BigTV English

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

17 Years of Nani : మామూలు జర్నీ కాదు, ఈ తరానికి నువ్వే బాసు

17 Years of Nani : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోగా నిలద్రోక్కుకోవడం అనేది మామూలు విషయం కాదు. అన్నిటికంటే ముందు మన మీద మనకు మంచి కాన్ఫిడెన్స్ ఉండాలి. కేవలం కాన్ఫిడెన్స్ మాత్రం ఉంటే సరిపోదు కష్టం కూడా తెలిసి ఉండాలి. కేవలం తన కష్టాన్ని నమ్ముకుని తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఊహించని స్థాయికి ఎదిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రస్తుతరంలో చాలామందికి ఇన్స్పిరేషన్ మెగాస్టార్ చిరంజీవి. ఎటువంటి బ్యాగ్రౌండ్ కూడా లేకుండా తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి తనకంటూ ఒక ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకొని ఒక మెగా కోటను నిర్మించారు.


ఒక మధ్య తరగతి వాడు అనుకుంటే ఏదైనా సాధించగలడు అనే నమ్మకంతో మెగాస్టార్ చిరంజీవిని ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలామంది తెలుగు ఫిలిం ఇండస్ట్రీ వైపు అడుగులు వేశారు. అలా అడుగులు వేసిన వాళ్లలో రవితేజ, నాని వంటి హీరోలు కూడా ఉన్నారు. ముఖ్యంగా నాని జర్నీ చాలామందికి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నాని జీవితంలో ఎంతో సాధించారు. అసిస్టెంట్ డైరెక్టర్ కెరియర్ మొదలు పెట్టిన నాని నేడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోస్ లో ఒకరుగా ఎదిగారు.

 


17 సంవత్సరాల జర్నీ 

17 సంవత్సరాల క్రితం సెప్టెంబర్ 5వ తారీఖున అష్టా చమ్మ సినిమా విడుదలైంది. ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో వచ్చిన ఆ సినిమాతో నాని నటించిన మొదలుపెట్టాడు. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన సక్సెస్ సాధించింది. ఆ తర్వాత వరుసగా నటుడుగా సినిమాలు చేయడం మొదలుపెట్టాడు. డైరెక్టర్ అవ్వాల్సిన నాని కాస్త నటుడుగా తన ప్రయాణాన్ని మలుచుకున్నాడు. అయితే తనలో కూడా ఒక దర్శకుడు ఉన్నాడు కాబట్టి ప్రస్తుతం కొత్త దర్శకులను ఎంకరేజ్ చేస్తున్నాడు.

ఈ తరానికి నువ్వే బాసు 

మామూలుగా మెగాస్టార్ చిరంజీవిని అందరూ బాసు అని పిలుస్తుంటారు. కొంతమంది అన్నయ్య అని పిలుస్తుంటారు. అలా ఈ జనరేషన్ పీపుల్ ఒకరిని ఇన్స్పిరేషన్ గా తీసుకోవాలి అంటే ఖచ్చితంగా దానిలో నాని పేరు అనేది ఉండాలి. కేవలం నటుడుగానే కాకుండా నిర్మాతగా కూడా సినిమాలు నిర్మిస్తూ, చాలామంది కొత్త దర్శకులను తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం చేసిన ఘనత నానికి మాత్రమే దొరుకుతుంది. ఇక ప్రస్తుతం శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో పారడైజ్ అనే సినిమాను చేస్తున్నాడు నాని. ఈ సినిమా కోసం నాని విపరీతంగా కష్టపడుతున్నాడు. జిమ్లో బీభత్సమైన వర్కౌట్స్ చేస్తున్నాడు. ప్రజెంట్ నాని ఫోటో ఒకటి విడుదల చేసి 17 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పారడైజ్ చిత్ర యూనిట్ శుభాకాంక్షలు తెలిపింది.

Also Read: Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Related News

Bollywood: బాలీవుడ్ లో దిగ్బ్రాంతి, ఆ ప్రముఖ నటుడు దూరమయ్యారు

Ar Muragadoss: ఇంక రిటైర్మెంట్ ఇచ్చేయండి బాసు, పెద్ద డైరెక్టర్లు వరుస ఫెయిల్యూర్స్

Nag Ashwin: ప్రధానికి నాగ్ అశ్విన్ కీలక రిక్వెస్ట్.. కొత్త జీఎస్టీ‌లో ఆ మార్పు చెయ్యాలంటూ…

Siima 2025 Allu Arjun: సైమా ఈవెంట్లో అల్లు అర్జున్, లుక్ అదిరింది భాయ్

Sujeeth: సుజీత్ కరుడుగట్టిన కళ్యాణ్ అభిమాని.. ఏం చేశాడంటే?

Big Stories

×