Pulivendula ZPTC: కడప జిల్లా పులివెందుల, ఒంటిమిట్టలో జడ్పీటీసీ ఉప ఎన్నికలకు పోలింగ్ ముగిసింది. సాయంత్రం 5 గంటల లోపు క్యూలో ఉన్నవారికి ఓటు వేసే అవకాశం కల్పించారు. ఎల్లుండి పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ బైపోల్ ఫలితాలను వెల్లడించనున్నారు.
ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, మంటపంపల్లి గ్రామాల్లో ఘర్షణలు చోటుచేసుకున్నాయి. కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదని డీఐజీ కోయ ప్రవీణ్ వెల్లడించారు. భారీ భద్రత మధ్య కడపకు బ్యాలెట్ బాక్సులను తరలిస్తున్నారు. సాయంత్రం 4 గంటల వరకు 75 నుంచి 80 శాతం వరకు పోలింగ్ నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.
పులివెందుల, ఒంటిమిట్టలో ముగిసిన పోలింగ్
క్యూ లైన్ లో ఉన్న వారికి ఓటు వేసే ఛాన్స్
పులివెందుల మండలంలోని రెండు గ్రామాల్లో గొడవలు
ఒంటిమిట్ట మండలంలోని చిన్నకొత్తపల్లి, మంటపంపల్లిలో ఘర్షణలు
కేసులు నమోదు అయ్యే స్థాయిలో గొడవలు జరగలేదన్న కడప డీఐజీ https://t.co/3Y7hmLbxBO
— BIG TV Breaking News (@bigtvtelugu) August 12, 2025
ALSO READ: EPFO: ఎంప్లాయిస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్