Big TV Kissik talks:నిఖిల్ మలియక్కల్ (Nikhil Maliyakkal).. తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమానికి గెస్ట్ గా విచ్చేశారు. తాజాగా జబర్దస్త్ వర్షా(Jabardast Varsha)హోస్ట్గా వ్యవహరిస్తున్న ఈ పాడ్ కాస్ట్ ఇంటర్వ్యూలో ఎన్నో విషయాలను పంచుకున్నారు నిఖిల్. అందులో భాగంగానే తన ప్రేమ కారణంగా ఎదుర్కొన్న ఇబ్బందుల గురించి, లైఫ్ లో ఎలాంటి అమ్మాయి కావాలని కోరుకుంటున్నాడో కూడా చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక జీవితంలో ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు అని నేర్చుకున్నానని, జీవితంలోకి వచ్చే అమ్మాయి విషయంలో మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అనుకుంటున్నాను అంటూ కూడా తెలిపారు నిఖిల్.
జీవితంలోకి అలాంటి అమ్మాయి రావాలంటున్న నిఖిల్..
అసలు విషయంలోకి వెళితే.. వర్ష మాట్లాడుతూ..”మీ జీవితంలోకి ఎలాంటి అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు?” అని ప్రశ్నించగా.. “నా తల్లి తర్వాత తల్లిలా నన్ను చూసుకునే అమ్మాయి నాకు కావాలి” అంటూ ఓపెన్ అయిపోయారు నిఖిల్. ఇప్పటివరకు జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నానని, వాటి నుంచి ఇప్పుడిప్పుడే బయటపడడానికి ప్రయత్నం చేస్తున్నానని తెలిపారు. అందులో భాగంగానే నిఖిల్ మాట్లాడుతూ..” బిగ్ బాస్ కి వెళ్లొచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయామని చాలామంది అంటున్నారు. నిజానికి నాలో మార్పు వచ్చింది.మారాలి కూడా.. కానీ అన్ని విషయాలలో మారలేదు.. కొన్ని విషయాలలో పూర్తిగా మారిపోయాను. ఇక సమస్య ఏది వచ్చిన ధైర్యంగా ఫేస్ చేయగలిగే ధైర్యం నాలో ఉంది. అందుకే జీవిత భాగస్వామి విషయంలో కూడా ఆచి తూచి అడుగులు వేయాలని నిర్ణయించుకున్నాను” అంటూ నిఖిల్ తెలిపారు.
కావ్య దెబ్బకు నిఖిల్ లో చాలా మార్పు..
నిఖిల్ చెప్పిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. ఇది చూసిన కొంతమంది నీ ప్రేయసి కావ్య దెబ్బకు నీలో ఇంత మార్పు వచ్చిందే అంటూ సరదాగా కామెంట్లు చేస్తున్నారు. తనను తల్లిగా చూసుకునే అమ్మాయి వస్తే జీవిత భాగస్వామిని చేసుకుంటానని నిఖిల్ అమ్మాయిలతో ఓపెన్ కామెంట్ చేశారు. మరి చూద్దాం భవిష్యత్తులో నిఖిల్ కి కాబోయే భార్య ఆయనను అంతకుమించి చూసుకుంటుందేమో.
నిఖిల్ – కావ్య ప్రేమాయణం..
నిఖిల్ , కావ్య(kavya ) ప్రేమ విషయానికి వస్తే.. వీరిద్దరూ కన్నడ ఇండస్ట్రీకి చెందినవారు. కానీ తెలుగులో ‘గోరింటాకు’ సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమయ్యారు. వీరిద్దరి ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీకి ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ కూడా ఉంది అని చెప్పవచ్చు. ఈ సీరియల్ చేస్తున్న సమయంలోనే ఇద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అందరికీ తెలిసిన విషయమే. అంతేకాదు పలు బుల్లితెర షోలలో కూడా వీళ్ళిద్దరూ తమ ప్రేమను బయటపెట్టారు. ఎక్కడికి వెళ్లినా చట్టా పట్టాలేసుకొని తిరుగుతూ అందరిని ఆశ్చర్యపరిచారు. ఇక పెళ్లి చేసుకుంటారు అనుకునే లోపే.. సడన్గా ఇద్దరి మధ్య బ్రేకప్ అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
Also read:Salman Khan: సల్మాన్ ఖాన్ కు మూడు భయంకరమైన వ్యాధులు… పాపం ఎలా భరిస్తున్నాడో?
నిఖిల్ – కావ్య బ్రేకప్..
ఇక ఆ బాధను భరించలేక డిప్రెషన్ లోకి వెళ్లి పోయిన నిఖిల్ కి అప్పుడే బిగ్ బాస్ సీజన్ 8 లో అవకాశం వచ్చింది. ఇక ఇక్కడ హౌస్ లో ఎమోషనల్ అయిపోయారు. హౌస్ నుండి బయటకు వెళ్ళగానే మొదట కావ్య కి సారీ చెబుతానని, బయటకు వెళ్ళిన వెంటనే తాను కలిసే మొదటి వ్యక్తి కావ్య అని ఎన్నో కామెంట్ చేశారు. తర్వాత ఇద్దరు కలిసిపోతారని అభిమానులు కూడా అనుకున్నారు. కానీ విజేతగా నిలిచి బయటకు వచ్చిన తర్వాత నిఖిల్ కావ్యను కలవలేదు. ఇంకా మళ్ళీ కలుస్తారు అనుకున్నవారికి నిరాశే మిగిలింది. ప్రస్తుతం సింగిల్ అని చెబుతున్న నిఖిల్ జీవితంలో తల్లిలా చూసుకునే అమ్మాయి రావాలని కోరుకుంటున్నారు.