Allu Sneha Reddy:పాన్ ఇండియా స్టార్ హీరోగా కొనసాగుతున్న అల్లు అర్జున్ (Allu Arjun) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. ప్రస్తుతం అట్లీ (Atlee) దర్శకత్వంలో వస్తున్న రాకా సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నారు. ఇదిలా ఉండగా ఈయన భార్య అల్లు స్నేహారెడ్డి (Allu Sneha Reddy) కూడా సినీ ప్రియులకు సుపరిచితమే. ప్రపంచానికి ఈమె స్టార్ హీరో సతీమణిగా పరిచయమైనప్పటికీ.. అటు.తల్లిగా ఇటు బిజినెస్ ఉమెన్ గా సోషల్ మీడియా సెలబ్రిటీగా తనకంటూ ఒక ప్రత్యేకమైన బ్రాండ్ ను సృష్టించుకున్నారు. నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ఏదో ఒక పోస్ట్ చేస్తూ నెటిజన్స్ ను ఆకట్టుకుంటున్న ఈమె అటు సోషల్ మీడియాలో కూడా భారీ ఫాలోవర్స్ ను సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. అలాంటి ఈమె డిజిటల్ సెలబ్రిటీగా దూసుకుపోతుండగా.. ఇప్పుడు తన ఖాతాలో మరో అరుదైన గౌరవాన్ని చేర్చుకున్నారు.
తాజాగా ‘బౌలీ ఆర్ట్ సంఘం’ కి కల్చర్ అండ్ హెరిటేజ్ చైర్ పర్సన్ గా నియమితురాలు అయ్యారు. ఈ విషయాన్ని అల్లు స్నేహారెడ్డి స్వయంగా తన అధికారిక ఇంస్టాగ్రామ్ ఖాతా ద్వారా అభిమానులతో పంచుకున్నారు. భారతదేశపు మొట్టమొదటి మెట్లబావుల కళా ద్వివార్షికోత్సవమైన బౌలీ ఆర్ట్ సంఘం కి కల్చర్ అండ్ హెరిటేజ్ చైర్ పర్సన్ గా నియమితురాలిగా బాధ్యతలు చేపట్టడం చాలా సంతోషంగా ఉంది. 13కి పైగా చారిత్రాత్మక మెట్ల బావులు, వారసత్వ ప్రదేశాలలో 200 మందికి పైగా కళాకారులు తమ కళను ప్రదర్షిస్తూ.. హైదరాబాద్ గొప్ప సాంస్కృతిక వారసత్వాన్ని చాటి చెప్పడానికి ఇది ఒక ప్రత్యేకమైన వేదిక కానుంది.
ఈ కార్యక్రమంలో భాగమై ముఖ్యంగా యువతరంలో హైదరాబాద్ చరిత్ర, వారసత్వం పట్ల లోతైన అవగాహనను పెంపొందించడంలో సహాయ పడాలని నేను కూడా ఆశిస్తున్నాను ..డిసెంబర్ 1 నుండి జనవరి 10 2027 వరకు ఈ ఉత్సవం జరుగుతుంది అంటూ పోస్ట్ షేర్ చేశారు అల్లు స్నేహారెడ్డి. మొత్తానికి అయితే అల్లు స్నేహారెడ్డి అందుకున్న ఈ గౌరవానికి నెటిజన్స్ , సినీ అభిమానులు, సెలబ్రిటీలు అభినందనలు తెలియజేస్తున్నారు.
ఇకపోతే కల్చర్ అండ్ హెరిటేజ్ చైర్ పర్సన్ గా ఆమె నియమితులవడంతో ఆమె బాధ్యతలు ఏంటి? అనే కామెంట్లు వ్యక్తం అవుతున్నాయి. ఇందులో యువతరంలో హైదరాబాదు నగర చరిత్ర , సంస్కృతి, మెట్ల బావుల వారసత్వం పట్ల అవగాహన, ఆసక్తిని పెంపొందించడమే ప్రధాన ఉద్దేశం.
also read:3 గంటల్లోనే ముగిసిన అనిరుధ్ లవ్ స్టోరీ..కానీ?
ఇకపోతే బౌలీ ఆర్ట్ సంఘం అధికారిక వెబ్సైట్ సమాచారం ప్రకారం.. ఈ ఉత్సవం 2026 డిసెంబర్ 1 నుండి 2027 జనవరి 10 వరకు హైదరాబాదులోని 13 కు పైగా చారిత్రక మెట్ల బావులు, వారసత్వ ప్రదేశాలలో ఈ ఉత్సవం జరగనుంది. ఇందులో 200 మందికిపైగా కళాకారులు.. ప్రదర్శనలు , సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించనున్నారు. ఈ వినూత్న కార్యక్రమాన్ని ది రైన్ వాటర్ ప్రాజెక్ట్ స్థాపకురాలు కల్పనా రమేష్, ఏక్ చిత్ర స్థాపకురాలు అన్నపూర్ణ మడిపడిగా సంయుక్తంగా ప్రారంభించారు.