E-Paper
Advertisement

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!

మృత్యుంజయుడు.. ఏనుగు రెండుసార్లు తొక్కినా చెక్కుచెదరలేదు.. ఒళ్లు గగుర్పొడిచే వీడియో!
Advertisement

Elephant Attack: ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్-డెహ్రాడూన్ జాతీయ రహదారిపై గజరాజు బీభత్సం సృష్టించింది. రోడ్డుపై వెళ్తున్న ఓ బైకర్ పై దాడి చేసిన ఏనుగు.. అతడ్ని రెండుసార్లు కాలితో తొక్కింది. అయినప్పటికీ ఆ బైకర్ ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచాడు. గురువారం తెల్లవారుజామున నేపాలి ఫామ్ సమీపంలో చోటుచేసుకున్న ఈ భయనక ఘటన తాలుకూ దృశ్యాలు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

అసలేం జరిగిందంటే?

స్థానికుల సమాచారం ప్రకారం.. గురువారం తెల్లవారుజామున 4 గంటల ప్రాంతంలో ఓ వ్యక్తి బైక్ పై వెళ్తుండగా అకస్మాత్తుగా రోడ్డుపైకి వచ్చిన ఏనుగుకు అతడు తారసపడ్డాడు. దీంతో ఒక్కసారిగా కంగారుపడ్డ బైకర్ అదుపుతప్పి కిందపడ్డాడు. దీంతో ఆ ఏనుగు అతని కడుపు, ఛాతీ భాగాలపై రెండుసార్లు కాలుతో తొక్కింది. ఏనుగు కాళ్ల కింద నలిగిపోయిన ఆ వ్యక్తి ఇక ప్రాణాలతో దక్కడం కష్టమేనని అటుగా వెళ్తున్నవారంతా భావించారు. అయితే ఏనుగు అక్కడి నుంచి అడవిలోకి వెళ్లిన వెంటనే ఆ బైకర్ తానంతట తనే లేచి నిలబడం చూసి స్థానికులు ఆశ్చర్యపోయారు.

వీడియో తీసిన క్యాబ్ డ్రైవర్

Advertisement

అయితే బైకర్ పై ఏనుగు చేసిన దాడి దృశ్యాలను అక్కడే ఉన్న క్యాబ్ డ్రైవర్ శివ శర్మ తన ఫోన్‌లో చిత్రీకరించారు. నవంబర్ 12 తెల్లవారుజామున 3:46 గంటలకు ఆయన ఈ వీడియోను తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేయడంతో అది క్షణాల్లో వైరల్‌గా మారింది. ఈ ఘటనపై శివ శర్మ స్పందిస్తూ.. ‘హరిద్వార్-డెహ్రాడూన్ మధ్య ప్రయాణం సాధారణంగా సాఫీగానే సాగుతుంది. కానీ ఎప్పుడు ఏనుగులు రోడ్డుపైకి వస్తాయో ఊహించడం కష్టం. అంతటి ప్రమాదం నుంచి ఆ బైకర్ ప్రాణాలతో బయటపడటం నిజంగా అతని అదృష్టమే’ అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.

Advertisement

Also Read: ఖాతాదారులకు బిగ్ అలర్ట్.. నవంబర్ 13న బ్యాంకులకు సెలవు.. ఎస్‌బీఐ, హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ బ్రాంచ్‌లు క్లోజ్!

వాహనదారులకు అధికారుల హెచ్చరిక

కాగా, హరిద్వార్-డెహ్రాడూన్ జాతీయ రహదారి.. రాజాజీ టైగర్ రిజర్వ్ అటవీ ప్రాంతానికి ఆనుకుని ఉంటుంది. కాబట్టి ఈ ప్రాంతంలో వన్యప్రాణులు, అడవి ఏనుగులు తరచూ రోడ్లపైకి వస్తుంటాయి. ఈ నేపథ్యంలో రాత్రిళ్లు, తెల్లవారుజామున ఈ మార్గంలో ప్రయాణించే వాహనదారులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని అటవి శాఖ అధికారులు సూచించారు. రోడ్డుపై లేదా సమీపంలో ఏనుగులు కనిపించినప్పుడు వాహనాల వేగాన్ని తగ్గించాలని కోరారు. వాటి దగ్గరకు వెళ్లే ప్రయత్నం చేయకుండా సురక్షితమైన దూరం పాటించాలని హితవు పలికారు.

Also Read: Airtel సూపర్ ప్లాన్.. రోజూ 2.5GB డేటా, కాల్స్, అమెజాన్ ప్రైమ్, 18+ ఓటీటీలు ఫ్రీ.. ఇంకా మరెన్నో!

Tags

Related News

భార్య వంట చేయడం లేదని విడాకులిచ్చిన భర్త.. కోర్టు తీర్పు ఇదే

ఘోర రోడ్డు ప్రమాదం.. ఐటీ కంపెనీ వైస్ ఛైర్మన్‌తోపాటు ఫ్యామిలీ మృతి, ఘటన ఎలా జరిగింది?

జమ్మూకశ్మీర్‌లో ఉగ్రదాడి.. జవాన్లపై ముష్కరులు కాల్పులు.. తీవ్ర ఉద్రిక్తత!

పెళ్లికి వెళ్తే పదవి నుంచి దించేస్తారా?.. మమ్ముట్టి వివాదం వెనుక అసలు కథ!

హైస్కూల్ కుర్రాడి జాక్‌పాట్.. రూ. 2.30 కోట్ల బీఎండబ్ల్యూ కారు, బహుమతి వెనుక లాజిక్ ఇదే

ఈమె తల్లి కాదు కామాంధురాలు.. ప్రియుడి మోజులో పడి, కొడుకుని చంపేంచి ఆ తర్వాత

ఢిల్లీ వాయు కాలుష్యం 3036.. లండన్ 100 కంటే తక్కువ.. అయినా హై అలర్ట్ జారీ

Big Stories

Advertisement
×