Modi Putin BIG Meeting: చైనా వేదికగా మోడీ, పుతిన్ మధ్య కీలక సమావేశం జరుగుతోంది. అంతకుముందు ఒకే కారులో ఇరు దేశాధినేతలు ప్రయాణించారు. ట్రంప్‌కు చెక్ పెట్టేందుకు.. డాలర్ పెత్తనానికి ఎండ్ కార్డు వేసే ఆలోచనలో పలు దేశాలు ఉన్నాయి. మరోవైపు దేశ కరెన్సీల్లోనే చెల్లింపులు చేయాలని రష్యా చెబుతోంది. అదేవిధంగా రష్యా-ఉక్రెయిన్ యుద్ధంపై కూడా పుతిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
యుద్ధాన్ని ముగించేందుకు భారత్, చైనాలు కృషి
యుద్ధాన్ని ముగించేందుకు భారత్-చైనాలు కృషి చేశాయని చెప్పుకొచ్చారు. ఇక అమెరికా మోడీ యుద్ధం చేస్తున్న వ్యాఖ్యలకు ప్రధాని కౌంటర్ ఇచ్చారు. ఇది మోడీ వార్ కాదు.. నాటో వార్.. పశ్చిమదేశాల యుద్ధమంటూ కౌంటర్ ఇచ్చారు. ఇక షాంఘై సహకార సదస్సులో భాగంగా చైనా కూడా కీలక వ్యాఖ్యలు చేసింది. అమెరికా ఆధిపత్యం లేని సరికొత్త ప్రపంచం ఏర్పడుతోందని చెబుతోంది.
ఒకే కారులో ప్రయాణిస్తూ కన్పించిన మోడీ, పుతిన్
చైనా వేదికగా షాంఘై సహకార సదస్సు జరుగుతోంది. తొలుత ఎస్‌సీవో వేదికగానే మోడీ-పుతిన్ కలుసుకున్నారు. సదస్సు అనంతరం ఒకే కారులో ప్రయాణిస్తూ మోడీ-పుతిన్ కన్పించారు. కాగా.. తొలుత పుతిన్‌ను ఆత్మీయంగా పలకరించారు మోడీ. షేక్‌హ్యాండ్ ఇచ్చి ఆలింగనం చేసుకున్నారు. ఇక తియాన్ జిన్‌లో చర్చలు కొనసాగుతున్నట్లు మోడీ చెబుతున్నారు. ప్రస్తుతం మోడీ-పుతిన్.. భారత్‌పై అమెరికా విధించిన టారిఫ్‌ల అంశంపై చర్చిస్తున్నట్లు సమాచారం. మొత్తానికి మోడీ-పుతిన్ ఇరువురి సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
SCO సమ్మిట్ వేదికగా ప్రధాని మోడీ ఘాటు వ్యాఖ్యలు
SCO సమ్మిట్ వేదికగా పాకిస్తాన్‌పై ప్రధాని మోడీ పరోక్షంగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పాక్ ఉగ్రవాదానికి మద్దతు ఇస్తున్న దేశంగా బహిరంగంగా విమర్శించారు. పహల్గామ్ టెర్రర్ దాడిలో 26 మంది అమాయకులు దారుణంగా కాల్చి చంపబడ్డారు. అయినా టెర్రరిజంపై రాజీ ఉండబోదని స్పష్టం చేశారాయన.
Also Read: జనసేన మీటింగ్ సక్సెస్ అయ్యిందా?
టెర్రరిజం మానవాళికి పెను సవాలు -ప్రధాని మోడీ
ఆ సమయంలో కొన్ని దేశాలు భారత్‌కు మద్దతుగా నిలిచాయని.. మరికొన్ని దేశాలు బహిరంగంగా టెర్రరిజానికి మద్దతిచ్చాయని విమర్శించారు. SCO సభ్య దేశాలు టెర్రరిజాన్ని ఏకగ్రీవంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ అదే గదిలో ఉన్న సమయంలో ప్రధాని మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు. టెర్రరిజం మానవాళికి పెను సవాల్ అని పేర్కొంటూ స్ట్రాంగ్ మెసేజ్ ఇచ్చారు. టెర్రరిజంపై డబుల్ స్టాండర్డ్స్ ఆమోదయోగ్యం కాదన్నారు.