రివ్యూ : కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర
విడుదల తేదీ : తమిళం (ఆగస్టు 28), తెలుగు (ఆగస్టు 29)
డైరెక్టర్: డొమినిక్ అరుణ్
నటీనటులు : కల్యాణి ప్రియదర్శన్, నస్లేన్ కె. గఫూర్, టోవినో థామస్, అరుణ్ కురియన్, చందు సలీంకుమార్, నిషాంత్ సాగర్, విజయరాఘవన్
నిర్మాణ సంస్థ: వేఫేరర్ ఫిల్మ్స్ (దుల్కర్ సల్మాన్)
సంగీతం: జేక్స్ బిజోయ్
Lokah – Chapter 1 : Chandra Review : ఈ వారం ప్రేక్షకులను అలరించేందుకు మలయాళ ఫాంటసీ థ్రిల్లర్ ‘కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర’ థియేటర్లలోకి వచ్చింది. ఇది భారతదేశంలో మొట్టమొదటి మహిళా సూపర్ హీరో సినిమా. వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్‌లో మొదటి భాగం. కల్యాణి ప్రియదర్శన్ (Kalyani Priyadarshan), నస్లేన్ (Naslen) ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సూపర్ హీరో సినిమాకు డోమినిక్ అరుణ్ దర్శకత్వం వహించారు. మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో థియేటర్లలోకి వచ్చిన ఈ మూవీ ప్రేక్షకులను ఎంతవరకు ఆకట్టుకుందో రివ్యూలో తెలుసుకుందాం పదండి.
కథ
“కొత్త లోక – చాప్టర్ 1: చంద్ర” గిరిజన యువతి కల్లియాన్‌కట్టు నీలీ (కల్యాణి ప్రియదర్శన్) చంద్రగా మారి, బెంగళూరులో అవయవ వ్యాపారం నడిపే మాఫియాను ఎదుర్కొనే కథ. ఆమె ఒక లక్ష్యంతో బెంగళూరుకు వెళ్లి, సన్నీ (నస్లేన్ కె. గఫూర్)ని కలుస్తుంది. అంతలోనే ఇన్స్‌పెక్టర్ నచియప్ప (శాండీ మాస్టర్) టీం, మరోవైపు మాఫియా ఆమెను టార్గెట్ చేస్తారు. ఈ క్రమంలోనే చంద్రను మాఫియా కిడ్నాప్ చేసి, బలవంతంగా మత్తు ఇంజెక్షన్ ఇస్తుంది. చేతన్ (టోవినో థామస్), మరో యుద్ధ వీరుడు (దుల్కర్ సల్మాన్)ల ఎంట్రీలు కథను మలుపు తిప్పుతాయి. సౌబీన్ షాహిర్ స్పెషల్ అప్పీరియన్స్ థ్రిల్‌ను జోడిస్తుంది. అసలు నీలీ ఎందుకు చంద్రగా మారింది? ఆమె గతం, ఆమెకున్న వ్యాధి ఏంటి? ఆమె లక్ష్యం విజయవంతమైందా? అనేది స్టోరీ.
విశ్లేషణ
భారతీయ సినిమాలో ఫస్ట్ లేడీ సూపర్ హీరో కథగా “లోకా చాప్టర్ 1: చంద్ర” మూవీతో దర్శకుడు చేసిన బోల్డ్ ప్రయత్నాన్ని మెచ్చుకుని తీరాల్సిందే. డైరెక్టర్ డొమినిక్ అరుణ్… గిరిజన యువతి నీలీని ఒక దేవతగా, తర్వాత చంద్రగా మార్చి, బెంగళూరు మాఫియాతో జరిపే పోరాటాన్ని ఆకర్షణీయంగా చిత్రీకరించారు. అయితే నీలీ గతం, చంద్రగా మారిన కారణాలు స్పష్టంగా వివరించకపోవడం కథ కన్ఫ్యూజింగ్ గా సాగుతుంది. చంద్ర వ్యాధి, గతం గురించి వివరంగా చెప్పకపోవడం అనేది ఆడియన్స్ ను ఎమోషనల్ గా డిస్కనెక్ట్ చేస్తుంది. అయితే వేఫేరర్ సినిమాటిక్ యూనివర్స్‌లో ఇదే మొదటి సినిమా. అప్ కమింగ్ సినిమాలలో మేకర్స్ ఆ క్లారిటీ ఇస్తారని ప్రేక్షకుడు సరిపెట్టుకోక తప్పదు. ఇక అక్కడక్కడా కొన్ని సీన్స్ సాగదీసిన ఫీలింగ్ కలుగుతుంది.
నిమిష్ రవి సినిమాటోగ్రఫీ బెంగళూరు డిస్టోపియన్ వాతావరణాన్ని అద్భుతంగా తెరపై ఆవిష్కరించింది. జేక్స్ బిజోయ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్, మాంటేజ్ సాంగ్‌లు థ్రిల్‌ను ఎలివేట్ చేశాయి. యానిక్ బెన్ రూపొందించిన యాక్షన్ సన్నివేశాలు, ముఖ్యంగా చంద్ర మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ బాగున్నాయి. దుల్కర్ సల్మాన్ నిర్మాణ సంస్థ వేఫేరర్ ఫిల్మ్స్ హై-క్లాస్ ప్రొడక్షన్ స్టాండర్డ్స్‌ను అందించింది.
కల్యాణి ప్రియదర్శన్ చంద్రగా ఆకట్టుకుంది. ఆమె యాక్షన్ సన్నివేశాలు, ఎమోషనల్ పెర్ఫార్మెన్స్ ఈ చిత్రాన్ని వన్-వుమెన్ షోగా మార్చాయి, నస్లేన్ కె. గఫూర్ సన్నీగా సపోర్టింగ్ రోల్‌లో,.శాండీ మాస్టర్ ఇన్స్‌పెక్టర్ నచియప్పగా విలన్ షేడ్‌లో అదరగొట్టారు, టోవినో థామస్ (చేతన్), దుల్కర్ సల్మాన్ (యుద్ధ వీరుడు) గెస్ట్ ఎంట్రీలు, సౌబీన్ షాహిర్ స్పెషల్ అప్పీరియన్స్ కథకు థ్రిల్లింగ్ గా మార్చాయి.
ప్లస్ పాయింట్స్
నటన
విజువల్స్, యాక్షన్
మ్యూజిక్
నిర్మాణ విలువలు
గెస్ట్ ఎంట్రీలు
మైనస్ పాయింట్స్
సాగదీత సన్నివేశాలు
ఎమోషనల్ కనెక్టివిటీ మిస్ అవ్వడం
కన్ఫ్యూజింగ్ స్క్రీన్ ప్లే
మొత్తానికి…
“కొత్త లోకఃచాప్టర్ 1: చంద్ర” ఒక పవర్‌ఫుల్ మహిళా సూపర్ హీరో కథ. ఈ వీకెండ్ ఫ్యామిలీతో థియేటర్లలో ఈ మూవీని చూసి చిల్ అవ్వొచ్చు. .
Lokah – Chapter 1 : Chandra Review : 2/5