Nara Brahmani: ప్రముఖ డైరెక్టర్ బోయపాటి శ్రీను (Boyapati Srinu) దర్శకత్వంలో నటసింహా నందమూరి బాలకృష్ణ (Balakrishna) హీరోగా నటించిన చిత్రం ‘అఖండ’. 2021 లో వచ్చిన ఈ సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్లలో విడుదలైనప్పటికీ ఊహించని విజయాన్ని సొంతం చేసుకుంది. అంతేకాదు బాలయ్య కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బాస్టర్ గా నిలిచింది ఈ సినిమా. దీనికి తోడు 2021 అంటేనే అందరికీ కరోనా గుర్తుకొస్తుంది. దాదాపు థియేటర్లు మూతపడే సమయంలో కూడా కాసుల వర్షం కురిపించి తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కొత్త ఊరట కలిగించింది ఈ సినిమా. ఇందులో ప్రగ్యా జైశ్వాల్(Pragya Jaiswal) హీరోయిన్గా నటించినది. భారీ అంచనాల మధ్య వచ్చి అంతకు మించిన కలెక్షన్స్ రాబట్టి రికార్డు సృష్టించింది.
వాయిదా పడ్డ అఖండ 2..
ఈ సినిమాకి సీక్వెల్ గా ‘అఖండ 2:తాండవం’ రాబోతున్న విషయం తెలిసిందే. ఎప్పుడో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ పలు కారణాలవల్ల వాయిదా పడుతూనే వస్తోంది. పైగా ఈ ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన అటు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan), సుజీత్ కాంబినేషన్లో వస్తున్న ఓజీ (OG) సినిమాకు పోటీగా ఈ సినిమా రంగంలోకి దిగబోతోందని.. బాక్సాఫీస్ వద్ద పవన్ కళ్యాణ్ వర్సెస్ బాలకృష్ణ పోటీ ఉంటుందని అందరూ ఎంతో ఆత్రుతగా ఎదురు చూశారు. కానీ ఈ సినిమా షూటింగ్ తో పాటు ఇతర పనుల వల్ల ఆగిపోయింది. దీనికి తోడు ఈ సినిమా విడుదలను వాయిదా వేస్తున్నామంటూ ఇటీవల నందమూరి బాలకృష్ణ కూతురు, నిర్మాత తేజస్విని ఒక ప్రకటన విడుదల చేస్తూ సినిమా వాయిదా పడినట్లు స్పష్టం చేసింది .త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని కూడా ప్రకటిస్తామని స్పష్టం చేసింది.
తమన్ వల్లే ఆగిపోయిందన్న నారా బ్రాహ్మణి..
దీంతో అభిమానులందరూ నిరాశ వ్యక్తం చేశారు.. అయితే ఇప్పుడు బాలకృష్ణ మరో కూతురు నారా బ్రాహ్మణి (Nara Brahmani) ఏకంగా మ్యూజిక్ డైరెక్టర్ వల్లే సినిమా ఆగిపోయిందని చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది. అసలు విషయంలోకి వెళ్తే.. ఇటీవల జరిగిన ఎన్.బి.కె 50 ఇయర్స్ వేడుకలో నారా బ్రాహ్మణి , ఎస్ఎస్ తమన్ (SS Thaman), తేజస్విని (Tejaswini) ముచ్చటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియో కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇందులో బాలయ్య పెద్ద కూతురు నారా బ్రాహ్మణి మాట్లాడుతూ..” అఖండ 2 మీ కారణంగానే పోస్ట్ పోన్ అయింది తమన్. ఇది అన్ ఫెయిర్. దేవాన్ష్ అఖండ 2 కోసం చాలా ఎదురు చూస్తున్నారు. కానీ నీ వర్క్ కారణంగా ఇప్పుడు పోస్ట్ పోన్ అవ్వడం నిజంగా మాకు నచ్చలేదు” అంటూ ఆమె తెలిపింది. అయితే ఈ సంభాషణలో తమన్ ను ఆటపటిస్తూ నారా బ్రాహ్మణి సరదాగా అన్నట్లు మనం ఆ వీడియోలో చూడవచ్చు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది. ఏది ఏమైనా అఖండ 2 రిలీజ్ డేట్ త్వరగా ప్రకటించాలని అభిమానులు కోరుకుంటున్నారు.
also read:Allu -Mega: బామ్మ – తాతయ్యలతో అల్లు – మెగా హీరోలు.. ఎవర్ గ్రీన్ ఫోటో షేర్ చేసిన అల్లు హీరో!
Brahmani Garu’s fun banter with Thaman Anna about #Akhanda2 postponement – ‘Cinema mi valley postpone ayyindhi, this is too unfair 😜😂’@MusicThaman#NandamuriBalakrishna pic.twitter.com/8GqfHWn0fk
— Praneeth Chowdary (@praneethballa) August 31, 2025