Pragya Jaiswal : తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేని పేరు ప్రగ్యా జైస్వాల్.. ఈమె వరుణ్ తేజ్ నటించిన కంచె మూవీతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ సినిమా భారీ విజయాన్ని అందుకోవడంతో ఆ తర్వాత వరుసగా హిట్ సినిమాలలో నటించే అవకాశం కూడా అందుకుంటూ వచ్చింది.. ఒక్క సినిమాతో తన క్రేజ్ ని పెంచుకున్న ఈ ముద్దుగుమ్మ తన నటనతో మొదటి సినిమాతోనే అభిమానులను పెంచుకుంది.. ఒకవైపు చేతినిండా సినిమాలు ఉన్నప్పుడు కూడా సోషల్ మీడియాలో హైపర్ ఆక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ వచ్చేది. తన గురించి ఆసక్తికరమైన విషయాలను కూడా పంచుకునేది. తాజాగా ఈమె సంపాదన గురించి సోషల్ మీడియాలో ఒక వార్త చక్కర్లు కొడుతుంది.. నెలకు ఈమె ఎన్ని లక్షలు సంపాదిస్తుంది అన్న ప్రశ్న ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మరి ఈ అమ్మడు నెలకు ఎంత సంపాదిస్తుందో ఇప్పుడు ఒకసారి మనం వివరంగా తెలుసుకుందాం..
టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేక ఇమేజ్ ని సంపాదించుకున్న హీరోయిన్లలో ప్రగ్యా జైస్వాల్ ఒకరు. మొదటి సినిమాతోనే ఫ్యాన్ ఫాలో ఇన్ని సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత సీనియర్ హీరోల సరసన జోడి కట్టింది. బాలకృష్ణ వంటి స్టార్ హీరోలతో ఆమె చేసిన సినిమాలు బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. దాంతో ఇప్పటికీ ఆమె సినిమాలతో బిజీగా మారెందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇది ఒక వైపు సినిమాల కోసం ప్రయత్నిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో తన లేటెస్ట్ ఫోటోలను షేర్ చేస్తూ అభిమానులకు నిద్రలేకుండా చేస్తుంది. ఈమె షేర్ చేసే ప్రతి ఒక్క ఫోటో ఎంత ట్రెండ్ అవుతాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే సోషల్ మీడియా ద్వారా ఈమె దాదాపు నెలకు 15 లక్షల వరకు సంపాదిస్తుంది అని ఓ వార్త షికారు చేస్తుంది. మరి నిజంగానే సినిమాలు కన్నా ఎక్కువగానే ఇక్కడ సంపాదిస్తుంది అన్న వార్తలు కూడా వినిపిస్తున్నాయి. నిజంగానే ఈమె సోషల్ మీడియా ద్వారా అన్ని లక్షలు సంపాదిస్తుందా? లేదంటే ఇది కేవలం గాలి వార్తలేనా అన్నది తెలియాలి అంటే ప్రగ్య రియాక్ట్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే..
టాలీవుడ్ ఇండస్ట్రీలో కంచె మూవీతో ప్రేక్షకులకు పరిచయమైంది ప్రగ్యా జైస్వాల్. ఆ సినిమా మంచి సక్సెస్అందుకోవడంతో పాటు.. టాలీవుడ్ లో వరుసగా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంది. ప్రస్తుతం తెలుగు, తమిళ సినిమాలలో నటిస్తూ తన సత్తాను చాటుతోంది. ఈ మధ్య ‘ది సబర్మతీ రిపోర్ట్’ అనే హిందీ సినిమాలో నటించి గుర్తింపు తెచ్చుకుంది.. ఇండస్ట్రీ తో సంబంధం లేకుండా వరుసగా సినిమాలను లైన్లో పెడుతూ బిజీ గా ఉంటుంది.. ఈ ఏడాది బాలయ్య తో కలిసి డాకు మహారాజ్ అనే సినిమాలో నటించింది. ఆ సినిమా మిక్స్డ్ టాక్ ని అందుకున్న కూడా కలెక్షన్ల పరంగా దుమ్ము దులిపేసింది.. ఆ తర్వాత మరో రెండు భారీ ప్రాజెక్టులతో ప్రేక్షకులు ముందుకు వచ్చింది. ఒకవైపు సైలెంట్ గానే సినిమాలని లైన్లో పెట్టుకుంటూ వస్తున్న ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో కూడా హైపర్ యాక్టివ్ గా ఉంటూ తన ఫోటోలను షేర్ చేస్తుంది తాజాగా ఆమె షేర్ చేసిన ఫోటోలు ప్రస్తుతం ట్రెండ్ అవుతున్నాయి. మరి ఆ ఫోటోలు ఎలా ఉన్నాయో మీరు కూడా ఒకసారి చూసేయండి..
Also Read :అయ్యో.. మోనాల్ కు ఏమైంది..? ఇది అస్సలు ఊహించలేదుగా..