Sachin-Sara : టీమిండియా దిగ్గజ ఆటగాడు, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అయితే ఇటీవలే సచిన్ తన కుమారుడు అర్జున్ టెండూల్కర్ కి ఎంగేజ్ మెంట్ చేసిన విషయం విధితమే. ఎంగేజ్ మెంట్ అయిన తరువాత వాళ్లు ఫ్యామిలీతో కలిసి పలు దేవాలయాలకు వెళ్లారు. కొన్ని టెంపుల్స్ కి అర్జున్ హాజరు కాలేదు. సారా టెండూల్కర్ హాజరైంది. ప్రస్తుతం సారా టెండూల్కర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కంటే ఎక్కువగా సారా టెండూల్కర్ సంపాదిస్తున్నారని వార్త ఇప్పుడు ట్రెండింగ్ అవుతోంది. వాటిలో ముఖ్యంగా సచిన్ టెండూల్కర్ కి ఒక్క మ్యాచ్ సాలరీ రూ.1లక్ష తీసుకునేవారు.కానీ ప్రస్తుతం సారా టెండూల్కర్ ఒక్క ఇన్ స్టాగ్రామ్ పోస్ట్ కి రూ.10లక్షల వరకు తీసుకుంటున్నట్టు సమాచారం.
Also Read : Harbhajan Singh : భజ్జీ రియల్ హీరో…వరద బాధితుల కోసం భారీ సాయం..3 అంబులెన్సులు కూడా
వామ్మో ఒక్క పోస్ట్ చేస్తే.. 10 లక్షలా..? అంటూ అంతా ఆశ్చర్యపోవడం విశేషం. ఇదిలా ఉంటే మరోవైపు సచిన్ టెండూల్కర్ కుమార్తె సారా టెండూల్కర్ గురించి గతంలో పలు రూమర్స్ వినిపించిన విషయం తెలిసిందే. టీమిండియా టెస్ట్ కెప్టెన్ శుబ్ మన్ గిల్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు.. సోషల్ మీడియాలో వీరిద్దరూ ఒకరికొకరూ ఫాలో చేసుకోవడం.. లైకులు కొట్టడం ఇందుకు ప్రధాన కారణం అని చెప్పవచ్చు. మరోవైపు ప్రేమ విషయం గురించి సారా టెండూల్కర్ కానీ.. అటు గిల్ కానీ ఎవ్వరూ స్పందించలేదు. కానీ రకరకాలుగా రూమర్స్ అయితే వినిపించాయి. తాజాగా గోవాకు చెందిన ఆర్టిస్ట్ సిద్ధార్థ్ కేర్కర్ తో ఆమె ప్రేమలో ఉన్నట్టు వార్తలు పుట్టుకురావడం విశేషం.
ఇటీవలే సచిన్ కుమారుడు అర్జున్ టెండూల్కర్ వివాహ నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. ముంబైలోని ఓ బడా వ్యాపారవేత్త రవి ఘాయ్ మనుమరాలు సానియా చందోక్ తో అర్జున్ త్వరలోనే పెళ్లిపీటలు ఎక్కనున్నాడు. ఈ నేపథ్యంలోనే సారా టెండూల్కర్ పై రకరకాల రూమర్స్ వినిపిస్తున్నాయి. ఇన్ స్టా లో సిద్ధార్థ్ కి 90వేలకు పైగా ఫాలోవర్లు ఉన్నారు. సారా ఒక్కరనే కాదు.. వివిధ మోడల్స్ లో దిగిన ఫొటోలను సిద్దార్థ్ పోస్ట్ చేస్తూ ఉంటాడు. సారా మోడల్ అనే విషయం అందరికీ తెలిసిందే. ఇటీవలే ఆస్ట్రేలియా టూరిజం బ్రాంబ్ ఎంబాసిడర్ గా ఎంపికైంది సారా టెండూల్కర్. ముంబైలో ఓ వెల్ నెస్ సెంటర్ ను కూడా ఓపెన్ చేసింది. ముఖ్యంగా తండ్రి వారసత్వాన్ని తమ్ముడు అర్జున్ అందుకోగా.. తనకంటూ సొంత గుర్తింపు ఉండాలనే లక్ష్యంతో ఈ మధ్యకాలంలో ముంబైలో పిలాటిస్ అకాడమీ ప్రారంభించింది సారా టెండూల్కర్. సోషల్ మీడియాలో చాలా చురకుగా ఉండే సారా.. తన జీవితంలోని పలు విషయాలను పంచుకుంటుంది. తన అలవాట్లు.. ఆరోగ్య రహస్యం ఇలాంటివి వెల్లడించే తను ఈసారి పాలీసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ గురించి చెప్పింది. ఎంతో మంది అమ్మాయిలను నానా ఇబ్బందులకు గురిచేసే ఈ సమస్యను తాను ఎదుర్కొన్నానని తెలిపింది.