Janhvi Kapoor : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. గత నాలుగు దశాబ్దాలుగా మెగాస్టార్ చిరంజీవి తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్ గా సినిమాలు చేస్తున్నారు. రాజకీయ పరిస్థితుల వలన పది సంవత్సరాలు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి గ్యాప్ ఇచ్చినా కూడా మెగాస్టార్ క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు.
ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు పోటీగా సినిమాలు చేస్తున్నారు. ఈ ఏజ్ లో కూడా కష్టపడుతూ ఆడియన్స్ ను ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం చాలామంది యంగ్ డైరెక్టర్ తో చేతులు కలిపి సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు చాలామంది ఇతర భాషల్లో వచ్చిన సినిమాలు చూడగలుగుతున్నారు కానీ ఒకప్పుడు సినిమాలంటే కేవలం తెలుగు సినిమాలు మాత్రమే. ప్రతి ఇండస్ట్రీకి ఒక స్టార్ హీరో ఉన్నట్టు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఆ ప్రస్తావన వస్తే మొదటి వినిపించే పేరు మెగాస్టార్ చిరంజీవి.
మెగాస్టార్ నే పక్కన పెట్టేసారు
మెగాస్టార్ చిరంజీవిను బాలీవుడ్ పక్కన పెట్టేసింది. మెగాస్టార్ స్టామినా ఏంటో ఇప్పుడు ఉన్న యంగ్ డైరెక్టర్స్ అర్థం చేసుకోలేకపోతున్నారు అని చెప్పాలి. అసలు విషయం ఏంటంటే జాన్వి కపూర్ ప్రధాన పాత్రలో నటిస్తున్న సినిమా పరం సుందరం. సిద్ధార్థ మల్హోత్రా, జాహ్నవికాపూర్ కలిసి ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. తరుణంలో సినిమా ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ఈ ట్రైలర్ చివర్లో సౌత్ ఇండియా అని ఒక క్యారెక్టర్ చెప్పగానే తన పైన కోప్పడుతూ జాన్వి కపూర్ ఒక డైలాగ్ చెబుతుంది. తమిళనాడు రజినీకాంత్, మలయాళం మోహన్ లాల్, ఆంధ్రప్రదేశ్ అల్లు అర్జున్, కన్నడ సూపర్ స్టార్ యష్ అంటూ మాట్లాడుతుంది. మామూలుగా మోహన్ లాల్, రజనీకాంత్ వంటి సీనియర్ హీరోల పేర్లు చెప్పినప్పుడు మెగాస్టార్ చిరంజీవి పేరు పెట్టడం అనేది ఆనవాయితీ. అల్లు అర్జున్ అని చెప్పడం కొంతమంది మెగా ఫ్యాన్స్ కి బాధ కలిగిస్తుంది.
అల్లు అర్జున్ రిఫరెన్స్
ఆ సినిమా ట్రైలర్లో అల్లు అర్జున్ రిఫరెన్స్ తీసుకున్నందుకు కొంతమంది బన్నీ అభిమానులు హ్యాపీగా ఉన్నారని చెప్పాలి. అయితే ఆ రీసన్ తీసుకోవడానికి కూడా కొన్ని కారణాలు ఉన్నాయి. ఇప్పుడిప్పుడే తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా పరిచయం అవుతుంది. అయితే పుష్పా సినిమా ఎంత పెద్ద ఘనవిజయం సాధించిందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ఎక్కువగా నార్త్ ఆడియన్స్ ఆ సినిమాకు బ్రహ్మరథం పట్టారు. హిందీ మార్కెట్లో ఆ సినిమా ఒక సంచలనం క్రియేట్ చేసింది. అందుకోసమే అల్లు అర్జున్ పేరును ఉపయోగించి ఉండొచ్చు. ఇక చిరంజీవి పేరు చెప్పకపోవడం వలన బాలీవుడ్ సినిమాలను బ్యాన్ చేయడం తప్పులేదు అని కొంతమంది మెగా అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.