Siima 2025 Allu Arjun: : సౌత్ ఇండియాలో ఉన్న నటులను ఎప్పటికీ ఎంకరేజ్ చేస్తూ కొన్ని అవార్డ్స్ ని ప్రజెంట్ చేస్తుంది సైమా. సైమా అంటే సౌత్ ఇండియన్ ఇంటర్నేషనల్ మూవీ అవార్డ్స్. సైమా ఫంక్షన్ అనేది కనుల పండుగలాగా జరుగుతుంది. చాలామంది ఇష్టమైన తారలు అంతా కూడా ఒకచోట కలిస్తే చూడటానికి ఎంత ఆనందంగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు.
2025 కు సంబంధించి ఈవెంట్ దుబాయిలో జరుగుతుంది. ఈ ఈవెంట్ కి పెద్ద ఎత్తున నటులు అందరూ హాజరవుతున్నారు. సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఉన్న నటులందరూ కూడా ఒక చోట చేరి సినిమాల గురించి ప్రస్తావిస్తూ, ఆ ఈవెంట్ ని ఎంజాయ్ చేయటం అనేది ఎన్నో సంవత్సరాలుగా వస్తున్న ఆనవాయితీ. సైమా 2025 ఫంక్షన్ కూడా మొదలుకానుంది.
తెలుగులో ఉన్న పాన్ ఇండియా హీరోస్ లో అల్లు అర్జున్ ఒకరు. సుకుమార్ దర్శకత్వంలో వచ్చిన పుష్ప సినిమాతో విపరీతమైన గుర్తింపు సాధించుకున్నాడు అల్లు అర్జున్. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద తగ్గేదేలే అనే డైలాగ్ లాగానే ఎక్కడ తగ్గకుండా అద్భుతమైన రికార్డ్స్ సొంతం చేసుకుంది. అయితే అల్లు అర్జున్ లుక్ ఈ సినిమాలో చాలా డిఫరెంట్ గా ఉంటుంది. కానీ అల్లు అర్జున్ అసలైన అందం ఏంటో కొన్ని సినిమాల్లో మాత్రమే తెలుస్తుంది.
అయితే ఇప్పుడు అల్లు అర్జున్ దుబాయ్ లో జరగబోయే సైమా ఈవెంట్ కు హాజరవుతున్న ఫోటోలు వైరల్ గా మారాయి. బ్లాక్ టీ షర్టులో బన్నీ మెరిసిపోతున్నాడు. అల్లు అర్జున్ హెయిర్ స్టైల్ కూడా చాలా కొత్తగా కనిపిస్తుంది. మొత్తానికి సినిమా ఫస్ట్ లుక్కులు విడుదల అవ్వకపోయినా కూడా, ఇలాంటి ఈవెంట్స్ జరుగుతున్నప్పుడు స్టార్ హీరోలు కనిపిస్తే నెక్స్ట్ సినిమాలో లుక్కు ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకొని ఫ్యాన్స్ సంబరపడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి.
Also Read : 17 Years of Nani : మామూలు జర్నీ కాదు బాసు, ఈ తరానికి నువ్వే బాసు