Bigg Boss 9 Promo: తెలుగు బుల్లితెర ప్రేక్షకులను ఎప్పటికప్పుడు ఆకట్టుకుంటూ బిగ్గెస్ట్ రియాలిటీ షోగా గుర్తింపు సొంతం చేసుకుంది బిగ్ బాస్ (Bigg Boss). ఇప్పటికే 8 సీజన్లు పూర్తి చేసుకున్న ఈ షో ఇప్పుడు 9వ సీజన్ కూడా ఘనంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. సెప్టెంబర్ 7వ తేదీన చాలా గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షోకి సంబంధించిన రెండవ ఎపిసోడ్ మొదటి ప్రోమోని తాజాగా నిర్వహకులు విడుదల చేశారు.. తాజాగా విడుదలైన ప్రోమో లో మొదటివారం నామినేషన్స్ మొదలవ్వడమే కాకుండా సెలబ్రిటీల మధ్య కామనర్స్ చిచ్చుపెట్టారు. మరి ఈ ప్రోమోలో ఏముందో ఇప్పుడు చూద్దాం.
మొదటివారం నామినేషన్స్ షురూ..
తాజాగా విడుదల చేసిన ప్రోమోలో.. మొదటి వారానికి సంబంధించిన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అందులో భాగంగానే ప్రోమోలో బిగ్ బాస్ మాట్లాడుతూ.. “బిగ్ బాస్ ఇంట్లో ఇప్పుడు మీ అందరికీ లభించబోయే మరో ప్రయోజనం నామినేషన్ చేయడం. ఓనర్స్ అంతా చర్చించుకుని టెనెంట్స్ నుండి ఏ ఒక్కరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పండి” అంటూ బిగ్ బాస్ తెలిపారు. దీనికి ఓనర్స్ అంతా హౌస్ లోకి వెళ్లిపోయి ఒకరి పేరు చెప్పాలని డిసైడ్ అయ్యి.. అందరూ ఒకచోట చేరి సంజన గర్లాని(Sanjana garlani) పేరు చెబుతూ ఆమెను నామినేట్ చేశారు. అయితే ఈమెను నామినేట్ చేయడం వెనుక అసలు కారణాన్ని కూడా తెలిపారు కామనర్స్.
సెలబ్రిటీల మధ్య చిచ్చుపెట్టిన కామనర్స్..
మర్యాద మనీష్ (Maryada Manish) ఓనర్స్ తరఫున మాట్లాడుతూ.. “మీ వల్ల వేరే ప్లేయర్ ను కూడా ఆ హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఏదో ఒక మాట అనేయాల్సి వస్తోంది. దానివల్ల మనస్పర్ధలు మొదలవుతున్నాయి” అని మనీష్ తెలిపారు. ఆ తర్వాత సంజన మాట్లాడుతూ.. “ఆరుగురిలో ఎవరైనా నాతో చెప్పారా? ఇంట్లో నీళ్లు తాగడానికి కూడా పర్మిషన్ కావాలి అని.. ఆమె ప్రశ్నించింది. దీనికి ప్రియా శెట్టి “బిగ్ బాస్ చెప్పారు.. మేము కాదు” అంటూ ఆమె సమాధానం తెలిపింది. మర్యాద మనీష్ మాట్లాడుతూ..” మీరు అబద్ధాలు ఆడుతున్నారు” అంటూ సంజనపై ముద్ర వేసేశారు. ఇక ప్రియా కూడా మాట్లాడుతూ..” బ్యాక్ పిచ్చింగ్ చేస్తున్నారు” అంటూ చెప్పడంతో ఫైర్ అయిన సంజనా గర్లాని “నేను ఓల్డ్ స్కూల్ గర్ల్ ను , ఇలాంటి పదాలు నేను తీసుకోలేను. దయచేసి ఇలాంటి మాటలు మాట్లాడకండి” అంటూ చెప్పింది. ఆ తర్వాత ఫ్లోరా (Flora)రంగంలోకి దిగి..”ఎందుకు మీరు నేను లేనప్పుడు నా వ్యక్తిగత విషయాలపై చర్చిస్తున్నారు” అంటూ సంజన పై మండిపడింది. అలా మొత్తానికైతే కామనర్స్ చేసిన కామెంట్స్ వల్ల ఇప్పుడు సెలబ్రిటీల మధ్య చిచ్చు మొదలైందని చెప్పవచ్చు.
ALSO READ: Meenakshi Chaudhary: హైదరాబాదులో సందడి చేసిన మీనాక్షి.. గ్లామర్ తో ఆకట్టుకుంటూ!