E-Paper
Advertisement

చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?

చాగంటి ప్రవచనాలతో ‘ఇడుపు కాయితం’ అఫీషియల్ టీజర్.. ఎలా ఉందంటే?
Advertisement

Idupukayitham Teaser:వినూత్నమైన కాన్సెప్ట్ తో ఆడియన్స్ లో క్యూరియాసిటీని పెంచుతూ.. ప్రేక్షకుల ముందుకు డిసెంబర్ 11న రాబోతున్న చిత్రం ఇడుపు కాయితం. యంగ్ హీరో ప్రియదర్శి (Priyadarshi) , ఫోక్ డాన్సర్ నాగ దుర్గ (Naga Durga) జంటగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలైంది. ఇప్పటికే వైవిధ్యమైన టైటిల్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ మూవీ.. టీజర్ తో మరింత అంచనాలు పెంచేసింది. చాగంటి ప్రవచనాలతో ప్రారంభమైన ఈ ఇడుపు కాయితం అఫీషియల్ టీజర్ ఎలా ఉందో ఇప్పుడు చూద్దాం.

ఇడుపు కాయితం అఫీషియల్ టీజర్..

“రామాయణం ఎక్కడ ఆగిపోతుంది అనుకుంటామో.. అక్కడ ఒక స్త్రీ ప్రవేశిస్తుంది.అక్కడి నుండి రామాయణం ముందుకు వెళుతుంది” అనే ప్రముఖ ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు చెప్పిన డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ఈ ఒక్క డైలాగ్ కి తగ్గట్టుగానే కథలో శ్రీలత పాత్రకు ప్రాధాన్యత ఉండబోతున్నట్లు టీజర్ లో చూపించారు. ఆ తర్వాత కామెడీ, లవ్, ఫ్యామిలీ ఎమోషన్స్ తో ఈ కథను చాలా ఆసక్తికరంగా పరిచయం చేశారు. ఇందులో ప్రియదర్శి శ్రీను పాత్ర పోషిస్తుండగా.. నాగదుర్గ శ్రీలత పాత్రలో కనిపించారు.. వీరిద్దరి మధ్య పరిచయం, ప్రేమ, పెళ్లిచూపులు, వివాహం అంటూ పలు సన్నివేశాలను చాలా సరదాగా చూపించారు.

టీజర్ ఎలా ఉందంటే?

Advertisement

ఇకపోతే పెళ్లి తర్వాత ప్రతి జంట జీవితంలో ఎదురయ్యే చిన్న చిన్న సరదాలు, కుటుంబంలో జరిగే సంఘటనలు, అనుబంధాలు, అలకలు, గొడవలు వంటివన్నీ కామెడీతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్ తో చక్కగా చూపించారు.పెద్దలు కుదిర్చిన పెళ్లితో ఒక్కటైనా వీరు చివరికి విడాకుల వరకు వెళ్తారు . పెళ్లి తర్వాత శ్రీను – శ్రీలత మధ్య ఏం జరిగింది? అసలు ఎందుకు వీళ్ళిద్దరూ విడాకులు తీసుకోవాల్సి వచ్చింది?. వీరిద్దరి విడాకుల కారణంగా ఇరు కుటుంబాలలో చోటు చేసుకున్న గొడవలు ఏంటి? ఇలా కొన్ని ప్రశ్నలకు సమాధానం తెలియాలి అంటే సినిమా చూడాల్సిందే. మొత్తానికి అయితే వినూత్న కథాంశంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రం డిసెంబర్ 11న ఏ విధంగా ఆడియన్స్ ని మెప్పిస్తుందో చూడాలి.

also read:శేఖర్ మాస్టర్ పరిస్థితి ఇప్పుడు ఎలా ఉంది?

వెండితెరకు పరిచయం కాబోతున్న శివజ్యోతి..

Advertisement

ఇక ఎప్పట్లాగే ప్రియదర్శి తన కామెడీ టైమింగ్ తో ఆకట్టుకున్నారు. ఇక నాగ దుర్గ శ్రీలతగా కనిపించి మెప్పించే ప్రయత్నం చేసింది. తెలంగాణ పల్లెటూరి వాతావరణం, సహజమైన సంభాషణలు, కుటుంబ నేపథ్యం అన్నీ కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇకపోతే ఈ చిత్రం ద్వారా ప్రముఖ యాంకర్ శివజ్యోతి వెండితెరకు పరిచయం అవుతుంది. ఇక టీజర్ లో రివీల్ చేసినట్టుగా ఈమె ప్రియదర్శికి అక్క పాత్ర పోషిస్తున్నట్లు చూపించారు. ఈ చిత్రం ద్వారా నూతన దర్శకుడు వంశీ రెడ్డి దొండపాటి దర్శకుడిగా ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. సుకుమార్ రైటింగ్స్, బన్నీ వాసు వర్క్స్ బ్యానర్లపై ఈ చిత్రాన్ని నిర్మించారు.

 

Related News

50 ఏళ్లు దాటినా నటి సితార ఎందుకు పెళ్లి చేసుకోలేదో తెలుసా..?

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారుకు ప్రమాదం.. డాక్టర్లు ఏం చెప్పారంటే..?

మేనల్లుడి పెళ్లిలో డ్యాన్స్ తో అదరగొట్టేసిన రజినీకాంత్.. వీడియో వైరల్!

ప్రగ్యా నెలకు ఎంత సంపాదిస్తుంది..? ఒక్క సినిమా కంటే ఎక్కువే..!

ప్రేమలో పడ్డ నస్లేన్.. హీరోయిన్ ఎవరంటే?

అయ్యో.. మోనాల్ కు ఏమైంది..? ఇది అస్సలు ఊహించలేదుగా..

రఘువరన్-రోహిణి విడాకులకు కారణం అదేనా? తల్లి చెప్పిన కన్నీటి నిజాలు!

Big Stories

Advertisement
×