E-Paper
Advertisement

మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్.. వీడియో వైరల్!

మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్.. వీడియో వైరల్!
Advertisement

Rajinikanth:సౌత్ సినీ ఇండస్ట్రీలో తన అద్భుతమైన సంగీతంతో భారీ పాపులారిటీ సంపాదించుకున్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ గత కొంతకాలంగా లవ్ రూమర్స్ ను ఎదుర్కొని.. ఎట్టకేలకు తన ప్రేయసితో ఏడడుగులు వేశారు. కోలీవుడ్ ప్రముఖ నిర్మాత కళానిధి మారన్ ఏకైక వారసురాలు, హైదరాబాద్ సన్ రైజర్స్ సీఈఓ కావ్య మారన్ తో గ్రీస్లో ఏడడుగులు వేశారు. గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారు అంటూ వార్తలు రాగా.. ఆ వార్తలను నిజం చేస్తూ ఈ జంట సినీ , రాజకీయ, వ్యాపార రంగాల దిగ్గజాల నడుమ వైవాహిక బంధం లోకి అడుగుపెట్టడం విశేషం. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో తెగ వైరల్ గా మారుతున్నాయి.

 

అనిరుధ్ రవిచందర్ పెళ్లిలో రజనీకాంత్ డ్యాన్స్ పెర్ఫార్మెన్స్..

Advertisement

ఇకపోతే అనిరుధ్ రవిచందర్ సూపర్ స్టార్ రజినీకాంత్ కు స్వయానా మేనల్లుడు అవుతాడు అన్న విషయం అందరికీ తెలిసిందే. ఇక మేనల్లుడి వివాహానికి రెండు రోజుల ముందే గ్రీస్ చేరుకున్న రజినీకాంత్ సతీసమేతంగా అక్కడ నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇకపోతే వివాహం తర్వాత జరిగిన వేడుకలలో సూపర్ స్టార్ రజినీకాంత్ అద్భుతమైన డాన్స్ స్టెప్పులతో అభిమానులను సర్ప్రైజ్ చేశారు. 75 సంవత్సరాల వయసులో కూడా ఆయన చూపించిన ఉత్సాహం అభిమానులను కట్టిపడేస్తోంది.

మనసిలాయో పాటకు సూపర్ స్టార్ అదిరిపోయే డ్యాన్స్..

రజనీకాంత్ హీరోగా , అనిరుధ్ సంగీత దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వేట్టయాన్. ఈ చిత్రంలోని మనసిలాయో పాటకు రజనీకాంత్ డాన్స్ చేశారు ఇక కొత్త దంపతులు అనిరుద్ కావ్య మారని కూడా ఆయనతో కలిసి సందడి చేశారు. ఇకపోతే ఈ వేడుకలో తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ తో పాటు మాజీ ఉప ముఖ్యమంత్రి ఉదయనిది స్టాలిన్ అలాగే పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్..

Advertisement

నవంబర్ 10 , 11 తేదీలలో గ్రీస్లో అంగరంగ వైభవంగా అనిరుధ్ , కావ్య పెళ్లి జరిగింది. ఇక ఇక్కడి సెలబ్రెటీల కోసం చెన్నైలో నవంబర్ 21న గ్రాండ్ రిసెప్షన్ ను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా ఈ వేడుకకు పలువురు సెలబ్రిటీలను, రాజకీయ ప్రముఖులను , ముఖ్యమంత్రులను కావ్య తల్లిదండ్రులు కళానిధి మారన్, కావేరి మారన్ స్వయంగా ఆహ్వానించిన విషయం తెలిసిందే . అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. మరి చెన్నైలో జరగబోయే ఈ రిసెప్షన్ వేడుక మరింత గ్రాండ్గా జరగనుంది అని చెప్పవచ్చు.

also read:తండ్రిగా ప్రమోట్ అయిన జబర్దస్త్ కమెడియన్.. వీడియో వైరల్!

రజనీకాంత్ సినిమాలు..

రజనీకాంత్ సినిమాల విషయానికొస్తే.. ఇటీవలే ప్రముఖ డైరెక్టర్ నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో జైలర్ 2 సినిమా చేసి బ్లాక్ బాస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నారు. నవంబర్ 12వ తేదీ నుండి ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వేదికగా ఓటీటీ స్ట్రీమింగ్ కూడా వచ్చేసింది. మరొకవైపు రజినీకాంత్ ధర్మన్ అనే సినిమాలో నటిస్తున్నారు. అశ్వత్ మారి ముత్తు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని రాజ్ కమల్ ఫిలిమ్స్ ఇంటర్నేషనల్ బ్యానర్ పై కమలహాసన్ నిర్మిస్తున్నారు. ఇందులో నయనతార, రాశిఖన్నా, శ్రీ లీల, సిమ్రాన్, యోగి బాబు కీలక పాత్రలు పోషిస్తుండగా.. టాలీవుడ్ హీరో రామ్ పోతినేని కూడా కీలకపాత్ర పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది ప్రేక్షకులు ముందుకు తీసుకున్నారు.

Related News

ప్రగ్యా నెలకు ఎంత సంపాదిస్తుంది..? ఒక్క సినిమా కంటే ఎక్కువే..!

ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?

అయ్యో.. మోనాల్ కు ఏమైంది..? ఇది అస్సలు ఊహించలేదుగా..

రఘువరన్-రోహిణి విడాకులకు కారణం అదేనా? తల్లి చెప్పిన కన్నీటి నిజాలు!

గోల్డెన్ లుక్‌లో మెరిసిపోతున్న షనాయా కపూర్.. ‘స్టే గోల్డెన్’ అంటూ స్పెషల్ పోస్ట్!

రాబిన్‌హుడ్ ఫ్లాప్‌కు అసలు కారణం చెప్పేసిన వెంకీ కుడుముల!

ఐదు రోజులు.. మూడు నగరాలు.. వెంకీ మామ సందడే సందడి!

Big Stories

Advertisement
×