Pushpa 2 Style Ganesh: నేడు దేశవ్యాప్తంగా వినాయక చవితి(Vinayaka Chavithi) వేడుకలను ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. భక్తిశ్రద్ధలతో గణనాథుడికి పూజలు అందిస్తున్నారు అయితే వినాయక చవితి అంటే ఇటీవల కాలంలో వివిధ రూపాలలో వినాయక విగ్రహాలను తయారు చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవల కాలంలో సినిమా హీరోల రూపంలో కూడా వినాయకుడి విగ్రహాలు దర్శనం ఇస్తున్నాయి. తాజాగా ఇలాంటి ఒక వినాయకుడి విగ్రహం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ పాన్ ఇండియా క్రేజ్ సొంతం చేసుకున్న వారిలో అల్లు అర్జున్(Allu Arjun) ఒకరు. ఈయన సినీ కెరియర్లో పుష్ప సినిమా ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా.
పుష్ప 2 స్టైల్ లో దర్శనమిచ్చిన వినాయకుడు..
ఈ క్రమంలోనే గతంలో పుష్ప స్టైల్ లో వినాయకుడి విగ్రహాలు దర్శనమివ్వగా తాజాగా పుష్ప 2(Pushpa 2) స్టైల్లో వినాయకుడి విగ్రహాలను తయారు చేయడంతో ఇది కాస్త సంచలనంగా మారింది. అల్లు అర్జున్ నటించిన పుష్ప2 సినిమాలో క్లైమాక్స్ ఫైట్ సన్నివేశం ఎంత హైలెట్ గా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సన్నివేశంలో తన అన్నయ్య కూతురిని కిడ్నాప్ చేయడంతో అల్లు అర్జున్ భయంకరమైన యాక్షన్ సన్ని వేషంలో నటిస్తారు. ఈ యాక్షన్ సీక్వెన్స్ లో అల్లు అర్జున్ ఏకంగా చీర కట్టుకొని శత్రువులపై దాడి చేస్తూ అందరిని రప్ప రప్ప నరుకుతాడు. ఈ సన్నివేశం సినిమాకి హైలైట్ గా నిలిచిందని చెప్పాలి.
రూ. 30 లక్షలతో పుష్ప 2 సెట్..
తాజాగా ఇదే స్టైల్ లో వినాయకుడి మండపాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అచ్చం అల్లు అర్జున్ గెటప్ లో వినాయకుడు విగ్రహాన్ని కూడా ప్రతిష్టించి పూజలు చేయటంతో ఇది కాస్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఇక ఈ వినాయకుడి మండపం చూస్తుంటే మాత్రం అచ్చం ఎర్రచందనంతో మండపాన్ని సిద్ధం చేశారా అనే విధంగా ఏర్పాటు చేశారు. ఇక వినాయకుడు విగ్రహానికి కూడా చీరకట్టి పూజించటం విశేషం. ఇక ఈ మండపంలో అక్కడక్కడ అల్లు అర్జున్ పుష్ప 2 సినిమాకు సంబంధించిన స్టిల్స్ కూడా ఏర్పాటు చేశారు. ఈ మండపం చూస్తుంటే అచ్చం సినిమా సెట్టును తలపిస్తుందని చెప్పాలి. ఈ సెటప్ కోసం దాదాపు 30 లక్షల రూపాయలు ఖర్చు చేశారని తెలుస్తుంది.
Mee abhimanam salla gunda ❤️🙏
Pushpa2 style setup for Ganesh mandap 🔥
Tamilnadu hosur 📍@alluarjun #AA22 #GaneshChaturthi pic.twitter.com/Ve2HwVZHfE— TotallyAlluArjun (@TeamTAFC) August 27, 2025
ఇలా అల్లు అర్జున్ పై అభిమానంతోనే ఈ విధమైనటువంటి వినాయక మండపాన్ని ఏర్పాటు చేయడమే కాకుండా అల్లు అర్జున్ పుష్ప టు స్టైల్ వినాయకుని కూడా ఏర్పాటు చేశారని చెప్పాలి. అయితే ఇది ఏర్పాటు చేసింది మన తెలుగు రాష్ట్రాలలో అనుకుంటే మనం పొరపాటు పడినట్లే. ఈ తరహా వినాయక మండపాన్ని ఏర్పాటు చేసింది తమిళనాడులోని హోసూర్ లో కావటం విశేషం. ఇలా తమిళనాడులో ఈ విధమైనటువంటి వినాయక చవితి మండపాన్ని ఏర్పాటు చేశారంటేనే అల్లు అర్జున్ క్రేజ్ ఏ స్థాయిలో ఉందో స్పష్టంగా అర్థమవుతుంది. ఇక ఈ మండపానికి సంబంధించిన వీడియోలపై అల్లు అర్జున్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తూ కామెంట్లు చేయగా కొంతమంది మాత్రం విమర్శలు కురిపిస్తున్నారు. భక్తిశ్రద్ధలతో పూజించే వినాయక చవతి పండుగ రోజు ఇలా సినిమా హీరోల రూపాన్ని ఏర్పాటు చేసి పూజించడం ఏంటి అంటూ కూడా విమర్శలు కురిపిస్తున్నారు.