Tollywood..కొంతమంది హీరోయిన్లు సినిమాల్లో నటించినప్పుడు ఎలా ఉంటారో.. ఓ పది సంవత్సరాల తర్వాత చూస్తే ఏంటి ఆ సినిమాలో నటించింది ఈ హీరోయినేనా అని భయపడేంతలా వారి రూపురేఖలు మారిపోతాయి. ఇక మరి కొంతమంది హీరోయిన్లేమో మొదట సినిమాలో నటించినప్పటి కంటే మరింత యంగ్ గా.. ఏజ్ పెరిగినా కూడా చాలా అందంగా కనిపించి, అభిమానులను ఆశ్చర్యపరుస్తూ ఉంటారు. ఇక మోస్ట్ ఆఫ్ ది హీరోయిన్లు ఫేడౌట్ అయిపోయాక గుర్తు పట్టకుండా మారిపోతూ ఉంటారు.అయితే అలాంటి హీరోయిన్లలో ప్రస్తుతం మనం చెప్పుకోబోయే హీరోయిన్ కూడా ఒకరు. అల్లు అర్జున్(Allu Arjun) నటించిన ‘ఆర్య’ సినిమాతో టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయిన ఈ ముద్దుగుమ్మ.. ప్రస్తుతం చూస్తే గుర్తుపట్టలేని విధంగా మారిపోయింది..
అల్లు అర్జున్ సినిమాతో భారీ గుర్తింపు..
ఇక విషయంలోకి వెళ్తే.. అల్లు అర్జున్ హీరోగా సుకుమార్(Sukumar) డైరెక్షన్లో వచ్చిన ఆర్య మూవీ(Arya Movie) అందరూ చూసే ఉంటారు. ఈ సినిమా ట్రయాంగిల్ లవ్ స్టోరీ. శివ బాలాజీ (Shiva Balaji),అను మెహతా, అల్లు అర్జున్ కాంబోలో ఈ సినిమా తెరకెక్కింది. ఇందులో అనూ మెహతా(Anu Mehta)ని శివబాలాజీ, అల్లు అర్జున్ ఇద్దరు ప్రేమిస్తారు. కానీ శివ బాలాజీ మీద భయంతో అను ఆయనకి ఓకే చెబుతుంది. కానీ ఆ తర్వాత అల్లు అర్జున్ వెంటపడతాడు. ఇక చివర్లో అను అల్లు అర్జున్ నే పెళ్లాడుతుంది. ఈ స్టోరీ విషయం పక్కన పెడితే.. 2004లో విడుదలైన ఆర్య సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడంతో అను మెహతా కి మంచి గుర్తింపు లభించింది.
అనూ మెహతా సినిమాలు..
ఆ తర్వాత నువ్వంటే నాకిష్టం(Nuvvante Nakishtam), మహారాజశ్రీ (Maha Raja sri) వంటి తెలుగు సినిమాల్లో అలాగే రెండు, మూడు కన్నడ సినిమాల్లో నటించింది. అయితే అనూ మెహతా నటించిన సినిమాల్లో ఆర్య మూవీ తప్ప ఇంక ఏ సినిమా కూడా అంత పెద్ద హిట్ అవ్వలేదు.దాంతో ఈ హీరోయిన్ ఇండస్ట్రీలో ఫేడౌట్ అయిపోయింది. ఇక సినిమాలకి గుడ్ బై చెప్పిన ఈమె సోషల్ మీడియాలో కూడా అంత యాక్టివ్ గా లేదు.
మద్యం తాగి రచ్చ చేసిన అల్లు అర్జున్ హీరోయిన్..
ఆ మధ్యకాలంలో చెన్నై(Chennai)లోని ఓ రిసార్ట్ లో ఫ్రెండ్స్ తో కలిసి మద్యం తాగి రచ్చ రచ్చ చేసి వార్తల్లో నిలిచింది. అయితే అనూ కి ప్రస్తుతం పెళ్ళైందా..ఆమె ఏం చేస్తుంది అనే విషయాలు కూడా ఎవరికి తెలియదు. కానీ తాజాగా అనూ మెహతాకి సంబంధించి ఒక సంచలన ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పదేళ్లలో గుర్తుపట్టలేనంతగా మారిపోయిన అనూ మెహతా..
ఆ ఫోటోలో అల్లు అర్జున్ ఆర్య మూవీలో అను ఎంతో చక్కగా అందంగా ఉంది. 2004లో అలా ఉన్న అను మెహతా 2025లో ఇలా అయిపోయింది అంటూ ఓ ఫోటో పోస్ట్ చేశారు ఒక నెటిజన్. ప్రస్తుతం ఈ ఫోటో నెట్టింట వైరల్ గా మారడంతో ఇది చూసిన చాలా మంది నెటిజెన్లు ఇదేంటి అను మెహతా ఇలా మారిపోయింది. అసలు ఈమె అనూ నేనా.. గుర్తుపట్టలేనంతగా ఉందే అంటూ ఆశ్చర్యపోతున్నారు.
Also read: Big TV Kissik talks: కావ్య దెబ్బకు నిఖిల్ లో భారీ మార్పు.. ఇది ఊహించలేదుగా!
ఆమె కాదంటున్న అభిమానులు..
అయితే అసలు ఈ ఫోటోలో ఉంది అనూ మెహతా కాదని తెలుస్తోంది. ఎందుకంటే అసలు అనూ ఫోటోకి అందులో ఉన్న మరో ఫోటోకి మధ్య కొంచెం కూడా పోలికలు లేవు. దాంతో ఈ ఫోటో అను మెహతాది కాదని ఆమె అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
ila aypoindi enti ra 😭😭😭 pic.twitter.com/9GhYI0Qs2C
— 𝑨𝒍𝒍𝒖_𝑹𝒐𝒄𝒌𝒀🗡️ (@allu_rockz4666) June 20, 2025