకు సంబంధించి విడుదల చేసిన రెండవ ప్రోమోలో కంటెస్టెంట్స్ కి అభిమానులు సలహాలు ఇస్తూ.. తమలో కొన్ని మార్పులు చేసుకోవాలని సూచిస్తూ.. స్క్రీన్ పై తమ అభిప్రాయాలను చెప్పుకొచ్చారు. అందులో భాగంగానే ముఖేష్ కి అభిమానులు ఇచ్చిన సలహా పై ముఖేష్ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. ప్రోమో లో ఏముందో ఇప్పుడు చూద్దాం..
ఆడియన్స్ చాలా ప్రశ్నలు అడిగారు. ఆ ప్రశ్న చదువుకొని మీరు సమాధానం చెప్పాలి అంటూ నాగార్జున తెలిపారు. ఇక త్రిగుణ్ కి అభిమానులు.. ఎందుకు నువ్వు గ్రూప్ ఇజం పెట్టుకుంటున్నావు. పర్సనల్ ఎటాక్ చేస్తున్నావు.. క్యారెక్టర్ ను డిజైన్ చేస్తున్నావు. నీ ఆటను నువ్వు జెన్యూన్ గా ఆడ లేవా? అని ప్రశ్నించారు. దీనికి త్రిగుణ్ మాట్లాడుతూ.. “నేను హెడ్ గా ఉండడానికి నా వాళ్లను పుష్ చేస్తున్నాను . కేవలం స్ట్రాటజీ మాత్రమే పర్సనల్ గా దేనిని తీసుకోవట్లేదు.. ఇక ఒక్కొక్కసారి అనుకోకుండా నేను అక్కడ గేమ్ లో హెడ్ గా నిలవాల్సి వస్తుంది” అంటూ తెలిపారు.
ఇక తర్వాత దేబ్జానీ ని ఇంకెన్నాళ్లు ఆ పనికిమాలిన జాతి రత్నాలు గేమ్ లో ఉంటావు.. ఇప్పటికైనా బయటకు వచ్చి నీ ఆటను నువ్వు ఆడు అని చెప్పినట్టు నాగార్జున చదివి వినిపించారు. ఇక ఈమె నరేష్ , రాంప్రసాద్ గ్యాంగ్ లో కొనసాగుతున్న విషయం తెలిసిందే. రాంప్రసాద్ మాట్లాడుతూ..” ఏంటి సార్ మాలో మాకే గొడవ పెడుతున్నారు” అంటూ కామెంట్ చేశారు.
ALSO READ:యూట్యూబ్‌లో టాప్ 10 ట్రెండింగ్ సౌత్ మాస్ మూవీస్ ఇవే!
ఆ తర్వాత ముఖేష్ కి.. త్రిగుణ్ కి 13 స్టార్ వచ్చిన దగ్గర నుండి త్రిగుణ్ ను టార్గెట్ చేస్తున్నావు . త్రిగుణ్ భజన చేస్తున్నావు. ఇప్పుడు కంప్లీట్ గా త్రిగుణ్ లాగా ఆడాలని ట్రై చేస్తున్నావు. నీకంటూ అసలు ఒక గేమ్ ప్లాన్ ఉందా ? లేకపోతే త్రిగుణ్ ఏం చేసినా అది చూసి కాపీ కొట్టడం నీ గేమ్ ఆ? రెండు వారాల నుంచి నీ బిహేవియర్ లో మార్పు వచ్చింది. జెన్యూన్ గేమ్ లేఖ అటెన్షన్ కోసం డ్రామా చేస్తున్నావా? గెలవాలి అంటే నీ గేమ్ ఆడాలి. వేరే వాళ్ళని తొక్కి ముందుకు వెళ్లాలి అంటూ అభిమానులు సలహా ఇచ్చినట్లుగా డిస్ప్లే చేశారు.
దీనికి ముఖేష్ మాట్లాడుతూ.. “నేను త్రిగుణ్ ను నాకు పోటీగా ఎప్పుడూ అనుకోలేదు. త్రిగుణ్ లాగా ఆడడానికి నాకు ఒక్క క్షణం చాలు. కానీ త్రిగుణ్ నాలాగా ఆడడం అంత ఈజీ కాదు” అంటూ కౌంటర్ వేశాడు.