 
					Young Couple Swept Away: తెలంగాణలో మొంథా తుఫాన్ ప్రభావంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీగా వర్షాలు కురిశాయి. జనగామ జిల్లా తిమ్మంపేట మండలం బోళ్లమత్తిడి వద్ద స్టేషన్ ఘనపూర్–జాఫర్‌ఘడ్ రహదారి వద్ద వరద ఉధృతికి బైక్‌తో సహా యువతీ యువకుడు కొట్టుకుపోయారు. చెట్టు కొమ్మను పట్టుకుని యువకుడు బయటపడగా, యువతి గల్లంతయింది. గల్లంతైన యువతి కోసం ఎన్డీఆర్ఎఫ్ బృందాలు గాలిస్తున్నాయి.
శ్రావ్య, శివకుమార్ ఇద్దరు హైదరాబాద్ నుంచి వరంగల్ కు వెళుతున్న సమయంలో బొళ్ల మత్తటి దగ్గర వాగు ఉద్రృతంగా ప్రవహిస్తూ ఉంది. ఒక్కసారిగా అక్కడ వరద నీరు ఎక్కువైపోవడంతో బైక్ కొట్టుకొని వెళ్ళిపోయింది. ఈ క్రమంలో శివకుమార్ అక్కడున్న ఒక చెట్టును పట్టుకొని తన ప్రాణాన్ని దక్కించుకున్నాడు. కానీ ఆ వరద ప్రవాహంలో శ్రావ్య మాత్రం కొట్టుకొని వెళ్ళిపోయింది.
Read Also: Warangal Floods: మొంథా తుఫాన్ ఎఫెక్ట్.. వరంగల్ అతలాకుతలం
మొంథా తుఫాన్ ప్రేమికుల ఉసురు కూడా పోసుకుంది. ప్రేమికులను విడదీసింది. శ్రావ్య కుటుంబ సభ్యులు కన్నీరు మున్నేరుగా విలపిస్తున్నారు. శ్రావ్య క్షేమంగా ఉండాలని, తిరిగి రావాలని వారు కోరుకుంటున్నారు. ఎంత వెతికినా చుట్టుపక్కల ప్రాంతాల్లో బొళ్ళమత్తడి ప్రాంతంలో శ్రావ్య ఆచూకి మాత్రం ఇంకా కనిపించడం లేకపోవడంతో జిల్లా పోలీస్ యంత్రాంగంతో పాటు రెవిన్యూ యంత్రాంగం కూడా రంగంలోకి దిగింది.
అక్కడున్న స్థానికులు ఈ ఘటనను కొంతమంది చూశారు కానీ ఏమి చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోయారు. ప్రియుడు కూడా బైక్ ని వదిలేసి చెట్టుకొమ్మను పట్టుకుని వెళ్ళిపోతున్న ప్రియురాలను రక్షించాలని కోరినా ఏమీ చేయలేని పరిస్థితి ఏర్పడింది. వరద
ఉధృతి ఎక్కువగా ఉన్నప్పుడు, వాగులు వంకలు ప్రవహిస్తూ ఉన్నప్పుడు అలాంటి చోట్ల నుంచి ప్రాణాలకు తెగించి వెళ్ళడం శ్రేయస్కరం కాదని అధికారులు చెబుతూనే ఉన్నారు. గతంలో కూడా ఇలా చాలామంది పొంగుతున్న వరదల్లో నుంచి క్రాస్ చేసుకుంటూ వెళ్లి కార్లే కొట్టుకుపోయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇకనైన ఇలాంటి సమయంలో ప్రభుత్వ సూచనలు పాటించి ప్రయాణాలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా నాన్ స్టాప్ గా 9 గంటల పాటు వర్షం కురియడంతో కుంటలు, వాగులు నిండిపోయి రోడ్లపైకి నీరు చేరింది. తుఫాన్ కారణంగా వీచిన ఈదురు గాలిలకు చెట్లు కూలి కొన్ని చోట్ల కొంతమంది మరణించిన విషాదకర ఘటనలను కూడా చోటు చేసుకున్నాయి. మొత్తం వరంగల్ వ్యాప్తంగా ఉన్న పరిస్థితుల నేపథ్యంలో కలెక్టర్లు రంగంలోకి దిగారు. వెంటనే సహాయక చర్యలను ప్రారంభించారు.