Jani Master -sekhar Master: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో ప్రముఖ డాన్స్ కొరియోగ్రాఫర్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న శేఖర్ మాస్టర్ (Sekhar Master)ప్రమాదం నుంచి బయటపడిన సంగతి తెలిసిందే. నేడు తెల్లవారుజామున శేఖర్ మాస్టర్ ప్రయాణిస్తున్న కారుపై ట్రక్ పడటంతో తీవ్రమైన ప్రమాదం చోటుచేసుకుంది అయితే ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కు అలాగే కారులో ఉన్నవారికి ఏ విధమైనటువంటి ప్రమాదం జరగకపోవడంతో అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. ఇలా శేఖర్ మాస్టర్ కారు ప్రమాదానికి (Car Accident)సంబంధించిన కొన్ని విజువల్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ ప్రమాదం జరిగిన తీరు భయంకరంగా ఉన్నప్పటికీ శేఖర్ మాస్టర్ కు అలాగే కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ప్రమాదంలో శేఖర్ మాస్టర్ కు చిన్నపాటి గాయాలు కూడా లేవని తెలుస్తుంది. ఇలా శేఖర్ మాస్టర్ ప్రమాదం గురించి బయటకు రావడంతో ఈ విషయంపై ఎంతోమంది అభిమానులు ఎన్నో రకాల సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి తరుణంలోనే మరొక డాన్స్ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్(Jani Master) ఈ ప్రమాద ఘటనపై స్పందించారు.
తాజాగా జానీ మాస్టర్ తన అధికారక సోషల్ మీడియా ఖాతా ద్వారా శేఖర్ మాస్టర్ కు జరిగిన కారు ప్రమాద ఘటన గురించి స్పందిస్తూ.. శేఖర్ మాస్టర్ కు ప్రమాదం జరిగిందనే విషయం తెలియడంతో చాలామంది ఆప్తులు, సన్నిహితులు తనకు ఫోన్ చేస్తున్నారని జానీ మాస్టర్ తెలిపారు. అయితే ఈ ప్రమాదం కాకా సినిమా(Kaaka Movie) షూటింగ్ నుంచి తిరిగి వస్తుండగా జరిగిందని జానీ మాస్టర్ తెలిపారు. తాను కూడా ఇందాకే శేఖర్ మాస్టర్ తో మాట్లాడాను అయితే ఆయన క్షేమంగా ఉన్నారని చెప్పడం చాలా సంతోషంగా అనిపించిందని జానీ మాస్టర్ తెలిపారు.
Been receiving calls from many near and dear ones enquiring about #SekharMaster’s accident while returning from the shoot of #Kaaka.
I spoke to the master and I’m happy to share that he is doing fine. He will also be joining the #Kaaka shoot this evening.
Let’s all pray for his…
— Jani Master (@AlwaysJani) November 12, 2026
శేఖర్ మాస్టర్ గారికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన తిరిగి యధావిధిగా నేడు సాయంత్రం నుంచి కాకా సినిమా షూటింగ్లో పాల్గొనబోతున్నారని జానీ మాస్టర్ తెలిపారు. శేఖర్ మాస్టర్ క్షేమంగా ఉండాలని అలాగే ప్రతి ఒక్కరు కూడా క్షేమంగా ఉండాలని మనమందరం ప్రార్థిద్దాం.. జాగ్రత్తగా ఉండండి అంటూ జానీ మాస్టర్ చేసిన ఈ పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. అయితే శేఖర్ మాస్టర్ కు ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఆయన ఎలాంటి విశ్రాంతి లేకుండా తిరిగి నేడు షూటింగ్ పనులలో యధావిధిగా పాల్గొనబోతున్నారని జానీ మాస్టర్ తెలియచేయడంతో అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇకపోతే శేఖర్ మాస్టర్ ప్రమాదం గురించి జానీ మాస్టర్ స్పందించడంతో అభిమానులు కూడా ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల డాన్సర్స్ అసోసియేషన్ విషయంలో వీరిద్దరి మధ్య పెద్ద ఎత్తున గొడవలు చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ గొడవలను పక్కనపెట్టి శేఖర్ మాస్టర్ గురించి జానీ మాస్టర్ ఇలా పాజిటివ్ గా మాట్లాడటంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: బిగ్ బాస్ హౌస్ లో శివ్ ప్రియాంక ఎంగేజ్మెంట్.. ఆడుకుంటున్న నెటిజన్స్!