Corn Silk Benefit: మొక్కజొన్న అంటే ప్రతి ఒక్కరికి ఇష్టమైన ఆహారం. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ రుచిగా తింటారు. కొందరికి కాల్చిన మొక్కజొన్న ఇష్టపడితే, మరికొందరికి ఉడికించిన కార్న్‌నే ఎక్కువగా తినడం ఇష్టపడతారు. కానీ చాలా మందికి తెలియని విషయం ఏమిటంటే… మనం తింటున్న మొక్కజొన్న గింజలకే కాదు, దానికి ఉండే మక్కజుట్టుకీ ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉంటాయి. సాధారణంగా మక్కా తినేసి దాని జుట్టు అవసరం ఉండదని పారేస్తారు. కానీ ఆ జుట్టులో దాగి ఉన్న ఔషధ గుణాలు మన శరీరానికి ఎంతో మేలు చేస్తాయి. మక్కాజుట్టు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
Also Read: Telangana Schools Holiday: విద్యార్థులకు సూపర్ గుడ్ న్యూస్.. 13 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
మొక్కజొన్న జుట్టు నీరు మరిగించి తాగితే ప్రయోజనాలు
మక్కా జుట్టును మరిగించి తాగినా, లేక దానిని జట్టుకు 30నిమిషాల పాటు అప్లై చేసిన శిరోజాలు వత్తుగా, సిల్కీగా మారడమే కాకుండా వత్తుగా పెరుగుతాయి. జుట్టు పెరగడంలో ఈ మక్కానీరు ఎక్కువగా ఉపయోగపడతుంది. మక్కజుట్టును నీటిలో మరిగించి తాగితే మూత్ర సంబంధిత ఇబ్బందులు తగ్గుతాయి. శరీరంలో ఉన్న చెడు కొవ్వు బయటకు పోవడంలో ఇది సహకరిస్తుంది. కిడ్నీ పనితీరు మెరుగుపరచడంలో ఉపయోగపడుతుందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే శరీరంలో చేరిన విషపదార్థాలను బయటకు పంపే శక్తి మక్కజుట్టులో ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు నియంత్రణలో ఉండడమే కాకుండా, గుండె ఆరోగ్యానికి కూడా దోహదం చేస్తుంది.
కడుపు ఉబ్బరం, గ్యాస్, అజీర్ణం వంటి సమస్యలను తగ్గించే శక్తి మక్కజుట్టులో ఉంది. రోగనిరోధక శక్తిని పెంచి, శరీరానికి సహజ శక్తిని ఇస్తుంది. అంతేకాకుండా దీన్ని తాగితే మధుమేహం ఉన్నవారికి రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రించడంలో తోడ్పడుతుంది. అంటే మనం సాధారణంగా వృథా చేసుకునే ఈ మక్కజుట్టు వాస్తవానికి సహజ వైద్యగుణాలు కలిగిన ఒక ఔషధంలాంటిది. కాబట్టి ఇకపై కార్న్ తినేటప్పుడు దాని జుట్టును పారేయకుండా వాడుకోవడం అలవాటు చేసుకుంటే ఆరోగ్యానికి మరింత మేలు జరుగుతుంది.