Sekar Master : టాలీవుడ్ స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైనట్లు సమాచారం. హైదరాబాద్ శంషాబాద్ సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘కాకా’ సినిమాకు సంబంధించిన ఒక పాట షూటింగ్ కోసమని అక్కడికి వెళ్లిన శేఖర్ మాస్టర్ తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ముచ్చింతల్ లో జరుగుతున్న చిరంజీవి కాక సినిమా షూటింగ్ ముగించుకుని తిరిగి హైదరాబాద్ వస్తున్న క్రమంలో ప్రమాదం జరిగింది. ఉదయం 6 గంటలకు ముచ్చింతల్ సమీపంలో నాలుగు రోడ్ల కూడలి దగ్గర కారు ను ఒక పండ్ల లారీ ఢీకొట్టినట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో కారు వెనుక భాగం మొత్తం బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ఎదురుగా వాహనాలు ఏమి రాకపోవడంతో పెద్దగా ప్రమాదం జరగలేదని తెలుస్తుంది అయితే ఈ ప్రమాదంలో కారులో ఉన్న శేఖర్ మాస్టర్ కి గాయాలు అయినట్లు సమాచారం. శేఖర్ మాస్టర్ కారుకి ప్రమాదం జరిగిందన్న వార్త ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది..ప్రస్తుతం శేఖర్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉంది? ఆయనకి ఏదైనా బలమైన గాయాలు తగిలాయా? అన్నది మాత్రం త్వరలోనే తెలిసే అవకాశం ఉంది.. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు సమాచారం.
టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రస్తుతం టాప్ ప్లేసులో ఉన్న కొరియోగ్రాఫార్లలో మొదటగా వినిపించే పేరు శేఖర్ మాస్టర్.. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమాలన్నిటికీ కూడా ఈయన కొరియోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి, డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ‘ కాకా ‘ మూవీకి కొరియోగ్రాఫర్ గా ఈయన చేస్తున్న విషయం తెలిసిందే.. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్ శంషాబాద్ లోని ముచ్చింతల్ లో జరుగుతుంది. ఈ క్రమంలో షూటింగ్ కోసమని శేఖర్ మాస్టర్ అక్కడికి వెళ్లి తిరిగి వస్తూ ఉండగా ఉదయం 6 గంటలకు ఈ ప్రమాదం జరిగిందని తెలుస్తుంది. కారు ప్రమాదానికి గురైన సమయంలో శేఖర్ మాస్టర్ తో పాటుగా ఆయన అసిస్టెంట్లు కూడా అదే కారులో ఉన్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన పై కేసు నమోదు చేసుకున్న పోలీసులు ప్రమాదం జరగడానికి గల కారణాలు ఏంటి అన్న కోణంలో దర్యాప్తు చేపడుతున్నారు. త్వరలోనే ఈ ప్రమాదానికి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడించే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది..
శేఖర్ మాస్టర్ కారుకు సంబందించిన ప్రమాదంలో లోడుతో వెళ్తున్న పండ్ల లారీ వేగంగా వచ్చి కారును వెనకాల నుంచి ఢీ కొట్టినట్లు తెలుస్తుంది. ఈ క్రమంలో వెనుక భాగం బాగా దెబ్బతిన్నట్లు తెలుస్తుంది. ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉన్నప్పటికీ ఎలాంటి ప్రాణ నష్టం జరగకపోవడంతో ఆయన కటుంబ సభ్యులు, సినీ పరిశ్రమ వర్గాలు ఊపిరి పీల్చుకున్నాయి. సమీపంలోని ఆసుపత్రిలో ఆయనని చేర్పించినట్లు తెలుస్తుంది అయితే ప్రస్తుతం చిన్న గాయాలతో బయటపడిన శేఖర్ మాస్టర్ కు చికిత్స జరుగుతుంది మరి ఆయన పరిస్థితి ఎలా ఉంది ఇంకేదైనా పెద్ద గాయాలు ఏమైనా తగిలాయా అన్న వివరాలను డాక్టర్లు త్వరలోనే వెల్లడించనున్నారని టాక్. శేఖర్ మాస్టర్ కారుకి ప్రమాదం జరిగిందని తెలియగానే టాలీవుడ్ ఇండస్ట్రీలోని పలువురు ప్రముఖులు ఆయన గురించి తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలుస్తుంది మరి శేఖర్ మాస్టర్ పరిస్థితి ఎలా ఉందో అన్నది మరికాసేపట్లో తెలిసే అవకాశం ఉంది..
Also Read :‘గోదావరి ‘ సీరియల్స్ లవర్స్ బిగ్ షాక్.. హీరో అవుట్..